IND vs WI: టీమిండియా గొప్ప టీమే కావొచ్చు - కానీ షాకివ్వడానికి మేం రెడీ : బ్రియాన్ లారా
మరో రెండు రోజుల్లో డొమినికా వేదికగా భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య జరుగబోయే తొలి టెస్టు కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్న తరుణంలో విండీస్ పర్ఫార్మెన్స్ మెంటార్ లారా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
IND vs WI: నెల రోజుల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న భారత జట్టు.. ఈనెల 12 నుంచి వెస్టిండీస్‌తో వారి సొంతగడ్డపై జరుగబోయే తొలి టెస్టుకు సిద్ధమవుతోంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత జట్టు.. వెస్టిండీస్ సిరీస్ తోనే కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ (2023 - 2025)ను ప్రారంభించనుంది. మరో రెండ్రోజుల్లో మొదలుకాబోయే తొలి టెస్టు నేపథ్యంలో విండీస్ మాజీ సారథి, ప్రస్తుతం ఆ జట్టుకు పర్ఫార్మెన్స్ మెంటార్‌గా ఉన్న బ్రియాన్ లారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బలమైన జట్టే అయినా తాము మెరుగ్గా ఆడతామని అన్నాడు.
తొలి టెస్టుకు ముందు డొమినికాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లారా మాట్లాడుతూ.. ‘ఈనెల 12 నుంచి మాకు రెండు కీలక టెస్టు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్‌తో ఆడబోయే రెండు టెస్టులూ మాకు ఎంతో ముఖ్యం. స్వదేశంలోనే గాక విదేశాల్లో కూడా భారత్ చాలా బలమైన జట్టు. అయితే మేం కూడా యువకులు, అనుభవజ్ఞులతో కూడిన జట్టుగా ఉన్నాం. క్రెయిగ్ బ్రాత్‌వైట్ సారథ్యంలో మేం కొద్దిరోజులు క్యాంప్ కూడా ఏర్పాటుచేశాం...
యువ క్రికెటర్లు రాణించడానికి సిద్ధంగా ఉన్నారు. భారత్ చాలా కఠినమైన ప్రత్యర్థి అని తెలుసు. కానీ మేం మెరుగైన ప్రదర్శన చేస్తే ఆ జట్టును ఓడించడం కష్టమైతే కాదు.. జట్టులోకి కొత్తగా వచ్చిన కుర్రాళ్లు చాలా టాలెంటెడ్. కొత్తగా టీమ్‌లోకి వచ్చేవారికి అంతర్జాతీయ మ్యాచ్‌లు కొత్త అయినా దేశవాళీలో వారికి ఆడిన అనుభవం ఉంటుంది. భారత్ వంటి కఠిన ప్రత్యర్థులతో ఆడినప్పుడు వాళ్ల టాలెంట్ బయటపడుతుంది..’ అని చెప్పాడు.
Some words of advice to the two freshly called up players from WI Performance Mentor,@BrianLara #WIvIND #MenInMaroon pic.twitter.com/rt8RbmFmOn
— Windies Cricket (@windiescricket) July 8, 2023
కాగా తొలి టెస్టుకు గాను క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ఇటీవలే 13 మందితో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 13 మందితో కూడిన ఈ జట్టులో ఇద్దరు కొత్త కుర్రాళ్లకు అవకాశం దక్కింది. రెండేండ్ల తర్వాత స్పిన్ ఆల్ రౌండర్ రకీం కార్న్‌వాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
తొలి టెస్టుకు వెస్టిండీస్ జట్టు : క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగినరైన్ చందర్పాల్, రకీం కార్న్‌వాల్, జోషువా డి సిల్వ, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జొమెల్ వారికన్
ట్రావెలింగ్ రిజర్వ్స్ : టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్
Straight from Dominica 👍 👍
— BCCI (@BCCI) July 9, 2023
Getting into the Test groove 👌 👌#TeamIndia | #WIvIND pic.twitter.com/uSGFWOHiYR
ఇండియా - వెస్టిండీస్ టెస్ట్ షెడ్యూల్ :
- జులై 12 నుంచి 16 వరకూ తొలి టెస్టు : డొమినికా
- జులై 20 నుంచి 24 వరకూ రెండో టెస్టు : ట్రినిడాడ్
భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచులు మొదలవుతాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial