IND vs WI 3rd ODI Rain: మూడో మ్యాచ్‌కు అడ్డం పడ్డ వరుణుడు - వాన కారణంగా ఆగిన ఆట!
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో వన్డేకు వర్షం ఆటంకం కలిగించింది.
టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో వన్డేను వర్షం అడ్డుకుంది. టీమిండియా ఇన్నింగ్స్‌లో 24 ఓవర్ల తర్వాత వర్షం పడటంతో ఆట వాయిదా పడింది. అయితే ఇప్పుడు వర్షం పడింది కాబట్టి ఓవర్లను కుదిస్తారేమో చూడాలి. ఒకవేళ వర్షం తగ్గకపోతే మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. భారత్ ఈ సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకుంది.
వాన కారణంగా ఆట ఆగే సమయానికి టీమిండియా 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (58: 74 బంతుల్లో, ఏడు ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (51 నాటౌట్: 65 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీలు చేసుకున్నారు. ఆట ఆగడానికి సరిగ్గా ఒక్క ఓవర్ ముందు శిఖర్ ధావన్ అవుటయ్యాడు. గిల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (2 నాటౌట్: 6 బంతుల్లో) క్రీజులో ఉన్నాడు. ధావన్ వికెట్‌ను హేడెన్ వాల్ష్ దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్‌కు వెస్టిండీస్ తుదిజట్టు
షాయ్ హోప్ (వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, షామరా బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), కీసీ కార్టీ, కీమో పాల్, హేడెన్ వాల్ష్, జేడెన్ సీల్స్, అకిల్ హుస్సేన్, జేసన్ హోల్డర్
మూడో వన్డేకు టీమిండియా తుదిజట్టు
శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయర్ అయ్యర్, సంజు శామ్సన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, అక్షర్ పేల్, యుజ్వేంద్ర చాహల్, ప్రసీద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
View this post on Instagram