అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs WI: రాణించిన రోహిత్‌, జైస్వాల్, కోహ్లీ- రెండో టెస్టులో మొదటి రోజు 288 పరుగులు చేసిన టీమిండియా

IND vs WI: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ ట్రినిడాడ్లో జరుగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 288 పరుగులు చేసింది.

India vs West Indies 2nd Test 1st Day: ట్రినిడాడ్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు టీమిండియా 288 పరుగులు చేసింది. నాలుగు వికెట్లను కోల్పోయింది. మరోసారి ఓపెనింగ్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, జశ్వంత్‌ జైస్వాల్‌ అద్భుతంగా రాణించి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. 

రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజు కెప్టెన్ రోహిత్ శర్మ 143 బంతులు ఎదుర్కొని 80 పరుగులు చేస్తే జైస్వాల్ 74 బంతుల్లో 57 పరుగులు చేశాడు. 500వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. ప్రస్తుతం 87 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు విరాట్‌. అతనికి రవీంద్ర జడేజా 36 పరుగులతో తోడుగా ఉన్నాడు. విండీస్‌ బౌలర్లలో జాసన్ హోల్డర్‌, జోమెల్ వారికన్‌, కెమర్‌ రోచ్, షానన్ గాబ్రియల్ తలో వికెట్ తీశారు. 

కోహ్లీ, రవీంద్ర జడేజా అద్భతమైన బ్యాటింగ్‌తో విండీస్ బౌలర్లను అడ్డుకున్నారు. ఆఖరిల సెషన్‌లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆ టైంలో వీళ్లు 33.2 బంతులు ఎదుర్కొని 106 పరుగులు చేశారు. మొత్తంగా మొదటి రోజు విండీస్‌ బౌల‌ర్లు 84 ఓవర్లు బౌల్ చేశారు. కోహ్లీ మొదటి బంతి నుంచి చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. తొలి రన్ చేసేందుకు అతను 20 బంతులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండో రోజు ఆలో విరాట్‌ 14 పరుగులు చేస్తే ఐదేళ్ల తర్వాత విదేశీ గడ్డపై సెంచరీ చేసినట్టు అవుతుంది. 2018 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఓవర్‌సీస్‌లో అతను సెంచరీ చేయలేదు. 

కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి స్టంప్స్‌కు అవతలి వైపు నాల్గో స్టంప్‌ దిశగా విండీస్‌ బౌలర్లు బంతులు వేశారు. కోహ్లీ తరచూ ఈ బంతులను టచ్ చేసి అవుట్ అవ్వడం తెలిసిందే. విండీస్ బౌలర్లు అదే స్ట్రాటజీని ఇక్కడ ఫాలో అయ్యారు. అయితే కోహ్లీ చాలా చాకచక్యంగా ఆడి 86 పరుగులు సాధించారు. 

ఉదయం సెషన్‌లో పరుగులు కాస్త వేగంగా వచ్చిన మధ్యాహ్నానికి పిచ్‌ స్వభావం పూర్తిగా మారిపోయింది. దీంతో పరుగులు రావడం కష్టమైపోయింది. మధ్యాహ్నం 24.4 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసింది. టీ విరామానికి రోహిత్, జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (12 బంతుల్లో 10), అజింక్యా రహానే (36 బంతుల్లో 8) ఔట్‌ కావలసి వచ్చింది. 

జైస్వాల్‌ని మొదటి స్లిప్‌లో కిర్క్ మెకెంజీ అద్బుతమైన క్యాచ్‌ పెవిలియన్ పంపించారు. ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఆ యాంగిల్‌లో చాలా స్కోరు చేయగలిగాడు జైస్వాల్. దీంతో ఫీల్డింగా మార్చిన విండీస్... గల్లీ ఫీల్డర్‌ను వెనక్కి పంపించి తన వ్యూహాన్ని అమలు చేసింది. అనుకున్నట్టుగానే జైస్వాల్ దొరికిపోయి అవుట్ అయ్యాడు. 

జైస్వాల్‌ వెళ్లిన తర్వాత వచ్చిన గిల్ మరోసారి నిరాశపరిచాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అయ్యాడు. రోచ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేస్తూ గిల్‌కు ఉచ్చు బిగించాడు. ఓ గుడ్‌ లెంగ్త్‌ బాల్‌కు గిల్ దొరికిపోయాడు. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాసేపటికే వారికన్ బౌలింగ్‌లో రోహిత్ ఔటయ్యాడు. రహానే (36 బంతుల్లో 8) గాబ్రియేల్‌కు చిక్కాడు. లంచ్ విరామానికి వికెట్లు నష్టపోకుండా 121 పరుగులు చేసిన టీమిండియా టీ బ్రేక్ సమాయానికి నాలుగు వికెట్లను కోల్పోయింది. 

ఇరు జట్ల మధ్య జరుగుతున్న వంద టెస్టుకావడంతో భారత్, వెస్టిండీస్ కెప్టెన్‌లకు బ్రియాన్ లారా ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Embed widget