By: ABP Desam | Updated at : 29 Jul 2023 10:09 PM (IST)
మ్యాచ్ జరుగుతున్న బార్బడోస్ మైదానం ( Image Source : BCCI Twitter )
ఇండియా, వెస్టిండీస్ రెండో వన్డేకు వర్షం కారణంగా ఆటంకం కలిగింది. వర్షం కారణంగా ఆట ఆగే సమయానికి భారత్ 24.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత్‌కు మంచి ప్రారంభం లభించినా కేవలం 23 పరుగుల తేడాలోనే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55: 55 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), శుభ్‌మన్ గిల్ (34: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు) టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. జేడెన్ సీల్స్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన శుభ్‌మన్ గిల్ ఫాంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడటం ప్రారంభించాడు. కైల్ మేయర్స్, జేడెన్ సీల్స్, అల్జారీ జోసెఫ్ ఇలా ప్రధాన బౌలర్లందరి బౌలింగ్‌లో ఫోర్లు సాధించాడు.
మోతీ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ మొదటి బంతికి సింగిల్‌తో ఇషాన్ కిషన్ అర్థ సెంచరీ సాధించాడు. అదే ఓవర్ ఐదో బంతికి శుభ్‌మన్ గిల్‌ను అవుట్ చేసిన మోతీ వెస్టిండీస్‌కు మొదటి వికెట్ అందించాడు. అక్కడి నుంచి భారత్ పతనం ప్రారంభం అయింది. తర్వాతి ఓవర్లోనే రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. భారీ షాట్ కొట్టబోయి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఆలిక్ అథనజ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఆశ్చర్యకరంగా అక్షర్ పటేల్‌ను (1: 8 బంతుల్లో) టీమిండియా కీలకమైన సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపింది. ఇటీవల కాలంలో ఏ జట్టు అయినా చేసిన అత్యంత ఘోరమైన వ్యూహాత్మక తప్పిదం ఏదైనా ఉంటే ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే మరో మూడు నెలల్లో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. సెకండ్ డౌన్‌లో ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం గాయపడ్డాడు. వరల్డ్ కప్‌లో ఆడటం కూడా డౌటే. ఇలాంటి సమయంలో ఒక స్పెషలిస్టు బ్యాటర్‌ను సెకండ్ డౌన్‌లో పరీక్షించకుండా స్పిన్ ఆల్‌రౌండర్ అయిన అక్షర్ పటేల్‌ను పంపారు. దీనిపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోనీ అక్షర్ రాణించాడా అంటే అదీ లేదు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో భారత్ మూడో వికెట్ కూడా కోల్పోయింది.
అనంతరం 24వ ఓవర్ ఆఖరి బంతికి హార్దిక్ పాండ్యా (7: 14 బంతుల్లో), 25వ ఓవర్ మొదటి బంతికి సంజు శామ్సన్ (9: 19 బంతుల్లో) అవుటయ్యారు. ఆ వెంటనే వర్షం పడటంతో ఆటకు అంతరాయం కలిగింది. అప్పటికి టీమిండియా 24.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (0: 0 బంతుల్లో) ఉన్నాడు.
వెస్టిండీస్ తుది జట్టు
బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్
భారత్ తుది జట్టు
శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శామ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్
Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ పొడిగింపు
Mukesh Kumar: ఘనంగా టీమిండియా పేసర్ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు
Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్ గన్
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌నకు నమీబియా, వరుసగా మూడోసారి అరుదైన ఘనత
Ishan Kishan: ఇషాన్ కిషన్ ఆ తప్పు చేయకుండా ఉంటే...
Telangana Elections Exit Polls: సాయంత్రం 5.30 నుంచే ABP CVoter ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
Telangana Elections 2023: మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం, ఓటర్లు నిలదీయడంతో పోలింగ్ బూత్ నుంచి బయటకు!
Salman Khan: టిక్కెట్ల ధరల తగ్గింపే కొంప ముంచింది, సల్మాన్ కవరింగ్ భలే ఉందిగా!
Fact Check: ఆలియా భట్ డీప్‌ఫేక్ వీడియో - ఫస్ట్ పోస్ట్ ఇండోనేషియాలో, వాస్తవాలు ఇవే
/body>