అన్వేషించండి

IND vs SL Series 2023: భారత క్రికెట్ లో మొదలైన దశలవారీ విధానం- ప్రపంచకప్ లపై బీసీసీఐ దృష్టి

IND vs SL Series 2023: భారత క్రికెట్ లో దశలవారీ అభివృద్ధిని బీసీసీఐ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముందుగా.. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్ పై బీసీసీఐ దృష్టి పెట్టింది.

 IND vs SL Series 2023:  శ్రీలంకంతో జనవరిలో ప్రారంభం కానున్న 3 మ్యాచ్ లో టీ20 సిరీస్ కు బీసీసీఐ నిన్న భారత జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్ త్రయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కు చోటు దక్కలేదు. వీరిని ఎంపిక చేయకపోవడానికి కారణాన్ని కూడా సెలక్టర్లు తెలపలేదు. దీన్నిబట్టి టీ20ల్లో కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వటంపై బీసీసీఐ దృష్టి పెట్టిన్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ఇక ఈ త్రయానికి పొట్టి ఫార్మాట్లో స్థానం ఉండకపోవచ్చునని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

దశలవారీ విధానం

భారత క్రికెట్ లో 'దశలవారీ' అభివృద్ధిని బీసీసీఐ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముందుగా.. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్ పై బీసీసీఐ దృష్టి పెట్టింది. ఇందుకోసం యువకులు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఫాంలో లేనివారిని పక్కన పెట్టింది. ఇటీవల పెద్దగా రాణించని శిఖర్ ధావన్, రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్ లను జట్టులోకి తీసుకోలేదు. అలాగే ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న రాహుల్ ను వైస్ కెప్టెన్ గా తొలగించింది. అతని స్థానంలో వన్డేల్లో రోహిత్ కు డిప్యూటీగా హార్దిక్ పాండ్యను నియమించింది. 

కుర్రాళ్లతో కూడిన టీ20 టీం

ఇక టీ20ల్లో సీనియర్ ఆటగాళ్లను పూర్తిగా పక్కనపెట్టింది సెలక్షన్ కమిటీ. రోహిత్ వేలి గాయం నుంచి కోలుకోనందున అతడిని తీసుకోలేదు. ఇక కోహ్లీ, రాహుల్ లను టీ20 జట్టులోకి ఎంపిక చేయలేదు. రోహిత్ ను టీ20 ఫార్మాట్ కెప్టెన్ గా తొలిగించినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అయితే అతను కోహ్లీ, రాహుల్ తో పాటు క్రమంగా ఈ ఫార్మాట్ నుంచి దూరమవుతాడు. ప్రస్తుతం రోహిత్ శిక్షణ ప్రారంభించినప్పటికీ బొటనవేలి గాయం పూర్తిగా నయం కాలేదు. అయితే దశలవారీగా వారిని తొలగించడం ప్రారంభమైంది. అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లు సమాచారం. 

శ్రీలంకతో టీ20 సిరీస్ కు హార్దిక్ పాండ్య నాయకత్వం వహించనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అలాగే యువ ఆటగాళ్లు శివమ్ మావి, ముఖేష్ కుమార్ లు పొట్టి ఫార్మాట్ లోకి అరంగేట్రం చేయనున్నారు. 

శ్రీలంకతో టీ20 సిరీస్ కు భారత జట్టు

హార్దిక్ పాండ్య (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్హదీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.
 
 
 
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CSK Slumps Another Away Loss | చెపాక్ బయట ఆడాలంటే తిప్పలు పడుతున్న CSK | IPL 2024MS Dhoni Finishing | LSG vs CSK మ్యాచ్ లో ఫినిషనర్ గా అదరగొట్టిన MS Dhoni | IPL 2024Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
War 2 Update: 'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
KL Rahul Comments On Dhoni: ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో
ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో "కేక్‌" వాక్ చేసిన రాహుల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Embed widget