అన్వేషించండి

Rishabh Pant Breaks Record: ధోనీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసిన‌ పంత్.. విదేశాల్లో ఆ ఫీట్ సాధించిన ఇండియన్ వికెట్ కీప‌ర్ గా ఘ‌న‌త‌!

India VS Sri Lanka: విదేశీ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ రికార్డును రిషభ్ పంత్ అధిగమించి సరికొత్త చరిత్ర నెల‌కొల్పాడు.

IND VS SL, Rishabh Pant Surpasses Dhoni Historic Test Milestone:  భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన చారిత్రాత్మక రికార్డును సాధించాడు. విదేశాల్లో లేదా న్యూట్రల్ వేదికల్లో జరిగిన టెస్టుల్లో భారత వికెట్ కీపర్‌గా అత్యధిక పరుగులు సాధించిన లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో పంత్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఈ విభాగంలో 2500 పరుగుల మార్కును దాటిన పంత్, ధోనీ సాధించిన 2496 పరుగుల రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. ధోనీ 32.84 సగటుతో ఆ పరుగులు చేయగా, పంత్ దాదాపు 42 సగటుతో ఈ మైలురాయిని అందుకోవడం గ‌మనార్హం. ఈ లిస్టులో ఫరూక్ ఇంజనీర్ (1209 రన్స్), సయ్యద్ కిర్మాణి (1109 రన్స్), కిరణ్ మోరే (901 రన్స్) తర్వాతి స్థానాల్లో నిలిచారు..

గాయంతో స‌త్తా చాటిన పంత్..
ఈ రికార్డు నమోదు కావడానికి ఒక రోజు ముందు పంత్ మైదానంలో తీవ్ర గాయానికి లోన‌య్యాడు. మొదటి రోజు ఆట మూడో సెషన్‌లో శ్రీలంక పేసర్ లహిరు కుమార వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్ చేసే క్రమంలో పంత్ ఎడమ చేతి మణికట్టుకు గాయం అయింది. నొప్పితో విలవిల్లాడిన పంత్ కు భారత జట్టు ఫిజియో ఐస్ ప్యాక్ పెట్టి కట్టు కట్టిన‌ట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తీవ్ర అసౌకర్యంగా అనిపించడంతో 15 బంతుల్లో 3 పరుగులు చేసిన తర్వాత 58వ ఓవర్లో పంత్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.

సూప‌ర్బ్ పార్ట్న‌ర్ షిప్
గాయం తీవ్రత భయపెట్టినప్పటికీ, రెండో రోజు ఉదయం భారత్ ఆరో వికెట్ కోల్పోయిన తర్వాత పంత్ తిరిగి బ్యాటింగ్ కు వ‌చ్చాడు. అసిథ ఫెర్నాండో, ఇతర లంక పేసర్లు వరుసగా బౌన్సర్లతో దాడి చేస్తూ అతడి భుజానికి కూడా బంతులు తాకించినా పంత్ ఏమాత్రం లెక్క చేయ‌లేదు. నొప్పిని భరిస్తూనే మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తో కలిసి జట్టు ఇన్నింగ్స్ ను ముందుకు న‌డిపించాడు. ఇద్దరూ కలిసి సమయోచిత భాగస్వామ్యంతో లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొని స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు.

ఇరువురు అర్థ సెంచ‌రీల న‌మోదు..
శ్రీలంక బౌలర్లు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్న సమయంలో పంత్ చూపిన అంకితభావం జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చిందన‌డంలో సందేహం లేదు. ఇక వీళ్లిద్ద‌రూ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తూ, అబేధ్య‌మైన ఏడో వికెట్ కు 112 ప‌రుగులు జోడించారు. లంచ్ విరామ సమయానికి టీమిండియా 112 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 419 ప‌రుగులు చేసింది. పంత్ (63 బ్యాటింగ్)తో పాటు జురేల్ (59 బ్యాటింగ్) అర్థ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. ఫెర్నాండోకు నాలుగు వికెట్లు ద‌క్కాయి.  ఇప్పటికే గాలే టెస్ట్ లో భారత్ 165 రన్స్ తో గెలిచి సిరీస్ లో 1-0 లీడ్ లో ఉండగా, కొలంబోలోనూ పంత్ పోరాటంతో జట్టు పటిష్ట స్థితికి చేరింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant Breaks Record: ధోనీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసిన‌ పంత్.. విదేశాల్లో ఆ ఫీట్ సాధించిన ఇండియన్ వికెట్ కీప‌ర్ గా ఘ‌న‌త‌!
ధోనీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసిన‌ పంత్.. విదేశాల్లో ఆ ఫీట్ సాధించిన ఇండియన్ వికెట్ కీప‌ర్ గా ఘ‌న‌త‌!
Brydon Carse Arrest: నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Advertisement

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
Brydon Carse Arrest: నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Embed widget