Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకునే అనసూయ భరద్వాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన తండ్రి మరణం తర్వాత తల్లి జీవితంలో వచ్చిన మార్పులను చూసి గత మూడేళ్లుగా తాను పడుతున్న బాధను పంచుకున్నారు.
"భర్త చనిపోతే మహిళలు బొట్టు, గాజులు, కాటుక తీసేయాలా?" అంటూ అనసూయ సమాజాన్ని ఘాటుగా ప్రశ్నించారు. ఆడపిల్లలకు బొట్టు, గాజులు, గోరింటాకు వంటి అలంకరణలను పెళ్లికి ముందే వాళ్ల అమ్మలు, అమ్మమ్మలు పరిచయం చేస్తారని, అలాంటప్పుడు వాటిని భర్త జీవితంతో ఎందుకు ముడిపెడుతున్నారని ఆమె అన్నారు. ఒకవేళ ఆ ఆచారాన్నే పాటిస్తే, ఆ అలంకరణను పరిచయం చేసిన అమ్మమ్మో, అమ్మో చనిపోయినప్పుడు కదా వాటిని వదులుకోవాలి అని చెప్పుకొచ్చారు. ఏవైనా పూజలు, శుభకార్యాలు జరిగినప్పుడు కూడా కొన్ని బలవంతపు రూల్స్ నాకింకా కనిపిస్తూనే ఉన్నాయి. తానెవరినీ ఉద్దేశించి లేదా వ్యతిరేకించి ఈ మాటలు అనలేదని, తన మనసులో ఉన్న సందేహాన్ని మాత్రమే పంచుకున్నానని స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















