అన్వేషించండి

IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!

India Vs Sri Lanka: కొలంబో టెస్ట్ తొలి రోజు దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో మెరవగా ఇండియా 300 పరుగులు చేసి తొలి రోజే పూర్తి ఆధిపత్యం సాధించింది. ఈ టెస్టు నెగ్గ‌డంపై ఇండియా ఫోక‌స్ పెట్టింది.

IND VS SL 2nd Test Day 1, Padikkal Century Puts India On Top:  కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (ఎస్ఎస్ సీ) మైదానంలో శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజే భారత జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ పై భారత బ్యాటర్లు 3.5 కు పైగా రన్ రేట్ తో ఆడుతూ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 300 రన్స్ చేశారు. గాలే టెస్ట్ హీరో దేవదత్ పడిక్కల్ సూప‌ర్బ్ సెంచ‌రీ (193 బంతుల్లో 117, 12 ఫోర్లు) తో మరోసారి క్లాసిక్ సెంచరీతో చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ప్రారంభంలో 0, 1 పరుగుల వద్ద లభించిన లైఫ్ లను వాడుకుంటూ పడిక్కల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్ర‌స్తుతం క్రీజులో ధ్రువ్ జురేల్ (7 బ్యాటింగ్), సారాంశ్ జైన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బౌల‌ర్ల‌లో అసిథ ఫెర్నాండో కు మూడు వికెట్లు ద‌క్కాయి. 

గిల్- పడిక్కల్ 120 రన్స్ భాగస్వామ్యం.. 
ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన భార‌త్ కు  ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (45), కేఎల్ రాహుల్ (18) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్ద‌రూ తొలి వికెట్ కు 47 ప‌రుగులు జోడించారు. ఆ త‌ర్వాత రాహుల్ ఔటై.. జైస్వాల్ మంచి జోరు క‌న‌బ‌ర్చాడు. అసిథ బౌలింగ్ లో మూడు ఫోర్లు కొట్టిన త‌ర్వాత అదే ఓవ‌ర్లో త‌ను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓపెన‌ర్లు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (50), పడిక్కల్ కలిసి రెండో సెషన్ ను పూర్తిగా శాసించారు. ఎండ తీవ్రత పెరిగేకొద్దీ పిచ్ మరింత ఫ్లాట్ గా మారడంతో ఇద్దరూ శ్రీలంక బౌలర్లను ఆటాడుకున్నారు. పేసర్లు వేసిన షార్ట్ బాల్స్, స్పిన్నర్ల లెగ్ సైడ్ నెగటివ్ లైన్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి నమోదు చేశారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 120 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత అసిథ ఫెర్నాండో బౌలింగ్ లో గిల్ పెవిలియ‌న్ కు చేరాడు.

రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన రిషభ్ పంత్.. 
మూడో సెషన్ లో లంక పేసర్ లహిరు కుమార షార్ట్ బాల్స్ వ్యూహంతో బ‌రిలోకి దిగాడు. ఈ క్రమంలో కుమార వేసిన వేగవంతమైన బౌన్సర్ రిషభ్ పంత్ ఎడమ మణికట్టుకు బలంగా తాకడంతో, నొప్పితో విలవిల్లాడిన పంత్ రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా ఆచితూచి ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేయగా, పడిక్కల్ తన క్లాసిక్ కట్స్, లేట్ కట్స్ తో బౌండరీలు బాదుతూ కెరీర్ లో వరుసగా రెండో టెస్ట్ సెంచరీని న‌మోదు చేశాడు. జడేజాతో కలిసి పడిక్కల్ 75 పరుగుల పార్ట్‌నర్‌షిప్ జోడించాడంతో టీమిండియా ప‌టిష్ట స్థితిలోకి వెళ్లింది. అయితే ఆట చివ‌ర్లో వీరిద్ద‌రూ ఔట్ అవ‌డంతో లంక‌కు కాస్త ఊర‌ట ద‌క్కింది. 

సిరీస్ క్లీన్ స్వీప్ పై గురి
ఆసియాలోనే  అత్యధిక టెస్టులు నిర్వహించిన రెండో వేదిక‌గా ఘనత వ‌హించిన‌ ఎస్ఎస్ సీ వెన్యూపై జరుగుతున్న ఈ 47వ టెస్టులో ఇండియా తొలి రోజే పట్టు సాధించింది. గాలేలో 165 రన్స్ తేడాతో గెలిచిన జోరును ఇక్కడా కొనసాగిస్తూ డబ్ల్యూటీసీ పాయింట్ల వేటలో దూసుకెళ్లాలని శుభ్‌మన్ గిల్ సేన చూస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేయ‌డంతోపాటు డ‌బ్ల్యూటీసీ రేసులో మ‌రింత ముందుకు వెళుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

West Indies Historic Record Chase: 250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
Sandpapergate Secrets Exposed: అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
IND VS WI 2nd T20 Updates: స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
Hardik Injury Crisis: ఐదు నెలల్లో మూడుసార్లు గాయాల పాలు.. హార్దిక్ వరల్డ్ కప్ ఆశలపై నీలినీడలు, ఫిట్‌నెస్ సాధించకపోతే పెను ముప్పంటూ మాజీ ట్రైనర్ల హెచ్చరిక
ఐదు నెలల్లో మూడుసార్లు గాయాల పాలు.. హార్దిక్ వరల్డ్ కప్ ఆశలపై నీలినీడలు, ఫిట్‌నెస్ సాధించకపోతే పెను ముప్పంటూ మాజీ ట్రైనర్ల హెచ్చరిక
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget