ఆ సూట్‌కేసులో ముక్కలు ముక్కలుగా నరికిన, కుళ్ళిన స్థితిలోని మానవ శరీర భాగాలు లభించాయి. ప్రయాణికుల ఫిర్యాదుతో రైల్వే అధికారులు దీన్ని గుర్తించారు.
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Chennai Suitcase Murder Case: చెన్నైలో దారుణం జరిగింది. ఒడిశా మహిళను అతి కిరాతంగా హత్య చేశారు. సూట్‌కేసులో కొన్ని వేరే ప్రాంతానికి తరలించారు. మిగిలిన పార్ట్స్‌ను బిర్యానీ గిన్నెలో ఉడికించారు.

- ఆగ్రా రైల్వేస్టేషన్‌లో సూట్‌కేసు మృతదేహ భాగాల మిస్టరీ వెలుగుచూసింది.
- చెన్నై ఇంటిలో మహిళను హత్యచేసి, శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించారు.
- హతురాలు ఒడిశాకు చెందిన హయాత్ నిషా; నిందితులు పరారీలో ఉన్నారు.
- ఆర్థిక వివాదాలు, దోపిడీ కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Chennai Suitcase Murder Case: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వేస్టేషన్‌లో కలకలం రేపిన ఎరుపు రంగు సూట్‌కేసు మిస్టరీని ఛేదించే క్రమంలో తమిళనాడు పోలీసులు అత్యంత భీకరమైన, దారుణమైన హత్యాదంతాన్ని వెలికితీశారు. దేశంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు సంస్థలు జరిపిన విచారణలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు బయటపడ్డాయి. హత్యకు గురై ఒడిశా మహిళ హయాత్ నిషాగా పోలీసులు నిర్దారించారు.
చెన్నై శివారు ప్రాంతమైన గుడువాంచేరిలోని ఒక అద్దె ఇంట్లో ఈ దారుణ ఘాతుకం చోటు చేసుకుంది. బాధితురాలిని అత్యంత క్రూరంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, కొన్ని శరీర భాగాలను సూట్‌కేసులో ప్యాక్ చేసి ఆగ్రాలో వదిలేశారు. అంతటితో ఆగకుండా, పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు, సాక్ష్యాలను పూర్తిగా నాశనం చేసేందుకు నిందితులు గుడువాంచేరిలోని తమ ఇంట్లోనే మిగిలిన శరీర భాగాలను ఒక పెద్ద బిర్యానీ పాత్రలో మైదా పిండి, కూరగాయలతో కలిపి ఉడికించేందుకు ప్రయత్నం చేశారు.
ఈ ఘోరానికి పాల్పడిన దంపతులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్, గుడువాచేరి పరిసరాల్లోని సుమారు 350ికపైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను జల్లెడ పట్టడం ద్వారా దర్యాప్తు బృందాలు ఈ దంపతుల కదలికలను గుర్తించాయి. గుడువాంచేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీదు వీధిలో ఉన్న వారి అద్దె ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు అక్కడ గోడలు, నేలపై రక్తపు మరకలతో కూడిన భయంకరమైన వాతావరణం కనిపించింది. నిందితులు వాడిన పెద్ద బిర్యానీ పాత్రను పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆగ్రా రైల్వే స్టేషన్‌లో సూట్ కేసు కలకలం
ఈ దారుణ ఉదంతం ఆగస్టు మొదటి వారంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా క్యాంట్ రైల్వేస్టేషన్‌లో వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 5 లేదా ఆరో తేదీన చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి న్యూఢిల్లీ వైపు ప్రయాణించే తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సాధారణ బోగీలో ఒక ఎరుపు రంగు సూట్‌కేస్ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోందని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, ప్రభుత్వం రైల్వే పోలీస్ సిబ్బంది ఆ పెట్టెను పరిశీలించారు.
ఆ ఎరుపు రంగు సూట్‌కేస్ పూర్తిగా పరిశీలించగా లోపల నుంచి కుళ్లిపోయిన మానవ శరీర భాగాలు బయటపడ్డాయి. ఆ పెట్టెను తెరిచి చూడగా, అందులో ముక్కు ముక్కలుగా కోసిన మహిళ శరీర భాగాలు లభ్యమయ్యాయి. మృతదేహం తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటం వల్ల, బాధితురాలు ఎవరా అనే విషయాన్ని గుర్తించడానికి ఆగ్రా పోలీసులకు సమయం పట్టింది.
దర్యాప్తును మలుపు తిప్పిన చెన్నై పాలిథిన్ కవర్ క్లూ
ఆగ్రా క్వాంట్ రైల్వేస్టేష్‌లో దొరికిన సూట్‌కేస్‌ను పరిశీలించిన ఉత్తర్‌ప్రదేశ్, ఆగ్రా జీపీఆర్‌పీ పోలీసులకు ఒక కీలకమైన క్లూ లభించింది. ఆ ఎరుపు రంగు సూట్‌కేస్ లోపల శరీర భాగాలను ప్యాక్ చేయడానికి ఉపయోగించిన ఒక పాలిథిన్ కవరుపై చెన్నై అనే పదం రాసి ఉంది. ఆ చిన్న ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. ఆగ్ర పోలీస్‌లు వెంటనే సమాచారాన్ని తమిళనాడు, చెన్నై పోలీసులకు చేరవేశారు. చెన్నై పోలీసులు కమిషనరేట్ పరిధిలోని దర్యాప్తు బృందాలు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కేసును వేగంగా ఛేదించేందుకు సాంకేతిక, క్షేత్రస్థాయి పరిశోధనలను ప్రారంభించారు.
350 సీసీటీవీ కెమెరాలు జల్లెడ పట్టిన పోలీసులు
చెన్నై పోలీసు బృందాలు తమ దర్యాప్తును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించాయి. రైల్వేస్టేషన్, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 350కిపైగా సీసీటీవీ కెమెరాల రికార్డింగులను పోలీసులు రాత్రింబవళ్లు శ్రమించి విశ్లేషించారు. ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి ఆ ఎరుపు రంగు సూట్ కేస్‌ను మోసుకుంటూ రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించడం, దానిని తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌రైలు సాధారణ బోగీలో వదిలిపెట్టి వెళ్లడం సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది.
ఈ ఆధారంతో పోలీసులు వారి తదుపరి కదలికలను ట్రాక్ చేయడం ప్రారంభించారు. సీసీటీవీ రికార్డింగుల ప్రకారం, సదరు జంట చెన్నై సెంట్రల్ నుంచి బయటకు వచ్చి సమీపంలోని చెన్నై పార్క్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అక్కడ వారు గుడువాంచేరి వైపు ప్రయాణించే సబర్బన్ లోకల్ రైలును ఎక్కినట్టు పోలీసులు కనుగొన్నారు.
పోలీసులు వెంటనే గుడువాంచేరి రైల్వేస్టేషన్‌లోని, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలించారు. అక్కడ సదరు నిందితులు అదే ఎరుపు రంగు సూట్‌కేస్‌తో ఒక ఆటో రిక్షాను ఎక్కి గుడువాంచేరి పరిధిలోని మసీదు వీధి వైపు వెళ్లినట్టు తేలింది. పోలీసులు ఆ ఆటో రిక్షాను గుర్తించి, దాని డ్రైవర్‌ను విచారించగా, వారి అద్దె ఇల్లు చిరునామా లభ్యమైంది.
బిర్యానీ గిన్నెలో శరీర భాగాలు
పోలీస్ బృందాలు గుడువాంచేరి మసీదు వీధిలోని సదరు అనుమానాస్పద అద్దె ఇంటిలో పోలీసులు సోదాలు చేశారు. వారు ఆ ఇంట్లోకి ప్రవేశించగానే అక్కడ కనిపించి దృశ్యాలు దర్యాప్తు అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఆ ఇంట్లోకి గోడలపై, నేలపై బాధితురాలి రక్తపు మరకలు లభ్యమయ్యాయి. ముందుగా బాధితురాలి మృతదేహం సీలింగ్‌కు వేలాడిదీసి ఉంచారు. ఆ తర్వాత నిందితులు మృతదేహాన్ని అత్యంత క్రూరంగా ముక్కలుగా నరికి, ఎముకలను వేరు చేసి కొన్ని భాగాలను సూట్‌కేస్‌లోని ప్యాక్ చేసి రైలు ఎక్కించారు.
అయితే, ఇంట్లోని వంటగదిలో పోలీసులు ఒక భారీ బిర్యానీ పాత్రను గుర్తించారు. ఈ పాత్ర సాధారణంగా పెద్ద ఎత్తున బిర్యానీ వండటానికి ఉపయోగించే గిన్నె. నిందితులు మిగిలిన శరీర భాగాలను పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నంలో భాగంగా నిందితులు వాటిని పెద్ద బిర్యానీ గిన్నెలో వేసి, మైదా పిండి, వివిధ కూరగాయలతో కలిపి ఉడికించారు. సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఈ బిర్యానీ గిన్నెను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం విశ్లేషణల కోసం పంపించారు.
బాధితురాలు హయాత్ నిషా
ఈ దారుణ హత్యకు బలైన మహిళను ఒడిశాకు చెందిన హయాత్ నిషాగా పోలీసులు గుర్తించారు. ఆమె తన భర్త నుంచి విడిపోయి, చెన్నై నగరంలోని నివసిస్తోంది. తాంబరం పరిసరాల్లోని ఒక ఎక్స్‌పోర్ట్ కంపెనీలో ఆమె పని చేసేది. అమెకు 19 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతను తాంబరంలోనే ఒక ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు.
హయాత్‌నిషా నివసిస్తున్న ఈ అద్దె ఇంట్లో ఆమెతోపాటు ఒక దంపతులు కూడా నివసించేవారని పొరుగువారు పోలీసులకు తెలిపారు. ఈ జంటతో ఆమెను ఏర్పడిన వ్యక్తిగత వివాదాలు లేదా ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆమె వద్ద ఉన్న బంగారం, డబ్బు దోచుకోవాలనే ఉద్దేశంతోనే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారా లేదా వారి మధ్య ఏవైనా నినాదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి కుమారుడిని పిలిపించి పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. అమెకు ఎవరితో పరిచయాలు ఉన్నాయి. నిందితులతో ఆమెకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు.
Frequently Asked Questions
ఆగ్రా రైల్వేస్టేషన్‌లో దొరికిన ఎరుపు రంగు సూట్‌కేసులో ఏముంది?
ఈ దారుణ హత్యకు గురైన బాధితురాలు ఎవరు?
హత్యకు గురైన బాధితురాలు ఒడిశాకు చెందిన హయాత్ నిషాగా పోలీసులు గుర్తించారు. ఆమె చెన్నైలోని ఒక ఎక్స్‌పోర్ట్ కంపెనీలో పని చేసేది.
మృతదేహం మిగిలిన భాగాలను నిందితులు ఎలా పారవేసేందుకు ప్రయత్నించారు?
నిందితులు మృతదేహం మిగిలిన భాగాలను పెద్ద బిర్యానీ పాత్రలో మైదా పిండి, కూరగాయలతో కలిపి ఉడికించేందుకు ప్రయత్నించారు. సాక్ష్యాలను పూర్తిగా నాశనం చేయడమే వారి ఉద్దేశం.
నిందితుల చిరునామాను పోలీసులు ఎలా కనుగొన్నారు?
సూట్‌కేసులోని పాలిథిన్ కవరుపై
ట్రెండింగ్ వార్తలు






















