IND vs SL T20: రేపే భారత్- శ్రీలంక తొలి టీ20- ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా
IND vs SL T20: రేపట్నుంచి భారత్- శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో టీమిండియా జట్టు మొత్తం మైదానానికి చేరుకుంది. ఈరోజు జట్టు ప్రాక్టీస్ చేయనుంది.
IND vs SL T20: రేపట్నుంచి భారత్- శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో టీమిండియా జట్టు మొత్తం మైదానానికి చేరుకుంది. ఈరోజు జట్టు ప్రాక్టీస్ చేయనుంది.
హార్దిక్ నేతృత్వంలో
శ్రీలంకతో టీ20లకు హార్దిక్ పాండ్య జట్టును నడిపించనున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు ఈ పొట్టి సిరీస్ కు ఎంపికవలేదు. వారి గైర్హాజరీలో కుర్రాళ్లతో కూడిన జట్టును పాండ్య ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. హార్దిక్ కు డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు.
కుర్రాళ్లకు మంచి అవకాశం
రాహుల్ త్రిపాఠి, ముఖేష్ కుమార్, శివమ్ మావి లాంటి కుర్రాళ్లు ఈ సిరీస్ ద్వారా అరంగేట్రం చేయనున్నారు. శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ లాంటి వాళ్లతో బ్యాటింగ్ విభాగం బలంగానే కనపడుతోంది. అలాగే బౌలింగ్ లో అర్హదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ లు సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
శ్రీలంకతో టీ20లకు భారత జట్టు
హార్దిక్ పాండ్య (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్హదీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.
శ్రీలంక జట్టు
పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వా, భానుక రాజపక్స, దసున్ శనక (కెప్టెన్), వానిందు హసరంగా, సదీర సమరవిక్రమ, చమిక కరుణరత్నే, మహేష్ తీక్షణ, లాహిరు కుమార, దిల్షాన్ మధుశంక, నువాన్ తుషార, కసున్ రజిత.
India against Sri Lanka in men's T20Is at home:
— Wisden India (@WisdenIndia) January 2, 2023
Matches played - 14
Matches won - 11
Matches lost - 2
NR - 1
Complete domination from the Men in Blue 🔥#India #INDvsSL #Cricket #T20Is pic.twitter.com/6PguLbQ5jm
#TeamIndia squad for three-match T20I series against Sri Lanka.#INDvSL @mastercardindia pic.twitter.com/iXNqsMkL0Q
— BCCI (@BCCI) December 27, 2022
Sri Lanka limited over squad led by Dasun Shanaka left the SLC HQ premises short while ago to embark on their tour to India.🛫 #INDvSL pic.twitter.com/qqzbE2d2kA
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) December 31, 2022
Also Read: డెక్సా టెస్ట్ అంటే ఏంటి? దానివల్ల ప్రయోజనాలు ఎలా?
Also Read: 2023లో టీమిండియాపై భారీ అంచనాలు - అందుకుంటే మామూలుగా ఉండదు!