అన్వేషించండి

IND vs SL: లంకేయుల పైనా టీమ్‌ఇండియాదే మొదట బ్యాటింగ్‌!

IND vs SL: ఆసియాకప్‌ 2023 సూపర్‌-4లో టీమ్‌ఇండియా రెండో మ్యాచ్‌ ఆడుతోంది. ప్రేమదాస వేదికగా శ్రీలంకతో తలపడుతోంది. ఈ మ్యాచ్ టాస్‌ వేశారు.

IND vs SL:

ఆసియాకప్‌ 2023 సూపర్‌-4లో టీమ్‌ఇండియా రెండో మ్యాచ్‌ ఆడుతోంది. ప్రేమదాస వేదికగా శ్రీలంకతో తలపడుతోంది. ఈ మ్యాచ్ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

'మేం తొలుత బ్యాటింగ్‌ చేస్తాం. క్రీడాకారులకు సవాళ్లు అవసరం. జట్టుకు సవాళ్లు ఎదురైతేనే మనమేంటో తెలుస్తుంది. చివరి మ్యాచ్‌ తర్వాత మాపై అందరికీ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఐదు రోజుల విశ్రాంతి దొరకడంతో ఆటగాళ్లు తాజాగా ఉన్నారు. చివరి మ్యాచులో మేం అద్భుతంగా ఆడాం. బ్యాటింగ్‌లో భారీ స్కోర్‌ చేయడమే కాకుండా దానిని డిఫెండ్‌ చేసుకున్నాం. ఏదేమైనా ఇది సరికొత్త రోజు. పిచ్‌ భిన్నంగా కనిపిస్తోంది. మందకొడిగా ఉంది. వికెట్‌పై పచ్చిక లేకపోవడంతో శార్దూల్‌ స్థానంలో అక్షర్‌ను తీసుకొచ్చాం. స్పిన్నర్లకు అనుకూలించేలా ఉన్నా మేం ముగ్గురు క్వాలిటీ పేసర్లను తీసుకున్నాం' అని రోహిత్ శర్మ అన్నాడు.

'టాస్‌ గెలిస్తే మేమూ బ్యాటింగే చేయాలనుకున్నాం. మాతో పోలిస్తే భారత్‌ చాలా పటిష్ఠమైన జట్టు. కానీ మేం మెరుగ్గా ఆడాలి. ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తాం. జట్టులో మార్పులేమీ లేవు' అని శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ శనక అన్నాడు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్

శ్రీలంక జట్టు: పాథుమ్ నిసాంక, దిముతు కరుణరత్నె, కుశాల్‌ మెండిస్‌, సదీర సమరవిక్రమ, చరిత్‌ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ శనక, దునిత్‌ వెల్లలగె, మహీశ థీక్షణ, కసున్‌ రజిత, మతీశ పతిరణ

పిచ్‌ రిపోర్ట్‌: పాక్‌ మ్యాచ్‌తో పోలిస్తే పిచ్‌ భిన్నంగా ఉంది. వికెట్‌పై అస్సలు పచ్చిక లేదు. ఇది పాత ప్రేమదాస స్టేడియాన్ని గుర్తుకు తెస్తోందని సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. ఆకాశం నిర్మలంగా ఉంది. కారు మబ్బులేమీ లేవు.

ప్రధాన పేసర్లు లేకున్నా  గ్రూప్ స్టేజ్‌తో పాటు  సూపర్  - 4లో బంగ్లాదేశ్‌పై నెగ్గిన  శ్రీలంకకు నేడు ఆసియా కప్‌లో అసలైన పరీక్ష ఎదురుకానుంది.  గత మూడు  మ్యాచ్‌లలో ఆ జట్టు  అఫ్గానిస్తాన్‌తో ఒకటి, బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌లు ఆడింది.   ఆ జట్టు కీలక బౌలర్లు దుష్మంత చమీర, వనిందు హసరంగ, దిల్షాన్ మధుశంక, లాహిరు కుమారలు  లేకున్నా గత మూడు మ్యాచ్‌లలో  ఉన్న బౌలర్లతోనే నెగ్గుకొచ్చిన లంకకు  భారత బ్యాటర్ల నుంచి అసలైన సవాల్ ఎదురొవచ్చు.  పేసర్లలో కసున్ రజిత ఒక్కడే  అనుభవజ్ఞుడు.  పతిరాన  మీద ఆ జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. కెప్టెన్ శనక,  స్పిన్నర్ మహీశ్ తీక్షణ,  ధనంజయ డిసిల్వలు  భారత బ్యాటర్లను ఏ మేరకు అడ్డుకుంటారో మరి.. 

ఇక బ్యాటింగ్‌లో ఆ జట్టు  కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక , సమరవిక్రమల  మీద భారీగా ఆధారపడుతోంది. గత మూడు మ్యాచ్‌లలో కూడా లంక  బ్యాటింగ్‌కు వీళ్లే అండగా నిలిచారు.   అసలంక, డిసిల్వ, శనకలు విజృంభిస్తే భారత్‌కు తిప్పలు తప్పవు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget