అన్వేషించండి

Jasprit Bumrah :ఒకే ఒక్కడు! జస్ప్రిత్‌ బుమ్రా,కేప్‌టౌన్‌లో నయా రికార్డు

IND vs SA, 2nd Test: చారిత్ర‌త్మ‌క విజ‌యంలో భార‌త పేస్ గుర్రం బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు , మొద‌టి ఇన్నింగ్స్‌లో రెండు, మొత్తం ఎనిమిది వికెట్లు సాధించాడు. ప‌లు రికార్డుల‌ను సొంతం చేసుకున్నాడు.

టీమిండియా(Team India) సఫారీ గడ్డపై నయా చరిత్ర సృష్టించింది. కేవలం రోజున్నరలోనే ముగిసిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa)పై ఘన విజయం సాధించింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా సీమర్లు నిప్పులు చెరిగిన వేళ రోహిత్‌ సేన విజయదుంధుభి మోగించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌ 2023-2025 పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌ళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.  తొలి ఇన్నింగ్స్‌లో సఫారీల పతనాన్ని శాసించిన మహ్మద్‌ సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా... కేప్‌టౌన్‌లో భారత్‌ తొలి విజయాన్ని నమోదుచేసింది. రెండో టెస్ట్‌ గెలుపుతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ను డ్రా చేసుకున్న రెండో భార‌త కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కాడు. ఇప్పుడు టీమిండియా పేసు గుర్రం జస్ప్రిత్‌ బ్రుమా కూడా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో సౌతాఫ్రికా ప‌త‌నాన్ని శాసించిన బుమ్రా.... మొద‌టి ఇన్నింగ్స్‌లోనూ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొత్తంగా బుమ్రా ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు సాధించి ప‌లు రికార్డుల‌ను సాధించాడు. 
 
ఒకే ఒక్క భారతీయుడు
కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా బుమ్రా ఘ‌న‌త సాధించాడు. ఈ మైదానంలో బుమ్రా 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇప్పటి వ‌ర‌కు ఈ రికార్డు జవగళ్‌ శ్రీనాథ్ పేరిట ఉండేది. కేప్‌టౌన్‌లో జవగళ్‌ శ్రీనాథ్‌ 12 వికెట్లు తీశాడు. అనిల్‌కుంబ్లే 12 వికెట్లు తీసి మూడో స్థానంలో నిలిచాడు. కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో షేన్‌వార్న్‌తో క‌లిసి సంయుక్తంగా బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. ఈ మైదానంలో ఇప్పటివరకూ మూడు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన బుమ్రా... 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆట‌గాడు కోలిన్ బ్లైత్ 25 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
 
బుమ్రా మరో రికార్డు
ద‌క్షిణాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌల‌ర్ల జాబితాలో బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 45 వికెట్లతో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉండగా.... 43 వికెట్లతో జగవళ్‌ శ్రీనాథ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా 38 వికెట్లతో బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. 30 వికెట్లతో జహీర్‌ఖాన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. 
 
సిరీస్‌ కోల్పోకుండా ముగింపు
భారత క్రికెట్‌ జట్టుదక్షిణాఫ్రికా పర్యటనను సిరీస్‌ ఓటమి లేకుండా ముగించింది. కేవలం 107 ఓటర్లు సాగిన రెండోటెస్టులో గెలిచిన భారత్‌ టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా.... టీ ట్వంటీ సిరీస్‌ను సమం చేసింది. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ను డ్రా చేసుకున్న రెండో భార‌త కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కాడు. మ‌హేంద్ర సింగ్ ధోనీ త‌రువాత... దక్షిణాఫ్రికాలో ప్రొటీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ను డ్రా చేసుకున్న కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget