అన్వేషించండి
Advertisement
IND vs PAK: టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్- పాక్‌తో మ్యాచ్‌కు గిల్ రెడీ!
Shubman Gill: గిల్ విషయంలో హింట్ ఇచ్చిన రోహిత్ శర్మ. తుది నిర్ణయం మ్యాచ్‌కు ముందే...
భీకర ఫామ్‌లో ఉన్న భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రపంచకప్‌లోనే హై ఓల్టేజ్ మ్యాచ్ అయిన పాకిస్థాన్‌తో జరిగే పోరులో బరిలోకి దిగుతాడా లేదా... డెంగ్యూ నుంచి గిల్ పూర్తిగా కోలుకున్నాడా.. ఫూర్తి ఫిట్‌గా ఉన్నాడా.. ఈ మ్యాచ్‌లో ఆడతాడా అన్న ప్రశ్నలు క్రికెట్ అభిమానులను వేధిస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు టీమిండియా సారధి రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు. శుబ్‌మన్ గిల్ 99 శాతం మ్యాచ్‌కు అందుబాటులోనే ఉంటాడన్న రోహిత్... కానీ తుది నిర్ణయం మ్యాచ్‌కు ముందే తీసుకుంటామని తెలిపాడు. శుభ్‌మన్ గిల్ పునరాగమనంతో టీమిండియా బ్యాటింగ్ బలం పెరుగుతుందన్న రోహిత్... గిల్ ఇప్పటికే బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడని తెలిపాడు. నెట్స్‌లో సుమారు గంటసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అప్పటి నుంచి టీమ్ ఇండియా అభిమానుల్లో గిల్ రాకపై అంచనాలు పెరిగాయి. శుభ్‌మన్ గిల్ రాక ఖాయమైతే ఇషాన్‌పై వేటు పడటం కూడా ఖాయమే అనిపిస్తోంది.
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అర్ధ సెంచరీతో టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు. ఇషాన్ కూడా గత రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా 47 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒక్క బంతికే ఔటయ్యాడు. జట్టులో కనీసం ఒకటి రెండు మార్పులు ఉంటాయని, ఈ విషయాన్ని ఆటగాళ్లకు ముందే చెప్పానని రోహిత్ స్పష్టం చేశాడు. ఏ ఆటగాడిని జట్టులోకి తీసుకుంటారో రోహిత్ చెప్పనప్పటికీ, అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని పరోక్షంగా చెప్పాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌గిల్.. డెంగ్యూ బారిన పడ్డాడు. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లకు అతడు దూరం కాగా ఇషాన్ కిషన్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. శుభ్‌మన్ గిల్ ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్, టీమిండియా పేస్ స్టార్ మహ్మద్ సిరాజ్‌ను వెనక్కి నెట్టి... సెప్టెంబర్ నెలకు ఉత్తమ ఆటగాడిగా గిల్ నిలిచాడు. సెప్టెంబర్ నెలలో శుభ్‌మన్ 80 సగటుతో 480 పరుగులు చేశాడు. సెప్టెంబర్‌లో ఆడిన ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ గిల్ నిలిచాడు. ఆసియా కప్‌లో 75.5 బ్యాటింగ్ సగటుతో ఈ స్టార్ ఓపెనర్ 302 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో గిల్ 178 పరుగులు చేశాడు.
వన్డేల్లో శుభమన్ గిల్ రికార్డు అద్భుతంగా ఉంది. 24 ఏళ్ల శుభ్‌మన్ గిల్ 35 వన్డేల్లో 66.1 బ్యాటింగ్ సగటుతో 1917 పరుగులు చేశాడు. వన్డేల్లో గిల్ స్ట్రైక్ రేట్ కూడా 102.84 ఉండడం అతను ఎంత స్థిరంగా రాణిస్తున్నాడో చెబుతుంది. ప్రస్తుతం గిల్ ICC వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-2 ర్యాంక్‌లో ఉన్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం భారత్-పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ హైవోల్టేజీ మ్యాచ్‌తో టీమిండియా యువ ఓపెనర్ గిల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తనకిష్టమైన అహ్మదాబాద్ పిచ్‌పై పాకిస్తాన్ బౌలింగ్‌లో గిల్ పరుగుల వరద పారించాలని కోరుకుంటున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
న్యూస్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion