అన్వేషించండి

IND vs PAK Asia Cup 2022 LIVE: పాక్‌పై థ్రిల్లింగ్ మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ - చివర్లో పాండ్య, జడేజా షో!

IND vs PAK Asia Cup 2022 LIVE Score: దుబాయ్‌లో ఆసియాకప్‌లో భాగంగా జరుగుతున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

LIVE

Key Events
IND vs PAK Asia Cup 2022 LIVE: పాక్‌పై థ్రిల్లింగ్ మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ - చివర్లో పాండ్య, జడేజా షో!

Background

క్రికెట్ ప్రేమికులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఆసియా కప్ 2022లో దాయాదుల సమరానికి ఇంకా కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఈ టోర్నీలో భాగంగా నేడు జరిగే రెండో మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం ఆగిపోయింది. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాక్ తలపడుతున్నాయి. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ రెండు జట్లూ తలపడడం ఇదే తొలిసారి. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

టీమిండియా కూర్పు కుదిరింది!   
టీమిండియా పటిష్టంగానే కనిపిస్తోంది. రోహిత్, రాహుల్ ఓపెనర్లుగా బరిలో దిగే అవకాశం ఉంది. వారిద్దరూ ఎలాంటి భాగస్వామ్యం అందిస్తారో చూడాలి. వారి తర్వాత కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. సూపర్ ఫాంలో ఉన్న సూర్య నుంచి భారత్ మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మిడిలార్డర్ లో పంత్, పాండ్య ఎలా ఆడతారో చూడాలి. సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు జట్టులో చోటు దక్కకపోవచ్చు. యుజువేంద్ర చాహల్ తో పాటు ఆల్ రౌండర్ జడేజా స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. పేస్ విభాగాన్ని భువనేశ్వర్ కుమార్ ముందుండి నడిపించనున్నాడు. అతనితో పాటు అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్ ఉంటారు. మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలనుకుంటే వీరిద్దరిలో ఒకరికి బదులుగా రవి బిష్ణోయ్, అశ్విన్ లలో ఒకరిని తీసుకునే అవకాశముంది. 

ఈ మ్యాచ్ కోహ్లీకి చాలా కీలకం. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న విరాట్.. నెల రోజుల విరామం తర్వాత మైదానంలో దిగుతున్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో తిరిగి గాడిన పడాలని చూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌నకు 2 నెలలు కూడా లేని సమయంలో కోహ్లీ తిరిగి ఫాంలోకి రావడం చాలా ముఖ్యం.

దాయాదిని తక్కువ చేయలేం
ఇక మరోవైపు పాకిస్థాన్ కూడా బలంగానే కనిపిస్తోంది. కెప్టెన్ బాబర్ అజాం ఆ జట్టుకు పెద్ద బలం. ఇటీవల అతడు సూపర్ ఫాంలో ఉన్నాడు. అతడితో పాటు మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, షాదాబ్ ఖాన్ లతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. అయితే బౌలింగ్ లో షహీన్ దూరం కావడం ఆ జట్టుకు ఆందోళన కలిగించేదే. అతనితోపాటు మహ్మద్ వసీం కూడా దూరమయ్యాడు. అయినప్పటికీ నసీమ్ షా, హస్నైన్, దహానీ వంటి ప్రతిభావంతులు వారికి అందుబాటులో ఉన్నారు. స్పిన్ భారాన్ని ఖాదిర్, షాదాబ్, నవాజ్ మోయనున్నారు. 

పాకిస్థాన్ ను తేలిగ్గా తీసుకుంటే భారత్ కు తీరని నష్టం కలుగుతుంది. ఇది గత టీ20 ప్రపంచకప్ లోనే అర్థమైంది. గత ఏడాది 10 వికెట్ల ఘోర పరాజయాన్ని టీమిండియా మూటగట్టుకుంది. మళ్లీ ఓటమి దరిచేరకూడదనుకుంటే పాక్ పై మ్యాచ్ లో అలసత్వాన్ని ప్రదర్శించకూడదు. 

చరిత్ర మనవైపే
ఆసియాకప్ లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 14 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 8 మ్యాచ్ ల్లో నెగ్గింది. పాకిస్తాన్ 5 సార్లు గెలిచింది. మరో మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఇక టీ20ల్లో ఈ రెండు జట్లు 8 సార్లు తలపడగా భారత్ 6 సార్లు, పాక్ 2 సార్లు నెగ్గాయి.

23:44 PM (IST)  •  28 Aug 2022

19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా - ఐదు వికెట్లతో ఘనవిజయం

మహ్మద్ నవాజ్ వేసిన 20వ ఓవర్లో నాలుగు బంతుల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. నాలుగో బంతికి సిక్సర్‌తో హార్దిక్ మ్యాచ్‌ను ముగించాడు.

హార్దిక్ పాండ్యా 33(17)
దినేష్ కార్తీక్ 1(1)
మహ్మద్ నవాజ్ 3.4-0-33-3
రవీంద్ర జడేజా (బి) మహ్మద్ నవాజ్ (35: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు)

23:36 PM (IST)  •  28 Aug 2022

19 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 141-4

హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 141-4గా ఉంది.

రవీంద్ర జడేజా 35(28)
హార్దిక్ పాండ్యా 27(15)
హరీస్ రౌఫ్ 4-0-35-0

23:30 PM (IST)  •  28 Aug 2022

18 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 127-4

నసీం షా వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 127-4గా ఉంది.

రవీంద్ర జడేజా 34(27)
హార్దిక్ పాండ్యా 14(10)
నసీం షా 4-0-27-2

23:19 PM (IST)  •  28 Aug 2022

17 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 116-4

హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 17వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 116-4గా ఉంది.

రవీంద్ర జడేజా 24(21)
హార్దిక్ పాండ్యా 14(10)
హరీస్ రౌఫ్ 3-0-21-0

23:12 PM (IST)  •  28 Aug 2022

16 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 107-4

షానవాజ్ దహానీ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 107-4గా ఉంది.

రవీంద్ర జడేజా 22(19)
హార్దిక్ పాండ్యా 11(6)
షానవాజ్ దహానీ 4-0-29-0

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Embed widget