(Source: ECI/ABP News/ABP Majha)
IND Vs ENG: భారత్ తర్వాతి పోరు ఇంగ్లండ్‌తో - టాప్ స్కోరర్లలో ఎవరెక్కడ ఉన్నారు?
భారత జట్టు తన తర్వాతి ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.
World Cup 2023 Virat Kohli: రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ 2023లో ఇప్పటివరకు అద్భుత ప్రదర్శన చేసింది. టీమ్ ఇండియా ఐదు మ్యాచ్‌లు ఆడి అన్నింటిలో విజయం సాధించింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో పోటీ పడనుంది. లక్నోలో అక్టోబర్ 29వ తేదీ (ఆదివారం) భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. గణాంకాలను పరిశీలిస్తే భారత్‌దే పైచేయి కనిపిస్తోంది. ఇంగ్లండ్‌పై భారత్ కంటే ఎక్కువ వన్డే మ్యాచ్‌లు గెలిచింది. ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే... అందులో విరాట్ కోహ్లీ పేరు కూడా చేరింది.
భారత్ తరఫున వన్డే మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. విరాట్ 35 మ్యాచ్‌ల్లో 1340 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
టాప్‌లో మహేంద్రుడు
ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ 48 మ్యాచ్‌లు ఆడి 1546 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక యువరాజ్ సింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. యువీ 37 మ్యాచుల్లో 1523 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ 37 మ్యాచ్‌ల్లో 1455 పరుగులు చేశాడు. ఆయన మూడు సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు సాధించాడు.
ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉండటం ఆసక్తికరం. జడేజా 25 మ్యాచుల్లో 38 వికెట్లు తీశాడు. హర్భజన్ సింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. భజ్జీ 23 మ్యాచుల్లో 36 వికెట్లు తీశాడు. మూడో స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ 35 వికెట్లు తీశాడు.
ధర్మశాల విజయంతో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరువ అయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. భారత్ ఐదు మ్యాచ్‌లు ఆడి అన్నింటిలో విజయం సాధించింది. భారత్‌కు 10 పాయింట్లు ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ గురించి చెప్పాలంటే తొమ్మిదో స్థానంలో ఉంది.ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial