IND vs ENG 3rd Test: సహనం కోల్పోయిన శుభమన్ గిల్ - జాక్ క్రాలీకి వేలు చూపిస్తూ వార్నింగ్, వీడియో చూడండి
shubman gill fight with zak crawley | లార్డ్స్ టెస్టులో శుభమన్ గిల్, జాక్ క్రాలీ మధ్య వాగ్వాదం జరిగింది. మూడో టెస్ట్ చివరి ఓవర్లో ఇంగ్లాండ్ చేష్టలకు గిల్ కోపంతో ఊగిపోయాడు.

IND vs Eng 3rd Test highlights | లండన్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ జరుగుతున్న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో శనివారం గందరగోళం నెలకొంది. జస్ప్రీత్ బుమ్రా (Jasprit bumrah) వేసిన మూడో రోజు చివరి ఓవర్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ చేసిన పనికి అంతా గుర్రుగా ఉన్నారు. జాక్ క్రాలీ ఇదే చివరి ఓవర్ కావాలని కోరుకున్నాడు, దాంతో అతడు ఉద్దేశపూర్వకంగా సమయాన్ని వృధా చేస్తున్నాడు. ఇది చూసిన శుభమన్ గిల్ కోపంతో ఊగిపోయాడు. ఇది సరైన పద్ధతి కాదంటూ క్రాలీ దగ్గరకు వెళ్లి వేలు చూపిస్తూ ఏదో చెప్పాడు.
జాక్ క్రాలీ పై శుభమన్ గిల్ ఆగ్రహం
లార్డ్స్ టెస్టులో మూడోరోజు ఆట ముగిసే సమయానికి కొద్దిసేపటి ముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ కూడా మొదటి ఇన్నింగ్స్ లో సరిగ్గా అవే పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఆట ముగియడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేస్తున్న మొదటి ఓవరే ఆరోజు చివరి ఓవర్ కావాలని కోరుకుంది.
THIS IS PEAK TEST CRICKET. 🥶🔥pic.twitter.com/72jG37SbHN
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2025
అదే ప్లాన్ ను అమలు చేసి విమర్శలపాలవుతున్నారు. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ కావాలనే సమయాన్ని వృధా చేశాడు. బౌలర్ బుమ్రా బాల్ వేయడానికి వస్తున్న సమయంలో వికెట్లను వదిలి వెనక్కి వెళ్లాడు. మొదట అతడు ఓవర్ నెమ్మదిగా జరిగి, ఇదే లాస్ట్ ఓవర్ అవ్వాలని భావించాడు. మొదట బాల్ వేస్తుంటే వెనక్కి జరిగి రెడీగా లేనంటూ టైమ్ వేస్ట్ చేశాడు. బుమ్రా వేసిన ఐదవ బంతిని డిఫెన్స్ ఆడిన తర్వాత, తన చేతికి బాల్ తగిలినట్లు చూపించాడు. జాక్ క్రాలీ వెంటనే డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగ చేశాడు. ఇదంతా గమనిస్తున్న టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ కోపంతో ఊగిపోయాడు. భారత ఆటగాళ్లు చప్పట్లు కొట్టి జాక్ క్రాలీ నాటకాలు చాలంటూ ఎగతాళి చేశారు. ఆ తర్వాత గిల్ ఇంగ్లాండ్ ఓపెనర్ దగ్గరకు వెళ్లి వేలు చూపిస్తూ కోపంగా ఏదో చెప్పాడు.
Shubman Gill & Co. didn’t come to be played around, 𝙠𝙮𝙪𝙣𝙠𝙞 𝙔𝙚 𝙨𝙚𝙚𝙠𝙝𝙣𝙚 𝙣𝙖𝙝𝙞, 𝙨𝙞𝙠𝙝𝙖𝙣𝙚 𝙖𝙖𝙮𝙚 𝙝𝙖𝙞𝙣!#ENGvIND 👉 3rd TEST, DAY 4 | SUN 13th JULY, 2:30 PM | Streaming on JioHotstar pic.twitter.com/ix13r7vtja
— Star Sports (@StarSportsIndia) July 12, 2025
దీని తర్వాత మరో ఓవర్ వేయాలని టీమిండియా భావించింది. కానీ వికెట్ కోల్పోతామన్న భయంతో ఇంగ్లాండ్ అలా జరగకుండా ప్లాన్ చేసింది. దీనికి ముందు చివరి ఓవర్ మూడో బంతికి క్రాలీ ముందుకు వచ్చాడు. మహ్మద్ సిరాజ్, బుమ్రా కూడా బ్యాటర్లతో వాగ్వాదానికి దిగారు. ఇంటర్నేషనల్ మ్యాచులో ఇలాంటివి సరికాదని సూచించారు.
SHUBMAN GILL TO ZAK CRAWLEY. 🗣️
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2025
"Grow some FKing balls, Zak". pic.twitter.com/66UMujR8bb
భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టులో ఓవరాల్‌గా..
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ సెంచరీ (104) చేయగా, భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో కెఎల్ రాహుల్ సెంచరీ (100), రిషబ్ పంత్ (74), రవీంద్ర జడేజా (72) కీలక ఇన్నింగ్స్ లతో 387కి భారత్ ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో రెండు జట్లు ఒకే స్కోరు వద్ద ఆలౌట్ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ స్కోరు ప్రస్తుతం 2/0.





















