IND vs ENG Test: హైదరాబాద్ కి చేరుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ టీం
IND vs ENG Test: శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు సాంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు.
England team arrives in Hyderabad: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరేందుకు కీలకమైన టెస్ట్ సిరీస్‌లో భారత్‌తో తలపడేందుకు ఇంగ్లండ్ హైదరాబాద్ (Hyderabad) వచ్చేసింది. భారత్-ఇంగ్లండ్ (IND vs ENG Test) మధ్య తొలి టెస్ట్ ఈ గురువారం నుంచి జరగనుంది. అబుదాబిలో దాదాపు నెల రోజుల క్యాంపు తర్వాత ఇంగ్లీష్ జట్టు నేరుగా హైదరాబాద్‌కు వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు సాంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లను చూడడానికి అభిమానులు ఎగబడగా ఆ వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (England Cricket board)ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. హలో హైదరాబాద్.. ఇది ముత్యాల నగరం అంటూ పోస్ట్‌కు కామెంట్ పెట్టింది.
భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుండగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లోని ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అబుదాబిలో దాదాపు నెల రోజుల క్యాంపు అనంతరం ఇంగ్లండ్ జట్టు భారత్‌కు వచ్చింది. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా టెస్ట్ సిరీస్ బరిలోకి దిగనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించిన రోహిత్ సేన పట్టుదలగా ఉంది.
మరోవైపు కొంతమంది టీమ్‌ఇండియా ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. కుల్‌దీప్, జడేజా, యశస్వి, అశ్విన్, శుభ్‌మన్ గిల్ భాగ్యనగరానికి చేరుకున్నారు. హైదరాబాద్ పేసర్ సిరాజ్ ఇక్కడే ఉన్నాడు. మిగిలిన భారత ఆటగాళ్లు, ఇంగ్లాండ్ క్రికెటర్లు నేడు హైదరాబాద్ చేరుకుంటారు. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో గురువారం ఆరంభమవుతుంది. ఆదివారం నుంచి ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తారు. తాజ్ డెక్కన్‌లో ఇంగ్లాండ్, పార్క్ హయత్‌లో భారత ఆటగాళ్ల బసకు ఏర్పాట్లు చేశారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు