IND Vs ENG 5th Test England Target: 245 పరుగులకు టీమిండియా ఆలౌట్ - ఇంగ్లండ్ లక్ష్యం భారీనే అయినా!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యం నిలిచింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా ఇంగ్లండ్‌కు 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 245 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం 132 పరుగులతో కలిపి ఇంగ్లండ్ ముందు 372 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఛతేశ్వర్ పుజారా (66: 168 బంతుల్లో, 8 ఫోర్లు), రిషబ్ పంత్ (57: 86 బంతుల్లో, 8 ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు.
132 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను (4: 3 బంతుల్లో) ఇన్నింగ్స్ మూడో బంతికే అండర్సన్ అవుట్ చేశాడు. అనంతరం మరో ఓపెనర్ పుజారా, హనుమ విహారి (11: 44 బంతుల్లో, ఒక ఫోర్) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 39 పరుగులు జోడించారు.
తర్వా బ్రాడ్... హనుమ విహారిని అవుట్ చేసి రెండో వికెట్‌ను ఇంగ్లండ్‌కు అందించారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (20: 40 బంతుల్లో, నాలుగు ఫోర్లు) పేలవ ఫాం ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగింది. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ వెనుదిరిగాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, పుజారా మరో వికెట్ పడకుండా మూడో రోజును ముగించారు. మూడో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
125-3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలోనే మరో వికెట్ కోల్పోయింది. అర్థ సెంచరీ చేసి ఫాంలోకి వచ్చిన పుజారాను (66: 168 బంతుల్లో, రెండు ఫోర్లు) స్టువర్ట్ బ్రాడ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (19: 26 బంతుల్లో, మూడు వికెట్లు) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. అర్థ సెంచరీ పూర్తి చేసిన రిషబ్ పంత్ (57: 86 బంతుల్లో, 8 ఫోర్లు) కూడా కాసేపటికే అవుటయ్యాడు. దీంతో టీమిండియా 198 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే శార్దూల్ ఠాకూర్ (4: 26 బంతుల్లో) అవుటయ్యాడు.
షమీ, రవీంద్ర జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో భారత్ 229-7 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది. లంచ్ నుంచి వచ్చాక 16 పరుగుల వ్యవధిలోనే భారత్ మిగిలిన మూడు వికెట్లూ కోల్పోయి 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మూడు వికెట్లూ బెన్ స్టోక్స్‌కే దక్కాయి. మొత్తంగా ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు తీసుకోగా... స్టువర్ట్ బ్రాడ్, మాటీ పాట్స్ రెండేసి, అండర్సన్, జాక్ లీచ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.