అన్వేషించండి

IND vs ENG 4th Test: సిరీస్ మ‌న‌దే , నాలుగో టెస్టులో టీమిండియా విజయం

IND vs ENG 4th Test Day 4 Highlights: రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించి... మరో మ్యాచ్ మిగిలి వుండగానే సిరీస్ కైవసం చేసుకుంది

Ranchi Test Highlights: రాంచీ (ranchi)వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా(Team India) ఘన విజయం సాధించి... మరో మ్యాచ్ మిగిలి వుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. లక్ష్య సాధనలో ఇంగ్లాండ్(England) స్పిన్నర్ బషీర్ కాస్త కంగారుపెట్టినా  తొలి  ఇన్నింగ్స్ హీరో జురెల్ గిల్ భారత్ ను విజయ తీరాలకు చేర్చారు.  ఆరంభంలో సారధి రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ భారత్ కు బలమైన పునాది వేశారు. కానీ బషీర్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో ఉత్కంఠ రేగింది.  కానీ గిల్... జురెల్ మిగితా పనిని ఎలాంటి ఒతిడి లేకుండా పూర్తి చేశారు.  

145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్‌
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 145 పరుగులే ఆలౌట్‌ అయింది. టీమిండియా స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్‌ వికెట్ల పతనం వేగంగా సాగింది. దీంతో టీమిండియా ముందు 192 పరుగుల లక్ష్యం నిలిచింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్‌ 5 వికెట్లతో బ్యాటర్లను కట్టిపడేశాడు. కుల్‌దీప్ 4, జడేజా ఒక వికెట్‌ తీశారు. అన్ని వికెట్లు స్పిన్నర్లకే పడటం విశేషం. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో క్రాలే 60, బెయిర్‌ స్టో 30, మినహా అందరూ విఫలమయ్యారు. ఐదుగురు బ్యాటర్లు రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత్‌ విజయానికి 192 పరుగులు చేయాలి. 
 
రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 152 పరుగుల దూరంలో ఉంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు చేయగా క్రీజులో జైస్వాల్‌ 14*, రోహిత్‌ 24* ఉన్నారు. అయితే ఈరోజు  భార‌త బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 55 పరుగులకే పెవిలియన్ చేరగా,  శుభ్‌మ‌న్ గిల్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓవ‌ర్ నైట్ బ్యాట‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్ , రోహిత్ శ‌ర్మ లు నాలుగో రోజు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. అయితే  జోరూట్ బౌలింగ్‌లో అండ‌ర్స‌న్ ప‌ట్టిన అద్భుత క్యాచ్ కు య‌శ‌స్వి జైస్వాల్ ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 84 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది. తరువాత రోహిత్ శ‌ర్మ‌ను టామ్‌హార్డ్లీ ఔట్ చేయ‌గా  ర‌జ‌త్ పాటిదార్ షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో డ‌కౌట్ అయ్యాడు. దీంతో 100 ప‌రుగుల‌కే భార‌త్ మూడు వికెట్లు కోల్పోయింది. ర‌వీంద్ర జ‌డేజా, స‌ర్ఫ‌రాజ్ ఖాన్  లు కూడా త్వరగా  ఔట్ అయినా శుభ్‌మ‌న్ గిల్‌, ధ్రువ్ జురెల్ లు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. వీరిద్ద‌రు అభేధ్య‌మైన ఆరో వికెట్‌కు 72 ప‌రుగులు జోడించి భార‌త్‌కు విజ‌యాన్ని అందించారు.
 
అశ్విన్‌ రికార్డులే రికార్డులు
రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌(India), ఇంగ్లాండ్‌(England) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌, క్రికెట్‌ జీనియస్‌, స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. 98 టెస్టుల్లోనే అశ్విన్‌ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ క్రికెట్లో అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమైన ఈ ఘనతను ఈ చెన్నై స్పిన్‌ మాంత్రికుడు అందుకున్నాడు. అశ్విన్‌ కంటే ముందు 147 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో కేవలం 8 మంది మాత్రమే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి చేరుకున్నారు. అలాగే ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బెయిర్‌ స్టోను అవుట్‌ చేసి అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు. 23 మ్యాచుల్లోనే ఈ స్టార్‌ స్పిన్నర్‌ వంద వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా అశ్విన్‌ నిలిచాడు. అశ్విన్ కంటే ముందు జేమ్స్‌ అండర్సన్‌ భారత జట్టుపై 139 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు. 
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget