IND VS ENG 2nd Test: రెండో టెస్టులో టీమిండియాలో 3 భారీ మార్పులు! బుమ్రా ఆడకపోతే కష్టమే
Jjasprit bumrah | జులై 2న బర్మింగ్ హాంలోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండో టెస్టులో తలపడనున్నాయి. అయితే పేసర్ బుమ్రా సహా ముగ్గురు ఆటగాళ్లను పక్కన పెట్టే అవకాశం ఉంది.

Team India to drop these players against England 2nd Test: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నుంచి కొందరు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. అదే సమయంలో, పేలవమైన ఫీల్డింగ్, కొందరు బ్యాటుతో విఫలమై తమ ప్రదర్శనతో చాలా నిరాశపరిచారు. రెండు టెస్టు కోసం టీమ్ ఇండియాలో 3 పెద్ద మార్పులు చూడవచ్చు. జస్ప్రీత్ బుమ్రాకు రెండవ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వవచ్చు. అతడిపై వరుస మ్యాచ్ ల ఓవర్ లోడ్ తో కీలకమైన మ్యాచ్ లతో అందుబాటులో ఉంటాడా లేదా అని మేనేజ్ మెంట్ భావిస్తోంది. బుమ్రాతో పాటు, జట్టులో మరో ఇద్దరు ఆటగాళ్లని ప్లేయింగ్-11 నుండి తప్పించవచ్చు. కానీ బుమ్రా లేకపోతే బౌలింగ్ అటాక్ కష్టమేనని వినిపిస్తోంది.
బుమ్రా సహా ముగ్గురు ఆటగాళ్లు రెండో టెస్టు నుంచి ఔట్
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ జూలై 2 నుంచి ప్రారంభం కానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత 3 భారీ మార్పులతో దిగవచ్చు.
1- జస్ప్రీత్ బుమ్రా- బుమ్రా మొదటి మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా 44 ఓవర్లు వేశాడు. బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. అతను భారతదేశం తరపున సక్సెస్‌ఫుల్ బౌలర్. కానీ బుమ్రాకు ఓవర్ బర్డెన్ దృష్టిలో ఉంచుకుని, టీమ్ ఇండియా అతనికి రెండవ టెస్ట్‌లో విశ్రాంతి ఇస్తుందని వినిపిస్తోంది. కానీ అతడు లేకపోతే భారత బౌలింగ్ అటాక్ బలహీనంగా మారి సిరీస్ లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలోకి వెళ్తే కోలుకోవడం కష్టమే.
2- శార్దూల్ ఠాకూర్- టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టు నుంచి తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. శార్దూల్ మొదటి మ్యాచ్‌లో తన ప్రదర్శనతో చాలా నిరాశపరిచాడు. శార్దూల్ బ్యాట్‌తో 2 ఇన్నింగ్స్‌లలో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా అంతగా రాణించలేదు. శార్దూల్ మ్యాచ్‌లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు.
3- రవీంద్ర జడేజా- సీనియర్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను రెండో టెస్టుకు పక్కన పెట్టవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ జడేజా పెద్దగా రాణించలేదు. జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 11 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ జడ్డూ నిరాశపరిచాడు. కేవలం ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు.





















