అన్వేషించండి
Advertisement
India Versus England: నిప్పులు చెరిగిన బుమ్రా - రెండో టెస్ట్‌లో పట్టుబిగించిన భారత్
IND vs ENG 2nd Test : వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించే దిశగా పయనిస్తోంది. ఇంగ్లాండ్ జట్టును 253 పరుగులకే కుప్పకూల్చింది.
India lead by 171 at stumps: వైజాగ్ (Visakhapatnam)వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా(India) పట్టు బిగించే దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) డబుల్ సెంచరీతో 396 పరుగులు చేసిన రోహిత్ సేన... అనంతరం ఇంగ్లాండ్(England) జట్టును 253 పరుగులకే కుప్పకూల్చింది. బుమ్రా(Bumrah) పదునైన బంతులతో బ్రిటీష్ జట్టు పతనాన్ని శాసించాడు. ఆరు వికెట్లు నేలకూల్చి టీమిండియా విజయావకాశాలను మెరుగుపర్చాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఒక్క వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 13, జైస్వాల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్ జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు చేస్తుందన్న దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
నిప్పులు చెరిగిన బుమ్రా
టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బ్రిటీష్ జట్టుకు.. ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించి టీమిండియాలో ఆందోళన పెంచారు. కుల్‌దీప్ యాదవ్.. డకెట్‌ను అవుట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. డకెట్ అవుటైనా క్రాలే సాధికారికంగా ఆడాడు. శతకం దిశగా సాగుతున్న క్రాలేను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. 76 పరుగులు చేసి క్రాలే అవుట్ అవ్వగా... 118 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత బూమ్ బూమ్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో బ్రిటీష్ జట్టును ముప్పుతిప్పలు పెట్టాడు. తొలుత బెయిర్ స్టోను అవుట్ చేసిన బుమ్రా... ఆ తర్వాత తొలి మ్యాచ్ హీరో ఓలి పోప్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి ఇంగ్లాండ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. 25 పరుగులు చేసిన బెయిర్ స్టోను కూడా బుమ్రా అవుట్ చేశాడు. కుల్‌దీప్ యాదవ్ స్వల్పవ్యవధిలో బెన్ ఫోక్స్ (6), రెహాన్ అహ్మద్ (6)లను వెనక్కి పంపాడు. అర్ధ శతకం దిశగా సాగుతున్న స్టోక్స్‌ని బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేసి టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అదుకున్నాడు. చివరి రెండు వికెట్లు హార్ట్‌లీ (21), జేమ్స్ అండర్సన్ (6) కూడా బుమ్రాకే దక్కాయి. బెన్ స్టోక్స్ 47 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను కాపాడేందుకు ప్రయత్నించినా... బుమ్రా ఓ అద్భుత బంతితో స్టోక్స్‌ను బౌల్డ్ చేశాడు. అనంతరం 253 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. క్రాలే 76, స్టోక్స్ 47 పరుగులతో రాణించగా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు, కుల్‌దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశారు.
యశస్వీ ద్వి శతక మోత
రెండో టెస్ట్‌లో యశస్వి డబుల్ సెంచరీతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన యశస్వి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్, బుమ్రా, ముఖేష్ కుమార్ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో భారత జట్టు 400 పరుగులకు నాలుగు పరుగుల దూరంలోనే అగిపోయింది. నిన్నటి ఫామ్‌ను కొనసాగించిన యశస్వి ద్వి శతకాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించాడు. సిక్సర్‌తో సెంచరీని అందుకున్న ।యశస్వి జైస్వాల్... ఫోర్‌తో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తక్కువ వయసులో ద్వి శతకం సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. యశస్వి కంటే ముందు వినోద్ కాంబ్లీ, సునీల్ గవాస్కర్ ఈ రికార్డును నమోదు చేశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion