Ind vs Ban, 2nd Test: కాసేపే పోరాడిన బంగ్లా! యాష్, ఉమేశ్ పంజాతో తొలిరోజు టీమ్‌ఇండియాదే!
Ind vs Ban, 2nd Test: మీర్పూర్ టెస్టులో టీమ్‌ఇండియా దుమ్మురేపుతోంది. తొలి ఇన్నింగ్సులో బంగ్లాదేశ్‌ను 73.5 ఓవర్లకు 227 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత ఆట ముగిసే సమయానికి భారత్ 19/0తో నిలిచింది.
Ind vs Ban, 2nd Test:
మీర్పూర్ టెస్టులో టీమ్‌ఇండియా దుమ్మురేపుతోంది. తొలిరోజు ప్రత్యర్థిపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను 73.5 ఓవర్లకు 227 పరుగులకే ఆలౌట్ చేసింది. ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో నాలుగు వికెట్లతో టైగర్స్ నడ్డి విరిచారు. జయదేవ్ ఉనద్కత్ 2 వికెట్లు పడగొట్టాడు. మోమినల్ హఖ్ (84; 157 బంతుల్లో 12x4, 1x6) ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (3 బ్యాటింగ్; 30 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (14 బ్యాటింగ్; 20 బంతుల్లో 1x4, 1x6) అజేయంగా నిలిచారు. ప్రస్తుతం టీమ్‌ఇండియా 208 పరుగుల లోటుతో ఉంది.
బంగ్లా పోరాటం కాసేపే!
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు నజ్ముల్ హుస్సేన్ శాంటో (24), జకీర్ హసన్ (15) లు నెమ్మదిగా ప్రారంభించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 39 పరుగులు జోడించాక జకీర్ ను జైదేవ్ ఉనద్కత్ ఔట్ చేశాడు. ఆ వెంటనే అశ్విన్ బౌలింగ్ లో శాంటో వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే కెప్టెన్ షకీబుల్ హసన్, మోమినల్ హక్ లు నిలకడగా ఆడటంతో లంచ్ వరకు మరో వికెట్ కోల్పోకుండా బంగ్లా 82 పరుగులు చేసింది.
ఉమేష్, అశ్విన్ అదుర్స్
అయితే లంచ్ తర్వాత తొలి బంతికే ఉమేష్ బౌలింగ్ లో పుజారాకు క్యాచ్ ఇచ్చి షకీబ్ (16) ఔటయ్యాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో బంగ్లా వికెట్లు కోల్పోయింది ఓవైపు మోమినల్ హక్ (84) క్రీజులో పాతుకుపోయి ఆడుతున్నప్పటికీ.. అతనికి సరైన సహకారం అందలేదు. దీంతో బంగ్లాదేశ్ 73.5 ఓవర్లలో 227 పరుగులకు ఔటయ్యింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ కట్టుదిట్టంగా బంతులేయడమే కాక 4 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కూడా 4 వికెట్లతో రాణించాడు.
View this post on Instagram