News
News
X

Ind vs Ban, 2nd ODI: అయిపాయె - బంగ్లాదేశ్ మీద కూడా వన్డే సిరీస్ కోల్పోయిన భారత్!

భారత్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఐదు పరుగులతో విజయం సాధించింది.

FOLLOW US: 
Share:

భారత్‌కు మరో అవమానకరమైన ఓటమి. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఐదు పరుగులతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌ను కూడా భారత్ 0-2తో కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసి ఐదు పరుగులతో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ తరఫున సెంచరీ చేసిన మెహదీ హసన్ మిరాజ్‌కు (100 నాటౌట్: 83 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్కోరు బోర్డుపై 13 పరుగులు చేరే సరికే ఓపెనర్లు విరాట్ కోహ్లీ (5: 6 బంతుల్లో, ఒక ఫోర్), శిఖర్ ధావన్ (8: 10 బంతుల్లో, ఒక ఫోర్) అవుటయ్యారు. రోహిత్ శర్మకు గాయం కావడంతో విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌కు వచ్చాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (11: 19 బంతుల్లో, ఒక ఫోర్), కేఎల్ రాహుల్ (14: 28 బంతుల్లో) కూడా విఫలం అయ్యారు. దీంతో భారత్ 65 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

అయితే శ్రేయస్ అయ్యర్ (82: 106 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), అక్షర్ పటేల్ (56: 56 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) టీమిండియాను ఆదుకున్నారు. వీరు ఐదో వికెట్‌కు 16.3 ఓవర్లలోనే 107 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ నాలుగు ఓవర్లలోనే వ్యవధిలోనే అవుటవ్వడంతో భారత్ 189 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ విఫలం అయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ (51 నాటౌట్: 28 బంతుల్లో, మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) గెలుపుపై ఆశలు రేపారు. కానీ అది గెలవడానికి సరిపోలేదు. దీంతో భారత్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 266 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

వరుస వికెట్లు తీసినప్పటికీ...
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ను మొదట భారత బౌలర్లు బాగానే కట్టడి చేశారు. పేసర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ లు కట్టుదిట్టంగా బంతులేశారు. సిరాజ్ కొంచెం ఎక్కువగానే పరుగులిచ్చినప్పటికీ వికెట్ల ఖాతా మొదలుపెట్టింది అతనే. కెప్టెన్ లిటన్ దాస్ (7) తో సహా అనముల్ హక్(11) వికెట్లను పడగొట్టాడు. తర్వాత నజముల్ హుస్సేన్ (21) ను ఉమ్రాన్ మాలిక్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బందిపడ్డ షకీబుల్ హసన్ (8) ను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే వాషింగ్టన్ సుందర్ వరుస బంతుల్లో ముష్ఫికర్ రహీం (12), ఆఫిఫ్ (0) ను ఔట్ చేశాడు. దీంతో 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లా ఇబ్బందుల్లో పడింది. టీమిండియా బౌలర్ల జోరు చూస్తే 100 పరుగుల లోపే బంగ్లా ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే....

ముందు చకచకా వికెట్లు పడగొట్టి తర్వాత పట్టు విడవడం అలవాటైన భారత బౌలర్లు ఈ మ్యాచులోనూ అంతే చేశారు. తొలి వన్డే హీరో మెహదీ హసన్ మిరాజ్, మహమ్మదుల్లాలు బంగ్లా ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. కుదురుకునేంత వరకు ఆచితూచి ఆడిన ఈ జంట ఆ తర్వాత క్రీజులో పాతుకుపోయారు. అడపా దడపా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలోనే ఏడో వికెట్ కు శతక ( భాగస్వామ్యం అందించారు. వీరి భాగస్వామ్యాన్ని టీమిండియా బౌలర్లు విడదీయలేక అవస్థలు పడ్డారు. తాత్కాలిక కెప్టెన్ రాహుల్ మార్చి మార్చి బౌలర్లను ప్రయోగించినా ప్రయోజనం లేకపోయింది. వీరిద్దరూ ఏమాత్రం ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేశారు. చివరికి 47వ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ మహమ్మదుల్లాను (77) కీపర్ క్యాచ్ ద్వారా ఔట్ చేశాడు. అయితే తర్వాత వచ్చిన నసుమ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మెహదీ హసన్ తో కలసి ఎనిమిదో వికెట్ కు 24 బంతుల్లోనే 53 పరుగులు జోడించాడు. చివరి బంతికి మెహదీ హసన్ వన్డేల్లో తన మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు.  దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, మహ్మద్ సిరాజ్ 2, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు పడగొట్టారు. 

Published at : 07 Dec 2022 08:21 PM (IST) Tags: Rohit Sharma Indian Cricket Team Bangladesh Cricket Team IND vs BAN Litton Das IND vs BAN 2ND ODI Sher-e-Bangla Stadium

సంబంధిత కథనాలు

Ricky Ponting: ధోని కూడా కొట్టలేకపోయిన రికీ కెప్టెన్సీ రికార్డు - బద్దలు కొట్టేవారెవరైనా ఉన్నారా?

Ricky Ponting: ధోని కూడా కొట్టలేకపోయిన రికీ కెప్టెన్సీ రికార్డు - బద్దలు కొట్టేవారెవరైనా ఉన్నారా?

IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ వైపే ప్రపంచం చూపు - ఫైనల్‌ను నిర్ణయించే సిరీస్!

IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ వైపే ప్రపంచం చూపు - ఫైనల్‌ను నిర్ణయించే సిరీస్!

Suryakumar Yadav: ఒక్క భారీ ఇన్నింగ్స్‌తో ఐదుగురి రికార్డులు అవుట్ - సూర్య ఇది చేయగలడా?

Suryakumar Yadav: ఒక్క భారీ ఇన్నింగ్స్‌తో ఐదుగురి రికార్డులు అవుట్ - సూర్య ఇది చేయగలడా?

Virat Kohli: మైదానంలోనే కాదు బయట కూడా కింగే - 2022 మోస్ట్ పాపులర్ క్రికెటర్‌గా విరాట్!

Virat Kohli: మైదానంలోనే కాదు బయట కూడా కింగే - 2022 మోస్ట్ పాపులర్ క్రికెటర్‌గా విరాట్!

Murali Vijay Records: భారత ఓపెనర్‌గా మురళీ విజయ్ ప్రత్యేక రికార్డు - ఓపెనర్లలో నాలుగో స్థానంలో!

Murali Vijay Records: భారత ఓపెనర్‌గా మురళీ విజయ్ ప్రత్యేక రికార్డు - ఓపెనర్లలో నాలుగో స్థానంలో!

టాప్ స్టోరీస్

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే

ఆస్ట్రేలియలో చిన్న క్యాప్సూల్‌ ఉన్న ట్రక్‌ అదృశ్యం- కంగారుల దేశానికి నిద్ర కరవు

ఆస్ట్రేలియలో చిన్న క్యాప్సూల్‌ ఉన్న ట్రక్‌ అదృశ్యం- కంగారుల దేశానికి నిద్ర కరవు

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?