By: ABP Desam | Updated at : 14 Dec 2022 11:57 AM (IST)
Edited By: nagavarapu
రిషభ్ పంత్ (source: BCCI twitter)
IND vs BAN 1st Test: భారత్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి రోజు టీమిండియా బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. లంచ్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేశారు. రిషభ్ పంత్ 29, పుజారా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో రిషభ్ పంత్ 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్సును కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ లు ప్రారంభించారు. వీరిద్దరూ ఆచితూచి ఆఢుతూ స్కోరు బోర్డును నడిపించారు. పిచ్ బౌలింగ్ కు సహకరించటంతో ఈ జంట నెమ్మదిగా ఆడింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ భారత బ్యాటర్లను పరీక్షించారు. మొదటి వికెట్ కు 41 పరుగులు జోడించాక ఖలీద్ అహ్మద్ బౌలింగ్ లో రాహుల్ బౌల్డయ్యాడు. ఆ వెంటనే గిల్ కూడా తైజుల్ ఇస్లాంకు వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత భారత్ కు పెద్ద షాక్ తగిలింది. మూడో వన్డేలో సెంచరీ చేసి మంచి ఫాంలో ఉన్న విరాట్ కోహ్లీ 5 బంతులు మాత్రమే ఆడి ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. కోహ్లీ వికెట్ ను కూడా తైజులే తీశాడు. దీంతో భారత్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్ దూకుడుగా ఆడాడు. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. మరోవైపు పుజారా స్ట్రైక్ రొటేట్ చేస్తూ పంత్ కు సహకరించాడు. వీరిద్దరూ ఇప్పటివరకు నాలుగో వికెట్ కు 37 పరుగులు జోడించారు. లంచ్ సమయానికి పంత్ 29, పుజారా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 2, ఖలీద్ అహ్మద్ ఒక వికెట్ తీశారు.
Lunch on Day 1 of the 1st Test.#TeamIndia lose three wickets in the morning session with 85 runs on the board.
— BCCI (@BCCI) December 14, 2022
Scorecard - https://t.co/CVZ44NpS5m #BANvIND pic.twitter.com/iiYYlbpnQi
ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు స్పిన్... మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ లు పేసర్లుగా ఉన్నారు.
భారత్ తుది జట్టు
శుభమన్ గిల్, కేఎల్ రాహుల్(కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్ తుది జట్టు
జాకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్.
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఆడబోమన్న ఆస్ట్రేలియా - సురేష్ రైనా ఏమన్నాడంటే?
Virat Kohli: కళ్లకు గంతలు కట్టుకున్నా టార్గెట్ మిస్ అవ్వదు - విరాట్ వైరల్ వీడియో చూస్తే ఎవరైనా ఫ్యాన్స్ అవ్వాల్సిందే!
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు - ఐసీసీ ఎవరిని సెలక్ట్ చేసింది?
WPL 2023: ప్లేఆఫ్స్‌కు మూడే జట్లు - మహిళల ఐపీఎల్లో వెరైటీ రూల్!
IND vs AUS Test: ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాదే- ఎందుకంటే: గ్రెగ్ ఛాపెల్
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!