IND vs AUS Final: దేశాన్ని ఏకం చేసిన ఫైనల్, టీమిండియా గెలవాలని యాగాలు, హోమాలు, పూజలు
ODI World Cup 2023: అభిమానులు టీమిండియా ఆటగాళ్ల జెర్సీలు ధరించి... వారి ఫోటోలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ల ఫొటోలకు వీర తిలకం దిద్ది పూజలు చేస్తున్నారు.
IND vs AUS World Cup 2023 Final: దేశం మొత్తం క్రికెట్ ఫివర్‌తో ఊగిపోతోంది. ఎటుచూసినా టీమిండియా(Team India) గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది. టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్ల జెర్సీలు ధరించి... వారి ఫోటోలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ల ఫొటోలకు వీర తిలకం దిద్ది పూజలు చేస్తున్నారు. చెన్నైలోని క్రికెట్ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రికెట్ గణనాథుడు 11 తలల విగ్రహరూపంలో ఉండి జట్టులోని 11 మంది క్రికెటర్లను ప్రతిబింభిస్తాడని అభిమానుల విశ్వాసం. ఈ గుడిని క్రికెట్ ప్రేమికులు నిర్మించారు. ఈ దేవాలయంలో క్రికెట్ బ్యాట్ పట్టుకున్నట్లు, బౌలింగ్ వేస్తన్నట్లు వివిద భంగిమల్లో వినాయుకుని విగ్రహాలను ప్రతిష్ఠించారు. క్రికెట్ అభిమానులు భారత్ జట్టు గెలవాలని ఇక్కడ భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అహ్మదాబాద్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా(Austrelia)పై టీంఇండియా గెలవాలని అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు, హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు.
#WATCH | Mumbai: #INDvsAUS: Fans offer prayer for team India's victory in ICC Men’s Cricket World Cup finals
— ANI (@ANI) November 18, 2023
(Visuals from Madhavbaug Temple, Mumbai) https://t.co/xMXVU3rh96 pic.twitter.com/J19KxKQ90N
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ పైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచి టీమిండియా మూడోసారి కప్పు కైవసం చేసుకోవాలని కాంక్షిస్తూ.. ముంబయిలో అభిమానులు హోమం నిర్వహించారు. మధవ్ బాగ్ శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయంలో టీమిండియా గెలవాలని అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రికెట్ ప్రేమికులు టీమిండియా జర్సీలను ధరించి..త్రివర్ణ పతాకాలు చేతబూని.....భారత్ ఫైనల్ లో విజయం సాధించాలని నినాదాలు చేశారు. రోహిత్ సేన విజయం సాధించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో కిన్నార్ అఖారా సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత క్రికెటర్ల పొస్టర్లకు విజయ తిలకం పూసి హారతి ఇచ్చారు. తమ పూజలు ఫలించి భారత్ ప్రపంచకప్ గెలిచి జగజ్జేతలుగా నిలవాలని అభిలాషించారు. ఈ ఆదివారం అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్స్ లో భారత్ , ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. పుష్కర కాలం తర్వాత టీమిండియా ఫైనల్లోకి ప్రవేశించడంతో ఈసారి కప్పు రావడం ఖాయమని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎవరికితోచిన విధంగా వారు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఒడిశాకు చెందిన సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పూరీ తీరంలో 56 అడుగుల ప్రపంచకప్ ట్రోఫీని తీర్చిదిద్ది టీమిండియాకు గుడ్ లక్ చెప్పారు. ఈ సైకత శిల్పం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
#WATCH | Rajkot, Gujarat: Ahead of the ICC Men's Cricket World Cup 2023 final match, Indian cricketer Ravindra Jadeja's sister Naina Jadeja says, "...Definitely Australia is a good team, but I think that this time the Indian team has the upper hand. Since the World Cup started,… pic.twitter.com/Kc6EZ6iHcM
— ANI (@ANI) November 18, 2023
క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ ఫైనల్ కోసం BCCI, ICC సంయుక్తంగా భారీస్థాయిలో ఏర్పాట్లు... చేస్తున్నాయి. అతిరథ మహారథులు తరలిరానున్న ఈ మ్యాచ్‌కు ముందు..... భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ టీమ్ ఎయిర్ షో నిర్వహించనుంది సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ పది నిమిషాల పాటు అహ్మదాబాద్ స్టేడియంలో ఎయిర్ షో నిర్వహించనున్నట్లు రక్షణశాఖ అధికారి వెల్లడించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్, నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. టాస్‌కు ముందు ముంబయికి చెందిన 500 మంది నృత్యకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.