News
News
X

Ashwin On Steve Smith: మీ స్లెడ్జింగ్‌, మైండ్‌గేమ్స్‌ మాకు తెలుసులే! ఆసీస్‌కు యాష్‌ పవర్‌ఫుల్‌ పంచ్‌!

Ashwin On Steve Smith: మైండ్‌గేమ్స్‌, స్లెడ్జింగ్‌లో ఆస్ట్రేలియా గురించి అందరికీ తెలిసిందేనని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు.

FOLLOW US: 
Share:

Ashwin On Steve Smith:

మైండ్‌గేమ్స్‌, స్లెడ్జింగ్‌లో ఆస్ట్రేలియా గురించి అందరికీ తెలిసిందేనని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ఎడతెరపి లేని క్రికెట్‌ షెడ్యూలు వల్ల చాలా జట్లు సన్నాహక మ్యాచులు ఆడటం లేదన్నాడు. ఆసీస్‌ ఇందుకు మినహాయింపేమీ కాదన్నాడు. భారత్‌లో ప్రాక్టీస్‌ మ్యాచులకు పచ్చికతో కూడిన పిచ్‌లు, అసలు మ్యాచులకు స్పిన్‌ వికెట్లు రూపొందిస్తారన్న స్టీవ్‌స్మిత్‌ వ్యాఖ్యలపై అతడు స్పందించాడు.

మరికొన్ని రోజుల్లో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ మొదలవుతోంది. భారత్‌, ఆస్ట్రేలియా జట్లు నాలుగు టెస్టుల్లో తలపడబోతున్నాయి. సాధారణంగా ఒక జట్లు మరో దేశంలో పర్యటిస్తున్నప్పుడు పిచ్‌, వాతావరణం అలవాటు పడేందుకు సన్నాహక మ్యాచులు ఆడుతుంది. అయితే ఆసీస్‌ ఈ సారి అలా చేయడం లేదు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శిబిరం ఏర్పాటు చేసుకుంది. అక్కడే నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తోంది. ఫిబ్రవరి 6న తొలి టెస్టు జరిగే నాగ్‌పుర్‌కు రానుంది.

సన్నాహక మ్యాచులు ఆడకపోవడంపై స్మిత్‌ను మీడియా ప్రశ్నించగా ప్రాక్టీస్‌ మ్యాచులు ఆడటం కన్నా ఒంటరిగా సాధన చేయడమే మంచిదన్నాడు. బీసీసీఐ రూపొందించే పిచ్‌లు సంబంధం లేకుండా ఉంటాయని ఆరోపించాడు. ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం ఇలాగే వ్యాఖ్యానించారు. వీరి మాటలకు యాష్ యూట్యూబ్‌లో బదులిచ్చాడు.

'సాధారణంగా మేం ఇంగ్లాండ్‌తో రెండు సన్నాహక మ్యాచులు ఆడుతుంటాం. ఈసారి భారత్‌లో ఎలాంటి ప్రాక్టీస్‌ మ్యాచులు లేవు. 2017లో మేం చివరి సారి అక్కడికి వెళ్లినప్పుడు సాధన చేసేందుకు పచ్చిక పిచ్‌లనే ఏర్పాటు చేసినట్టు గుర్తు. నిజానికి అది సంబంధం లేనిదే. కానీ సాధన చేసేందుకు మాకు మంచి వసతులే దొరికాయి. మిడిల్‌లో బంతి ఎలా స్పందిస్తుందో అలాగే ఉండేవి' అని అశ్విన్‌ అన్నాడు.

'ఆస్ట్రేలియా ఈసారి ఎలాంటి టూర్‌ మ్యాచులు ఆడటం లేదు. ఇదేం కొత్త కాదు. కొన్నిసార్లు విదేశాలకు వెళ్లినప్పుడు టీమ్‌ఇండియా సైతం ఇలాగే చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం భారత షెడ్యూలు బిజీగా ఉంటోంది. ఒకే తీవ్రతతో అసలు, ప్రాక్టీస్‌ మ్యాచులు ఆడటం సాధ్యమవ్వదు. 2017లో బ్రబౌర్న్‌లో పచ్చికతో కూడిన పిచ్‌ ఇచ్చారని, తొలి టెస్టుకు స్పిన్‌ పిచ్‌ రూపొదించారని స్మిత్‌ అన్నాడు. నిజం చెప్పాలంటే పుణె స్పిన్‌ పిచ్‌. మేం పచ్చికతో కూడిన వికెట్టే ఇచ్చుండొచ్చు. కానీ వీటినెవ్వరూ ప్లాన్‌ చేయరు. ఏదేమైనా సిరీసు ఆరంభానికి ముందు ఆసీస్‌ మైండ్‌ గేమ్స్‌, స్లెడ్జింగ్‌కు దిగుతుంది. ఇలా చేయడమే వారికిష్టం. ఇది వారికి అలవాటైన శైలి' అని యాష్ వివరించాడు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, శ్రీకర్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, విరాట్‌ కోహ్లీ, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌, చెతేశ్వర్‌ పుజారా, శుభ్‌ మన్‌ గిల్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌

ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఏస్టన్ ఆగర్‌, స్కాట్‌ బొలాండ్‌, అలెక్స్‌ కేరీ, కామెరాన్‌ గ్రీన్‌, పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, జోష్ హేజిల్‌వుడ్‌, ట్రావిస్ హెడ్‌, ఉస్మాన్ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌, నేథన్ లైయన్‌, లాన్స్ మోరిస్‌, టా్‌ మర్ఫీ, మ్యాట్‌ రెన్షా, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌, డేవిడ్‌ వార్నర్‌

Published at : 03 Feb 2023 06:14 PM (IST) Tags: Steve Smith Ravichandran Ashwin Ind vs Aus Border Gavaskar Trophy India pitches sledging

సంబంధిత కథనాలు

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023 Slogans: ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ స్లోగన్, దాని అర్థం మీకు తెలుసా?

IPL 2023 Slogans: ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ స్లోగన్, దాని అర్థం మీకు తెలుసా?

Sanju Samson: సంజు శామ్సన్ ఎదురు చూపులకు సరైన ఫలితం - ఏకంగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో!

Sanju Samson: సంజు శామ్సన్ ఎదురు చూపులకు సరైన ఫలితం - ఏకంగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో!

టాప్ స్టోరీస్

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా