News
News
X

నాల్లో టెస్టులో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకు ఆస్ట్రేలియా- ఓ మార్పుతో బరిలోకి టీమిండియా

నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

FOLLOW US: 
Share:

అహ్మదాబాద్‌ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ ఫ్లాట్ గా ఉండే అవకాశం ఉందన్న అంచనాతో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ రోజే ఎలాంటి టర్న్ ఉండబోదని ఆ జట్టు విశ్వసిస్తోంది. ఎందుకంటే లాస్ట్ మూడు టెస్టులు చూశాం. కనీసం మూడురోజులు కూడా ఆడలేదు. సో ఈ సారి కొంచెం ఐదు రోజుల మ్యాచ్ జరిగేలానే క్యూరేటర్ పిచ్ ప్లాన్ చేసిఉంటారని అందుకే బ్యాటింగ్‌ ఎంచుకుంది. డే బై డే పిచ్ మీద స్క్రాచెస్ వస్తాయి కాబట్టి స్పిన్నర్లకు అడ్వాంటేజ్ కావచ్చు. కానీ ఫస్ట్ డే మాత్రం బ్యాట్స్మన్ కు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉందన్న కోణంలోనే ఆ నిర్ణయం ఆసిస్ తీసుకుంది. 

అనుకున్నట్టుగానే టీమిండియా సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చి షమిని బరిలో దింపింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టులో టీమ్ఇండియా ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే భారత వెటరన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షమీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించడం కూడా  జట్టుకు ప్రయోజనం చేకూరనుంది. 

బ్యాటింగ్‌లో తడబాటు ఉన్నప్పటికీ ఎలాంటి మార్పులు చేయలేదు. భరత్‌కు మరో అవకాశం ఇచ్చారు. ఇషాన్ కిషన్‌కు ఛాన్స్ ఇచ్చి భరత్‌ను తప్పిస్తారని విశ్లేషమలు వినిపించాయి. అయితే భరత్‌కు మరో ఛాన్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. 

అహ్మదాబాద్ లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ హాజరయ్యారు. టీమిండియా టెస్టు క్యాప్‌ను రోహిత్ శర్మకు ప్రధాని నరేంద్ర మోదీ అందజేశారు. అదే సమయంలో స్టీవ్ స్మిత్ కు టీమ్ క్యాప్‌ను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఇచ్చారు. భారత్, ఆస్ట్రేలియాల స్నేహం 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.

నేటితో (మార్చి 9) భారత్, ఆస్ట్రేలియాల మధ్య స్నేహానికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి క్రికెట్ మ్యాచ్ చూడటం కంటే గొప్పది ఏముంటుందని అంతా భావించారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగో టెస్టు మ్యాచ్ ను ఇరువురు ప్రధానులు వీక్షించిస్తున్నారు. వాస్తవానికి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ బుధవారం (మార్చి 8) గుజరాత్ చేరుకున్నారు. తొలి రోజు గుజరాత్ లో హోలీ ఆడిన ఆయన రెండో రోజు మ్యాచ్ ను ఆస్వాదిస్తున్నారు. భారత్‌తో సంబంధాల బలోపేతానికి ఇదొక చారిత్రాత్మక అవకాశమని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ తన తొలి భారత పర్యటనకు బయలుదేరే ముందు వ్యాఖ్యానించారు. 

ఈ ఒక్క మ్యాచ్ ఈ ఒక్క మ్యాచ్ గెలిచేస్తే చాలు...వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్ కు టీమిండియా రైట్ రాయల్ గా వెళ్లిపోతుంది. అందుకే ఆస్ట్రేలియా ఇండియాల మధ్య ఈ ఇంత క్రూషియల్ గా మారింది. ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్ లో ఆధిక్యం సంపాదించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ముందజలో ఉంది.

Published at : 09 Mar 2023 09:17 AM (IST) Tags: Steve Smith Indian Cricket Team Ind vs Aus Narendra Modi Stadium Australia Cricket Team ROHIT SHARMA IND vs AUS 4th Test

సంబంధిత కథనాలు

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

IPL 2023: గ్రౌండ్‌లో రష్మిక, కామెంట్రీ బాక్సులో గవాస్కర్ - పుష్ప సాంగ్ కు స్టెప్పులేసిన దిగ్గజ బ్యాటర్

IPL 2023: గ్రౌండ్‌లో రష్మిక, కామెంట్రీ బాక్సులో గవాస్కర్ - పుష్ప సాంగ్ కు స్టెప్పులేసిన దిగ్గజ బ్యాటర్

పంజాబ్, కోల్‌కతా రాతలు మారేనా! కొత్త సారథులు ఏం చేస్తారో..?

పంజాబ్, కోల్‌కతా రాతలు మారేనా! కొత్త సారథులు ఏం చేస్తారో..?

టాప్ స్టోరీస్

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు