IND vs AUS, 3rd Test: మనోళ్లకే 'కంగారు' - తొలిరోజే ఇండోర్ టెస్టుపై ఆసీస్ పట్టు!
IND vs AUS, 3rd Test: ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మొదటి రోజు ఆట ముగిసే సరికి 47 పరుగుల ఆధిక్యం సాధించింది. 54 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 156 స్కోర్ చేసింది.
IND vs AUS, 3rd Test:
అనుకున్నదొక్కటీ! అయినది ఒక్కటీ! బోల్తా పడ్డాదిలే హిట్‌మ్యాన్ సేన! అవును.. ఇండోర్ టెస్టులో మనోళ్లు వెనుకంజ వేశారు. తొలిరోజు ప్రత్యర్థికి లొంగిపోయారు. బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. ఒక్కరంటే ఒక్కరూ 25 పరుగులు చేయలేదు. మరోవైపు ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మొదటి రోజు ఆట ముగిసే సరికి 47 పరుగుల ఆధిక్యం సాధించింది. 54 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 156 స్కోర్ చేసింది. కామెరాన్ గ్రీన్ (6 బ్యాటింగ్), పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (7 బ్యాటింగ్) అజేయంగా నిలిచారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (60; 147 బంతుల్లో 4x4) అద్భుత అర్ధశతకం ఆదుకున్నాడు. అంతకు ముందు హిట్‌మ్యాన్ సేన 33.2 ఓవర్లకు 109కి ఆలౌటైంది.
ఖవాజాయే తేడా!
టీమ్‌ఇండియాకు ఆస్ట్రేలియాకు తేడా ఉస్మాన్ ఖవాజా! స్పిన్ ఆడటంలో తిరుగులేదనుకున్న భారత ఆటగాళ్లు అదే స్పిన్ దెబ్బకు కుదేలయ్యారు. ఆతిథ్య జట్టులోనూ భయం ఉన్నా ఖవాజా ఆదుకున్నాడు. తిరుగులేని హాఫ్ సెంచరీ బాదేశాడు. మొదట్లోనే జడేజా బౌలింగ్ ఔటై నోబాల్‌తో బతికిపోయిన అతడు ఆ తర్వాత చెలరేగాడు. ఆసీస్‌కు అవసరమైన స్కోరు అందించాడు. జట్టు స్కోరు 12 వద్దే ట్రావిస్ హెడ్ (9) ఔటైనా మార్నస్ లబుషేన్ (31; 91 బంతుల్లో 4x4)తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. 108 వద్ద లబుషేన్‌ను జడ్డూ ఔట్ చేశాడు. మరికాసేపటికే ఖవాజానూ అతడే పెవిలియన్ పంపించాడు. ఈ క్రమంలో పీటర్ హ్యాండ్స్‌కాంబ్ అండతో స్టీవ్‌స్మిత్ (26; 38 బంతుల్లో 4x4) సమయోచిత స్కోరు చేశాడు. జట్టు స్కోరు 146 వద్ద అతడిని జడ్డూ ఔట్ చేసి నాలుగో వికెట్ అందుకున్నాడు.
నిరాశపర్చిన బ్యాటర్లు
పిచ్‌పై పగుళ్లు విపరీతంగా ఉండటంతో టీమ్‌ఇండియా వెంటనే బ్యాటింగ్ ఎంచుకొంది. మ్యాచ్ గడిచే కొద్దీ మరింత నిర్జీవంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. అందుకే మొదటే భారీ స్కోరు చేయడం మంచిదని అనుకుంది. కానీ ఈ ఆశలు అడియాసలే అయ్యారు. కొత్త కుర్రాడు. కుహెన్‌మన్ తన సీనియర్ స్పిన్నర్ నేథన్ లైయన్‌కు జత కలిశాడు. ఆతిథ్య జట్టును తన గింగిరాలు తిరిగే బంతులతో వణికించాడు. అత్యల్ప స్కోరుకు ఆలౌటయ్యేలా చేశాడు.
మొదట్నుంచీ తడబాటే
ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మోస్తరు భాగస్వామ్యం అందించారు. పేసర్ల బౌలింగ్ లో స్వేచ్ఛగా ఆడుతూ తొలి వికెట్ కు 27 పరుగులు జోడించారు. స్పిన్నర్లు వచ్చాకే భారత పతనం మొదలైంది. కుహెన్‌మన్ బౌలింగ్ రోహిత్ (23 బంతుల్లో 12 పరుగులు) స్టంపౌట్ అయ్యాడు. ఆ వెంటనే గిల్ (21; 18 బంతుల్లో 3x4) పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో కీలకమైన పుజారా (4 బంతుల్లో 1), రవీంద్ర జడేజా (9 బంతుల్లో 4)ను లైయన్ ఔట్ చేశాడు. మరికాసేపటికే శ్రేయస్ అయ్యర్ కుహెన్‌మన్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. దీంతో 45 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయింది.
ఆఖర్లో అక్షర్ పోరాటం
ఈ దశలో విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 22), కేఎస్ భరత్ (30 బంతుల్లో 17)లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కుదురుకున్నట్లే కనిపించిన ఈ జంటను కోహ్లీని ఔట్ చేయడం ద్వారా మర్ఫీ విడదీశాడు. ఆ వెంటనే భరత్ కూడా లియాన్ బౌలింగ్ లో వికెట్ ఇచ్చేశాడు. 84/4తో భారత్ లంచ్‌కు వెళ్లింది. అక్షర్ పటేల్ (33 బంతుల్లో 12 నాటౌట్) టెయిలెండర్లతో కలిసి ఆదుకొనేందుకు ప్రయత్నించాడు. ఉమేశ్ యాదవ్ (17) రెండు సిక్సర్లు బాది స్కోరును వంద దాటించాడు. అతడినీ, అశ్విన్ (3)ను కుహెన్‌మన్ ఔట్ చేశాడు. సిరాజ్ (0) రనౌట్ అవ్వడంతో భారత్ 109కి కుప్పకూలింది.
That's Stumps on Day 1⃣ of the third #INDvAUS Test!
— BCCI (@BCCI) March 1, 2023
4️⃣ wickets so far for @imjadeja as Australia finish the day with 156/4.
We will be back with LIVE action on Day 2.
Scorecard - https://t.co/t0IGbs1SIL #TeamIndia @mastercardindia pic.twitter.com/osXIdrf9iW