IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టాస్ ఓడిన టీమ్‌ఇండియా - తొలి బ్యాటింగ్ ఎవరిదంటే?
IND vs AUS 3rd ODI: చెపాక్ వేదికగా టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా మూడో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
IND vs AUS 3rd ODI:
చెపాక్ వేదికగా టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా మూడో వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీసులో ఇదే ఆఖరి మ్యాచ్. ఇప్పటికే రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిసి 1-1తో సమంగా ఉన్నాయి. నేటి విజేత సిరీస్‌ను కైవసం చేసుకుంటారు. తొలి రెండు మ్యాచుల్లో పేసర్లు దుమ్మురేపారు. చిదంబరం స్టేడియంలో స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగనుంది.
స్టీవ్ స్మిత్ ఏమన్నాడంటే?
'మేం తొలుత బ్యాటింగ్ చేస్తాం. వికెట్ మందకొడిగా కనిపిస్తోంది. ఎండ వేడిమీ ఎక్కువగానే ఉంది. టీమ్‌ఇండియాకు మంచి టార్గెట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. చెరో మ్యాచ్ గెలవడంతో నిర్ణయాత్మక మూడో వన్డేపై ఆసక్తి నెలకొంది. ఏస్టన్ ఆగర్, డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులోకి వచ్చారు. కామెరాన్ గ్రీన్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు' అని ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ అన్నాడు.
🚨 A look at #TeamIndia's Playing XI 🔽
— BCCI (@BCCI) March 22, 2023
Follow the match ▶️ https://t.co/eNLPoZpkqi #INDvAUS | @mastercardindia pic.twitter.com/LYbzKlgV7l
రోహిత్ ఏం చెప్పాడంటే?
'మేం మొదట ఫీల్డింగ్ చేయాలనుకున్నాం. ఇదో కీలక మ్యాచ్. డిసైడర్లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం మంచిదే. ఒత్తిడిలో నిలబడి నాణ్యమైన క్రికెట్ ఆడటం సవాలే. ఏదేమైనా మేం గెలుస్తామనే అనుకుంటున్నాం. ఆస్ట్రేలియా అద్భుతమైన జట్టు. వారితో ఆడినప్పుడు మన డెప్త్ తెలుస్తుంది. జట్టులో మార్పులేమీ చేయలేదు. నలుగురు పేసర్లతో ఆడాలని అనుకున్నాం. పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ముగ్గురు స్పిన్నర్లను తీసుకున్నాం' అని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
తుది జట్లు
టీమ్‌ఇండియా : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కేరీ, మార్కస్ స్టాయినిస్, ఏస్టన్ ఆగర్, సేన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
🚨 Toss Update from Chennai 🚨
— BCCI (@BCCI) March 22, 2023
Australia have elected to bat against #TeamIndia in the third & final #INDvAUS ODI.
Follow the match ▶️ https://t.co/eNLPoZpkqi @mastercardindia pic.twitter.com/JAjU6ttaJh