IND vs AUS, 1st Innings Highlights: భారీ స్కోరు సాధించిన ఆస్ట్రేలియా - మళ్ల చితక్కొట్టిన మాథ్యూ వేడ్!
IND vs AUS, 2nd T20, VCA Stadium: భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా ఎనిమిది ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.
![IND vs AUS, 1st Innings Highlights: భారీ స్కోరు సాధించిన ఆస్ట్రేలియా - మళ్ల చితక్కొట్టిన మాథ్యూ వేడ్! IND vs AUS 2nd T20 Australia given the target of 91 runs against India at VCA Stadium IND vs AUS, 1st Innings Highlights: భారీ స్కోరు సాధించిన ఆస్ట్రేలియా - మళ్ల చితక్కొట్టిన మాథ్యూ వేడ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/ae4e5f9107999009d245bc257f61b22a1663952022886252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరును సాధించింది. వర్షం కారణంగా ఎనిమిది ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తూ ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి ఎనిమిది ఓవర్లలో 91 పరుగులు కావాలి. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మాథ్యూ వేడ్ (43 నాటౌట్: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆశించిన శుభారంభం లభించలేదు. ఓపెనర్ కామెరాన్ గ్రీన్ (5: 4 బంతుల్లో, ఒక ఫోర్), ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0: 1 బంతి), టిమ్ డేవిడ్ (2: 3 బంతుల్లో) విఫలం కావడంతో ఆస్ట్రేలియా 3.1 ఓవర్లలో 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఉన్నంత సేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ (31: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా కాసేపటికే అవుటయ్యాడు.
అయితే చివరి ఓవర్లలో మాథ్యూ వేడ్ (43 నాటౌట్: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగిపోయాడు. మూడు సిక్సర్లతో 19 పరుగులు రాబట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 8 ఓవరల్లో ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. రెండు ఓవర్లలో కేవలం 13 పరుగులే చేసి రెండు వికెట్లు తీసుకున్నాడు.
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)