అన్వేషించండి
Advertisement
Ind Vs Aus T20: విశాఖలో భారత్-ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్ , టికెట్ల విక్రయం ఎప్పటినుంచంటే?
Ind Vs Aus T20: నవంబర్ 19న ప్రపంచకప్ ముగిసిన తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 23న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ 20 మ్యాచ్‌కు విశాఖ వేదికగా మారనుంది.
Vizag T20 Match News : స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా.. ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 19న ప్రపంచకప్ ముగిసిన తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 23, 26, 28, డిసెంబర్ 1, 3 తేదీల్లో.. టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 23న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ 20 మ్యాచ్‌కు విశాఖ వేదికగా మారనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 అంతర్జాతీయ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 23న జరగనున్న మ్యాచ్‌కు ఈ నెల 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం ప్రారంభిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు.
ఈ మ్యాచ్ కోసం 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలోని బి గ్రౌండ్‌తోపాటు వన్‌టౌన్‌లోని ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయిస్తామని గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద 22వ తేదీ వరకు, అదేవిధంగా విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడి యంలోని ‘బి’ గ్రౌండ్ లో ఉన్న కౌంటర్ లో 23వ తేదీ వరకు రెడీమ్ చేసుకోవచ్చు. రూ. 600/–, రూ. 1,500/–, రూ. 2000/–, రూ. 3,000/–, రూ. 3,500/–, రూ. 6000/– విలువ గల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
భారత్‌తో జరిగే ఈ టీ 20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్టు.. 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. కీపర్ మాథ్యూ వేడ్‌కు సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. జట్టులో వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, జంపాలకు స్థానం దక్కింది. ఆసిస్ జట్టులో చాలా వరకు వరల్డ్‌కప్‌లో ఆడుతున్న ఆటగాళ్లే ఉన్నారు. వరల్డ్‌కప్‌లో ఆడుతున్న కమ్మిన్స్, స్టార్క్, హేజల్‌వుడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ లకు విశ్రాంతి ఇచ్చారు. ప్రపంచకప్ తర్వాత వీరు స్వదేశం తిరిగి వెళ్లనున్నారు.
టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినీస్, జాష్ ఇంగ్లీస్, జాసన్ బెరన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లీస్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
అమరావతి
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement