ICC World Cup 2023: వరల్డ్ కప్ కామెంటరీకి ప్రత్యేక సన్నాహాలు - 120 మందితో తొమ్మిది భాషల్లో!
ఐసీసీ వరల్డ్ కప్ 2023 కామెంటరీ విషయంలో ప్రత్యేక సన్నాహాలు చేశారు.
World Cup Commentators: క్రికెట్ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అదే సమయంలో భారత జట్టు అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే టోర్నమెంట్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ప్రత్యేక సన్నాహాలు చేసింది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో 120 మంది వ్యాఖ్యాతలు తొమ్మిది వేర్వేరు భాషల్లో వ్యాఖ్యానించడం చూడవచ్చు.
ప్రపంచ కప్ మ్యాచ్‌ల కామెంటరీ ఎన్ని భాషల్లో?
రికీ పాంటింగ్, ఇయాన్ మోర్గాన్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, షేన్ వాట్సన్, వకార్ యూనిస్ వంటి దిగ్గజాలు ప్రపంచకప్ మ్యాచ్‌లకు వ్యాఖ్యానించనున్నారు. ఇది కాకుండా క్రికెట్ అభిమానులు హిందీ, ఇంగ్లీషుతో సహా తొమ్మిది విభిన్న భాషలలో ప్రపంచ కప్ మ్యాచ్‌లను ఆస్వాదించగలరు. మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం వంటి భాషల్లో ఈ కామెంటరీ వినవచ్చు.
మాథ్యూ హేడెన్ కూతురు కూడా...
వీరందరితో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ వ్యాఖ్యాతగా కనిపించనుంది. ప్రపంచకప్‌లో గ్రేస్ హేడెన్ కాకుండా మొత్తం ఎనిమిది మంది వ్యాఖ్యాతలు ఉంటారు. ఇది కాకుండా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా వీడియో కాల్ ద్వారా కామెంటరీ టీంలో భాగం కానున్నారు.
అక్టోబర్ 4వ తేదీన ప్రపంచకప్ ప్రారంభోత్సవం జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 5వ తేదీన తొలి మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 8వ తేదీన భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. చెన్నైలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. దీని తర్వాత భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్‌తో ఆడనుంది. అక్టోబరు 11వ తేదీన ఆఫ్ఘనిస్తాన్, అక్టోబర్ 14వ తేదీన పాకిస్తాన్‌లతో భారత జట్టు ఆడనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial