అన్వేషించండి

IND vs ENG: ఇంగ్లండ్‌పై ప్రతీకారానికి టీమిండియా సిద్ధం, లక్నో వేదికగా మరో సమరం

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా మరో కీలక మ్యాచ్‌కు సిద్దమైంది. లక్నో వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో రోహిత్‌ సేన అమీతుమీ తేల్చుకోనుంది.

ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా మరో కీలక మ్యాచ్‌కు సిద్దమైంది. లక్నో వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో రోహిత్‌ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఏడాది కిందట జరిగిన టీ 20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఎదురైన ఓటమికి బలంగా ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. వరుస ఓటములతో సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లాండ్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేసిన టీమిండియాకు షాక్‌ తప్పదు. కానీ ఇప్పటికే సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన బ్రిటీష్‌ జట్టు... అన్నింటికి తెగించి ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌ చేరేందుకు మరింత చేరువకానున్న నేపథ్యంలో రోహిత్‌ సేన ఎలాంటి అలసత్వానికి చోటు ఇవ్వకుండా విజయం సాధించాలని చూస్తోంది. ఇప్పటివరకూ అప్రతిహాత జైత్రయాత్రతో ముందుకు సాగిపోతున్న టీమిండియా.. అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది.
 
ఈ ప్రపంచకప్‌లో విజయం సాధించి సెమీస్‌కు ఏ మాత్రం అవకాశం ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంగ్లండ్‌ జట్టు భావిస్తోంది. బ్రిటీష్‌ జట్టుపై గెలిచి వరల్డ్‌కప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మళ్లీ కైవలం చేసుకోవాలని  భారత్‌ చూస్తోంది. బజ్‌ బాల్‌ ఆటతో వన్డే ప్రపంచకప్‌, టీ 20 ప్రపంచకప్‌లను కైవసం చేసుకున్న ఇంగ్లండ్‌.. భారత్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రం స్థాయికితగ్గ ఆటను మాత్రం ప్రదర్శించలేక పోయింది. ఈ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైతే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంటిముఖం పట్టడం ఖాయమైనట్లే.
 
అశ్విన్‌ రాక ఖాయమే! 
లక్నో పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో హార్దిక్‌ స్థానంలో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అశ్విన్‌ తుది జట్టులోకి వచ్చి టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే ఇద్దరు పేసర్లకే జట్టులో స్థానం ఉంటుంది. బుమ్రా స్థానం పదిలం కాబట్టి బుమ్రాకు తోడుగా సిరాజ్‌, షమిల్లో ఎవరిని ఎంచుకోవాల్సి వస్తుంది. సిరాజ్‌ పర్వాలేదనిపిస్తున్నాడు. కానీ షమి గత మ్యాచ్‌లో అదరగొట్టాడు. మరోవైపు పేసర్లను ఇద్దరికే పరిమితం చేయడంపైనా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హార్దిక్‌ ఉంటే మిడిలార్డర్‌ బ్యాటింగ్‌లో ఉపయోగపడడమే కాక.. మూడో పేసర్‌ పాత్ర పోషించేవాడు. ఒకవేళ అశ్విన్‌ను ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకుంటే సూర్యపై వేటు వేసి ముగ్గురు పేసర్లతోనే టీమిండియా బరిలోకి దిగవచ్చు. ప్రపంచకప్‌లో వరుస పరాజయాలతో బలహీనంగా కనిపిస్తున్నంత మాత్రాన ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తమదైన రోజున బ్రిటీష్‌ జట్టు ఎంత విధ్వంసం సృష్టించగలదో అందరికీ తెలుసు.
 
అన్ని విభాగాల్లో పటిష్టంగా టీమిండియా...
బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని చూస్తుండగా... శుభ్‌మన్ గిల్, విరాట్‌ కోహ్లీ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్‌ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఇంగ్లండ్‌పై గెలుపు పెద్ద కష్టం కాదు. శుభ్‌మన్‌ గిల్ పెద్ద స్కోర్‌ను చేయాలని పట్టుదలగా ఉన్నాడు.  శ్రేయస్ అయ్యర్, కె.ఎల్‌. రాహుల్‌ మంచి ఫామ్‌లో ఉండడంతో టీమిండియాకు బ్యాటింగ్‌లో తిరుగులేని విధంగా ఉంది. బౌలింగ్‌లోనూ టీమిండియా అద్భుతాలు చేస్తోంది.
 
నిలిస్తే భారీ స్కోరు ఖాయమే
 వరుసగా విఫలమవుతున్న ఇంగ్లండ్‌ బ్యాటింగ్ బలంగానే ఉంది. జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్ తమదైన రోజున ఎంత విధ్వంసం సృష్టిస్తారో క్రికెట్‌ ప్రేమికులకు తెలుసు. రూట్ కూడా రాణించాలని చూస్తున్నాడు. రీస్ తోప్లే బౌలింగ్ ఫామ్‌ ఆందుకోవాలని బ్రిటీష్‌ జట్టు కోరుకుంటోంది. మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ ల స్పిన్... భారత బ్యాటర్లకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. 
 
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
 
ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్‌), మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, శామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్సే, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ .
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Bathukamma 2024: ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Navratri 2024: శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!
శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!
Embed widget