ICC WTC 2023 Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూపీఎల్) ఫైనల్ తేదీ వచ్చేసింది- ఎప్పుడంటే!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌కు సంబంధించిన తేదీలను అంతర్జాతీయ క్రికెట్ (ఐసీసీ) కౌన్సిల్ ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ లండన్ లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు జరుగుతుంది.
ICC WTC 2023 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూపీఎల్) 2021-23 ఫైనల్‌కు సంబంధించిన తేదీలను అంతర్జాతీయ క్రికెట్ (ఐసీసీ) కౌన్సిల్ ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ లండన్ లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు జరుగుతుంది. జూన్ 12ను రిజర్వ్ డేగా కేటాయించారు. ఈ మేరకు ఐసీసీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ స్టేటస్
ఈ సీజన్ డబ్ల్యూపీఎల్ లో ఇంకా 3 సిరీసులు మాత్రమే మిగిలున్నాయి. ఇంకా ఫైనల్ ఆడే జట్లు ఖరారు కాలేదు. భారత్- ఆస్ట్రేలియా, శ్రీలంక- న్యూజిలాండ్, వెస్టిండీస్- దక్షిణాఫ్రికా సిరీస్ లు ఉన్నాయి. రేపట్నుంచి భారత్- ఆసీస్ టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఫలితాన్ని బట్టి ఫైనల్ ఆడే రెండు జట్లేవో దాదాపు తేలిపోనుంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూపీఎల్) పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 75.56 శాతంతో అగ్రస్థానంలో ఉంది. భారత్ (58.93) రెండో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక (53.33)మూడో స్థానంలో ఉంది.
భారత్ ఫైనల్ కు చేరుకుంటుందా
భారత జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 4-0 లేదా 3-1తో ఓడిస్తే మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుంటుంది. అలాగ్ సిరీస్ ను కోల్పోయినా కూడా భారత్ కు అవకాశం ఉంది. అయితే అది ఈ సీజన్ లో మిగిలిన రెండు టెస్టు సిరీస్ లపై ఆధారపడి ఉంటుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఈ సీజన్ లో భారత్- ఆస్ట్రేలియా సిరీస్ కాకుండా ఇంకో రెండు సిరీస్ లు ఉన్నాయి. న్యూజిలాండ్- శ్రీలంక, దక్షిణాఫ్రికా- వెస్టిండీస్. ఈ జట్ల మధ్య 2 మ్యాచ్ లు టెస్ట్ సిరీస్ జరగాల్సి ఉంది. భారత్, ఆస్ట్రేలియాతో 1-3, 2-1 తేడాతో బోర్డర్- గావస్కర్ సిరీస్ కోల్పోయినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది. అయితే అందుకు శ్రీలంకతో జరిగే సిరీస్ ను న్యూజిలాండ్ 2-0తో గెలుచుకోవాలి. అలాగే వెస్టిండీస్ తో జరిగే సిరీస్ లో దక్షిణాఫ్రికా ఓడిపోవాలి. కాబట్టి మిగతా టెస్ట్ సిరీస్ ల ఫలితాలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే భారత్- ఆస్ట్రేలియాకు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడం చాలా ముఖ్యం.
ఆస్ట్రేలియాకు సులభమే
ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడం సులభమే. భారత్ తో జరిగే సిరీస్ ను గెలుచుకోకపోయినా ఆసీస్ ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంది. 0-4 తో ఓడిపోయినప్పటికీ మిగతా రెండు సిరీస్ లు ఫలితాల ప్రకారం ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకుంటుంది. అయితే భారత్ కు ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ చేయడం అంత తేలిక కాదు. అలాగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఒకటి, రెండు మ్యాచ్ లు గెలిచినా మిగతా ఫలితాలతో సంబంధం లేకుండా ఆస్ట్రేలియా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. కాబట్టి ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం ఖాయమే.
2021లో జరిగిన మొదటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని న్యూజిలాండ్ గెలుచుకుంది. ఫైనల్ లో భారత్ ను ఓడించి విలియమ్సన్ సేన ట్రోఫీని ముద్దాడింది.
Mark your calendars 🗓
— ICC (@ICC) February 8, 2023
The dates for the ICC World Test Championship Final later this year have been revealed 🤩#WTC23https://t.co/gOJcoWVc58