Women World Cup: మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌పై ఐసీసీ కీలక నిర్ణయం- 2029 నాటికి ఫార్మాట్‌లో బారీ మార్పులు
Women World Cup: మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 2029లో జరిగే టోర్నమెంట్ లో మార్పులు ఉంటాయి.

ICC మహిళా క్రికెట్ ప్రపంచ కప్ 2025లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ అండ్ టీమ్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలి టైటిల్ సాధించింది. ఫైనల్ ముగిసిన వారం రోజుల్లోనే, ICC తదుపరి ఎడిషన్‌లో పెద్ద మార్పును ప్రకటించింది.
శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో, ICC మహిళల ప్రపంచ కప్‌లో జట్ల సంఖ్యను పెంచడానికి అధికారికంగా ఆమోదించింది. భారత్, శ్రీలంకలలో జరిగిన ప్రపంచ కప్ విజయాన్ని కూడా ICC దీనికి ఆపాదించింది.
ఇకపై మహిళల ప్రపంచ కప్‌లో 10 జట్లు ఆడతాయి
ICC ఒక పత్రికా ప్రకటనలో,"ఈ ఈవెంట్ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ICC బోర్డు ఆసక్తిగా ఉంది. టోర్నమెంట్ తదుపరి ఎడిషన్‌ను 10 జట్లకు విస్తరించడానికి అంగీకరించింది." 2025లో జరిగి వరల్డ్ కప్‌లో 8 జట్లు మాత్రమే ఆడాయి.
ప్రకటనలో మరింతగా, "దాదాపు 3 లక్షల మంది ఈ ఈవెంట్‌ను స్టేడియం నుంచి చూశారు, ఇది ఏ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లోనైనా అత్యధికం. ప్రేక్షకులలో పెరుగుదలతో పాటు, ఆన్-స్క్రీన్ వీక్షకులు కూడా కొత్త రికార్డులు నెలకొల్పారు."
వీక్షణ విషయంలో రికార్డు సృష్టించారు
మహిళల ODI ప్రపంచ కప్ 2025 వీక్షకుల సంఖ్య, ప్రసారంలో కొత్త రికార్డులు నెలకొల్పింది. టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇచ్చాయి, పాకిస్తాన్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. పాకిస్తాన్ లీగ్ దశ నుంచే నిష్క్రమించింది, కాబట్టి రెండు సెమీ-ఫైనల్స్, ఫైనల్ కూడా భారతదేశంలో జరిగాయి.
భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌ను జియోహాట్‌స్టార్‌లో 18.5 కోట్ల మంది వీక్షించారు, ఇది పురుషుల T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌తో సమానం. మొత్తం టోర్నమెంట్‌ను 44.6 కోట్ల మంది వీక్షించారు, టైటిల్ మ్యాచ్‌ను 2.1 కోట్ల మంది ఒకేసారి చూశారు.
మహిళల ODI ప్రపంచ కప్ తదుపరి ఎడిషన్ 2029లో జరుగుతుంది, అయితే దీని హోస్ట్ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఎక్కువ జట్లతో, ఈ టోర్నమెంట్ ఫార్మాట్‌లో కొంచెం మార్పు ఉండవచ్చు. 2025లో ప్రపంచ కప్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఆడారు, ఇందులో ప్రతి జట్టు ఇతర 7 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడింది. పాయింట్ల పట్టికలో టాప్-4 జట్ల మధ్య సెమీ-ఫైనల్ జరిగింది.
భారత మహిళల జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకున్న నాల్గో జట్టు, సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి, జట్టు ఫైనల్‌లో స్థానం సంపాదించింది. టైటిల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి తన మొదటి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది.




















