అన్వేషించండి
Eng Vs SL :ప్రపంచకప్‌లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన, ఇంగ్లండ్‌పై విమర్శల జడివాన
ODI World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో శ్రీలంక చేతిలో ఘోర పరాజయం పాలైన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై సర్వత్రా విమర్శల జల్లు కురుస్తోంది.

ఇంగ్లండ్‌పై విమర్శల జడివాన ( Image Source : Twitter )
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో శ్రీలంక చేతిలో ఘోర పరాజయం పాలైన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై సర్వత్రా విమర్శల జల్లు కురుస్తోంది. మాజీ క్రికెటర్లు బ్రిటీష్ జట్టు ఆటతీరుపై మాటల దాడి చేస్తున్నారు. అఫ్గానిస్థాన్, శ్రీలంక చేతుల్లో ఘోరంగా ఓడిపోయిన ఇంగ్లండ్... సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక అద్భుతం జరిగితే తప్ప బ్రిటీష్ జట్టు నాకౌట్‌కు చేరలేదు. 2019 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్... ఇక్కడ ఏ మాత్రం ప్రభావం చూపలేక చతికిలపడింది. దీనిపై మాజీ క్రికెటర్లు భగ్గుమంటున్నారు.
అత్మ విశ్వాసం లేకనే...
వన్డేల్లో ఇంగ్లండ్ చాలా సామాన్యమైన జట్టని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించాడు. స్వదేశంలో 2019 ప్రపంచకప్ మినహా గత 8 ప్రపంచకప్‌లలో ఏడుసార్లు ఇంగ్లండ్ జట్టు సెమీస్‌కే చేరలేదని గుర్తు చేశాడు. వరల్డ్‌కప్ చరిత్రలో తమ జట్టుకు ఇదే చెత్త ప్రదర్శన అంటూ ఇంగ్లండ్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ విమర్శలు గుప్పించాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా కనీసం సెమీస్ చేరే అవకాశాలను కూడా సంక్లిష్టం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ చూడటానికే కష్టంగా ఉందని తమ బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని మరో ఇంగ్లండ్ క్రికెటర్ కాలింగ్ వుడ్ అన్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బ్రిటీష్ జట్టు.. దూకుడుగా ఆడి శ్రీలంకను ఒత్తిడిలోకి నెట్టాలని చూసిందని కానీ అది సాధ్యం కాలేదని కాలింగ్ వుడ్ తెలిపాడు. శ్రీలంక అద్భుతంగా ఆడి.. తమ జట్టును ఉక్కిరి బిక్కిరి చేసిందని అన్నాడు. ఇంగ్లాండ్ జట్టులో లోపించింది ఆత్మవిశ్వాసం మాత్రమే కాదని.. దిశానిర్దేశం కూడా లేకుండా పోయిందని టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి విమర్శించాడు. ఇంగ్లండ్ జట్టులో టాప్ ఆర్డర్ మొత్తం ఫామ్ కోల్పోవడాన్ని తానెప్పుడూ చూడలేదని రవిశాస్త్రి అన్నాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం లేకపోవడంతో లయ తప్పారని.. పోరాట పటిమ తగ్గిందని రవిశాస్త్రి విశ్లేషించాడు.
శ్రీలంక రికార్డు విజయం
మరోవైపు వన్డే ప్రపంచకప్ చరిత్రలో వరుసగా ఐదో మ్యాచులో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి శ్రీలంక తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇఫ్పటివరకు ఇంగ్లాండ్-శ్రీలంక జట్లు 12 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో తొలి ఆరు మ్యాచుల్లో ఇంగ్లాండ్‌దే పైచేయికాగా కానీ గత ఆరు మ్యాచుల్లో పరిస్థితి తలకిందులైంది. 2007కు మందు జరిగిన ఏడు మ్యాచుల్లో ఇంగ్లాండ్ ఆరింట్లో గెలిచింది. శ్రీలంక ఒకేసారి విజయం సాధించింది. 2007 వన్డే వరల్డ్ కప్ నుంచి పరిస్థితి మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు శ్రీలంక వన్డే వరల్డ్ కప్‌లో ఆడిన ప్రతీ మ్యాచులోనూ ఇంగ్లాండ్‌ను ఓడించింది. 2007, 2011, 2015, 2019, 2023 మెగా టోర్నీల్లో శ్రీలంక ఇంగ్లాండ్‌ను ఓడించింది. 2007 వన్డే ప్రపంచకప్ తర్వాత ఇంగ్లాండ్‌ను వరుసగా ఐదు సార్లు ఓడించింది శ్రీలంక. ఈ మ్యాచు ఓటమితో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. ఐదు మ్యాచుల్లో ఒకటే విజయం సాధించి దాదాపు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్.. ఒక్క బంగ్లాదేశ్‌పై మాత్రమే నెగ్గింది. కివీస్, అఫ్ఘానిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక చేతుల్లో ఓడింది. బ్రిటీష్ జట్టు తర్వాత మ్యాచులో భారత్‌తో తలపడనుంది. అక్టోబర్ 29న మ్యాచు జరగనుంది. ఇంగ్లండ్ జట్టును ఓడించిన శ్రీలంక పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion