అన్వేషించండి

Hyderabad cricketers: అండర్‌ 19 ప్రపంచకప్‌, భారత జట్టులో హైదరాబాదీలు

Hyderabad cricketers: వచ్చే ఏడాది జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరిగే అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ భారత జట్టులో హైదరాబాద్‌ కుర్రాళ్లు ఆరవెల్లి అవినాశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌లకు చోటు దక్కింది.

వచ్చే ఏడాది జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరిగే అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టులో హైదరాబాద్‌ కుర్రాళ్లు ఆరవెల్లి అవినాశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌కు చోటు దక్కింది. జనవరి 19న దక్షిణాఫ్రికాలో ఆరంభమయ్యే ఈ టోర్నీతో పాటు.. అంతకంటే ముందు అక్కడే జరిగే ముక్కోణపు సిరీస్‌కు బీసీసీఐ సెలక్టర్లు జట్టును ప్రకటించారు. ఈ జట్టులో  ఆరవెల్లి అవినాశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌లకు స్థానం దక్కింది. 18 ఏళ్ల అవనీశ్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌కాగా ఈ ఏడాది నవంబర్‌లో అండర్‌-19 నాలుగు జట్ల టోర్నీలో భారత్‌-ఏ తరఫున ఆడిన అతడు భారత్‌-బిపై 163 పరుగులతో అదరగొట్టాడు. 19 ఏళ్ల మురుగన్‌ అభిషేక్‌ ఆఫ్‌ స్పిన్నర్‌. లెఫ్ట్‌ ఆర్మ్‌ బ్యాటర్‌. ఇటీవల అండర్‌-19 నాలుగు జట్ల టోర్నీలో ఇండియా-ఏకు ఆడుతూ ఇండియా-బిపై 81 పరుగులు చేయడమే కాక, 2 వికెట్లు పడగొట్టాడు. 7 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు కూడా తీశాడు. వీరిద్దరూ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న అండర్‌-19 ఆసియాక్‌ప్‌లో ఆడుతున్న భారత జట్టులో సభ్యులు. ఉదయ్‌ శరణ్‌ కెప్టెన్‌గా, సౌమీకుమార్‌ పాండే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. 

భారత జట్టు: ఉదయ్‌ సహారన్‌ (కెప్టెన్‌), సౌమీ కుమార్‌ పాండే, అర్షిన్‌ కులకర్ణి, ఆదర్శ్‌ సింగ్‌, రుద్ర మయూర్‌ పటేల్‌, సచిన్‌ దాస్‌, ప్రియాంశు మోలియా, ముషీర్‌ఖాన్‌, మురుగన్‌ అభిషేక్‌, అవనీశ్‌ రావు, ఇనీశ్‌ మహాజన్‌, ధనుశ్‌ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్‌ లింబాని, నమన్‌ తివారి; స్టాండ్‌బై: ప్రేమ్‌ దేవ్‌కర్‌, అన్ష్‌ గొసాయ్‌, మహ్మద్‌ అమన్‌

2024లో నిర్వహించనున్న ఐసీసీ మెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ (Under19 Mens World Cup 2024) హోస్టింగ్ బాధ్యతల నుంచి లంకను తప్పించింది. ఆ అవకాశాన్ని దక్షిణాఫ్రికాకు కల్పిస్తూ ఐసీసీ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. దాంతో వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అండర్ 19 వరల్డ్ కప్ ను దక్షిణాఫ్రికా నిర్వహించనుందని బోర్డు స్పష్టం చేసింది. లంక క్రికెట్ కి నిధులు ఐసీసీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ కారణంగా వచ్చే జనవరిలో జరగాల్సిన మెన్స్ అండర్ 19 ప్రపంచ కప్ నిర్వహణ నుంచి లంకను తప్పించి దక్షిణాఫ్రికాకు బాధ్యతల్ని అప్పగించింది. ఈ ఏడాది మహిళల U19 T20 ప్రపంచ కప్ నిర్వహించిన దక్షిణాఫ్రికా పురుషుల అండర్ 19 అవకాశాన్ని దక్కించుకుంది.

వచ్చే జనవరిలో జరగనున్న U19 ప్రపంచ కప్ 15వ ఎడిషన్. చివరగా 2022లో వెస్టిండీస్‌లో జరిగిన మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. రికార్డు స్థాయిలో ఐదవసారి టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. 2024 జనవరిలో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో 41 మ్యాచ్‌లు జరగనుండగా, ఫిబ్రవరిలో ఫైనల్ జరగనుంది. ఈసారి గ్రూప్ స్టేజీ తరువాత సూపర్ సిక్స్ విధానాన్ని తీసుకొస్తుంది ఐసీసీ. సూపర్ సిక్స్ మ్యాచ్ ఫలితాలతో సెమీ ఫైనల్ టీమ్స్ ను నిర్ణయిస్తారు. అండర్ 19 వరల్డ్ కప్ లో పాల్గొనే 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో డిఫెండింగ్ ఛాంపియన్‌ భారత్‌తో పాటు బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికాలు ఉన్నాయి. గ్రూప్ Bలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్ Cలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా ఉన్నాయి. ఇక గ్రూప్ Dలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్ టీమ్స్ సూపర్ సిక్స్ కోసం పోటీ పడనున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP DesamMysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Embed widget