News
News
X

Umpiring in Cricket: క్రికెట్ అంపైర్  ఎలా అవ్వాలి? ఇదిగో తెలుసుకోండి

Umpiring in Cricket: క్రికెట్ లో అంపైర్ కు ఉండే ప్రాధాన్యాత అంతా ఇంతా కాదు. అంపైర్ అవ్వాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి? వారికి వేతనాలు ఎలా ఉంటాయి? ఇలాంటి విషయాలు మీకోసం మేం అందిస్తున్నాం. 

FOLLOW US: 

Umpiring in Cricket: ప్రస్తుతం ప్రపంచకప్ సీజన్ నడుస్తుండటంతో ఎక్కడ చూసినా క్రికెట్ పైన చర్చ జరుగుతోంది. ఆట మీద అంత ఆసక్తి లేనివారు సైతం ఎవరు కప్ గెలుస్తారు? ఎవరు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్ అందుకుంటారు? అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో క్రికెట్ గురించి, అందులోని విషయాల గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు మనం అంపైర్ గురించి తెలుసుకుందాం.

క్రికెట్ లో అంపైర్ కు ఉండే ప్రాధాన్యాత అంతా ఇంతా కాదు. అంపైరింగ్ సరిగ్గా జరగక ఓడిపోవాల్సిన మ్యాచులు గెలిచినవి, గెలిచే మ్యాచులు ఓడిపోయిన జట్లు చాలా ఉన్నాయి చరిత్రలో. అంత కీలకమైనది అంపైర్ పోస్ట్. అసలు అంపైర్ అవ్వాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి? వారికి వేతనాలు ఎలా ఉంటాయి? అంతర్జాతీయ మ్యాచుల్లో అంపైర్ గా చేయాలంటే జరిగే ప్రక్రియ ఏంటి? ఇలాంటి విషయాలు మీకోసం మేం అందిస్తున్నాం. 

అంపైర్ అవ్వడానికి అర్హతలు ఏంటి?

అంపైర్ అవ్వడానికి క్రికెట్ నేపథ్యం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అయితే క్రికెట్ ఆడి ఉన్నవారికైతే ఎంపికలో ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అంపైర్ ఎంపికకు ఒక నిర్ధిష్ట ప్రక్రియ ఉంది. వివిధ పరీక్షల అనంతరం అంపైర్ నియామకం ఉంటుంది. కంటి చూపు, ఫిట్ నెస్, క్రికెట్ నియమాలు తెలిసి ఉండడం అనేవి ప్రాథమిక అర్హతలు.

News Reels

అంపైర్ నియామక ప్రక్రియ

ముందుగా మీరు స్థానిక మ్యాచులలో అంపైర్ గా చేసి ఉండాలి. 

తర్వాత మీ పేరును రాష్ట్ర సంఘంలో నమోదు చేసుకోవాలి.

అక్కడ రాష్ట్ర స్థాయి మ్యాచుల్లో అంపైర్ గా వ్యవహరించాలి. 

మీ ప్రతిభ, అనుభవం ఆధారంగా రాష్ట్ర సంఘం మీ పేరును బీసీసీఐ నిర్వహించే పరీక్షకు పంపుతుంది. ఇది లెవల్ 1 పరీక్ష.

ప్రతి సంవత్సం బీసీసీఐ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. రాష్ట్ర సంఘాలు పంపిన అంపైర్లకు ముందుగా మూడు రోజులు శిక్షణ ఇస్తుంది. నాలుగోరోజు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఇండక్షన్ కోర్సు ఇంకా అంపైరింగ్ గురించి శిక్షణ ఇస్తారు. దీని తర్వాత ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలు ఉంటాయి. అందులో ఉత్తీర్ణత సాధించిన వారు లెవల్ 2 కి అర్హత సాధిస్తారు.

లెవల్ 3 లో వైద్య పరీక్ష ఉంటుంది. అందులో కూడా ఉత్తీర్ణులు అయిన వారిని బీసీసీఐ అంపైర్లుగా ఎంపిక చేస్తుంది. బీసీసీఐలో గ్రేడ్ A నుంచి D వరకు గ్రేడ్ అంపైర్లు ఉంటారు.  బీసీసీఐకి గ్రేడ్ Aలో దాదాపు 20 మంది అంపైర్లు ఉన్నారు.

అంపైర్ల జీతభత్యాలు

అంపైర్ల జీతం వారి స్థాయి,  సీనియారిటీ ఆధారంగా నిర్ణయిస్తారు. అలాగే వారి ప్యానెల్ ఆధారంగా ఫీజులు నిర్ణయిస్తారు. కొన్ని నెలల క్రితం బీసీసీఐ వివిధ గ్రేడ్‌ల అంపైర్ల గురించి సమాచారం ఇచ్చింది, ఇందులో గ్రూప్ Aలో 20 మంది, గ్రూప్ Bలో 60 మంది, గ్రూప్ Cలో 46 మంది,  గ్రూప్ D లో 11 మంది అంపైర్లు ఉన్నారు. ఇందులో A గ్రూప్ అంపైర్‌కు రోజుకు దాదాపు 40 వేల రూపాయలు ఫీజుగా చెల్లిస్తారు.  గ్రేడ్ B అంపైర్లకు రూ. 30,000 లు ఇస్తారని సమాచారం. 

Published at : 14 Nov 2022 05:47 AM (IST) Tags: Umpire Selection Article on Umpire Selection BCCI Umpires Umpires fees How to become Umpire

సంబంధిత కథనాలు

IND vs NZ 3rd ODI: నవంబర్ 30న భారత్- న్యూజిలాండ్ మూడో వన్డే- ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే!

IND vs NZ 3rd ODI: నవంబర్ 30న భారత్- న్యూజిలాండ్ మూడో వన్డే- ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే!

Rohit Sharma - Rahul Dravid: రోహిత్, ద్రవిడ్ లకు బీసీసీఐ నుంచి పిలుపు- అందుకోసమేనా!

Rohit Sharma - Rahul Dravid: రోహిత్, ద్రవిడ్ లకు బీసీసీఐ నుంచి పిలుపు- అందుకోసమేనా!

David Warner: తట్టుకోలేవ్ తమ్ముడూ - ఐపీఎల్‌పై కామెరాన్ గ్రీన్‌కి డేవిడ్ వార్నర్ సలహా!

David Warner: తట్టుకోలేవ్ తమ్ముడూ - ఐపీఎల్‌పై కామెరాన్ గ్రీన్‌కి డేవిడ్ వార్నర్ సలహా!

Ruturaj Gaikwad Record: ఒకే ఓవర్లో 7 సిక్సులు- రికార్డు సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్

Ruturaj Gaikwad Record: ఒకే ఓవర్లో 7 సిక్సులు- రికార్డు సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్

డోపింగ్‌ టెస్ట్‌ అంటే ఏమిటి.? ఈ టెస్ట్‌ చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేయాలా?

డోపింగ్‌ టెస్ట్‌ అంటే ఏమిటి.? ఈ టెస్ట్‌ చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేయాలా?

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు -  విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!