అన్వేషించండి
Advertisement
WPL 2024: బెంగళూరుకు ప్రైజ్‌మనీ ఎంతంటే?
WPL 2024 prize money: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది.
WPL 2024 Winner Prize Money: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) చరిత్ర సృష్టించింది. పురుషుల జట్టు సాధింలేని ఘన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో బెంగళూర ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీని... బెంగళూరు బౌలర్లు కట్టడి చేశారు. కేవలం 113 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్‌ను కట్టడి చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి బెంగళూరు ఛేదించింది. ఈ గెలుపుతో కప్పు కోసం 17 ఏళ్ల ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంత ప్రైజ్ మనీ దక్కిందనేది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
ప్రైజ్ మనీ ఎంతంటే..?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మూడు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. మొత్తం తొమ్మిది మ్యాచుల్లో 347 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న బెంగళూరు ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీకి అయిదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బెంగళూరుకు చెందిన శ్రేయాంక పాటిల్ నిలచింది. ఈ టోర్నమెంట్‌లో 13 వికెట్లు తీసిన శ్రేయాంక పాటిల్... పర్పుల్ క్యాప్ దక్కించుకుంది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎమర్జింగ్ ప్లేయర్‌గా బెంగళూరు ప్లేయర్ శ్రేయాంక పాటిల్... మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా దీప్తి శర్మ నిలిచారు. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ అవార్డును ముంబై ప్లేయర్ సజన సజీవన్ దక్కించుకోగా... ఫెయిర్ ప్లే టీమ్ అవార్డును రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది.
వీడియోకాల్‌లో అభినందనలు
మహిళల జట్టు టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ ప్లేయర్లతో కింగ్ కోహ్లీ వీడియో కాల్ చేసి మాట్లాడాడు. కెప్టెన్ స్మృతి మంధానతో కాసేపు మాట్లాడిన ఈ స్టార్ బ్యాటర్... అనంతరం ఇతర ప్లేయర్లతో కూడా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తమ ఫ్రాంచైజీకి డబ్ల్యూపీఎల్ టైటిల్ దక్కడంతో ఐపీఎల్ ఆర్‌సీబీ స్టార్స్ విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాజీ సభ్యులు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, మాజీ యాజమాని విజయ్ మాల్యా తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సాలా కప్ మనదే అని ప్రతి ఏటా ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఈసాలా కప్ దక్కడంతో ఎక్కడా ఆగడం లేదు. కోట్లాది మంది అభిమానుల కల నెరవేరడంతో సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. కంగ్రాచ్యులేషన్ ఆర్సీబీ.. ఈసాలా కప్ మనదే.. ఈసాలా కప్ నమదే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో ఆర్సీబీ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఎట్టకేలకు సాధించామని ఒకరు భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. తమ అభిమాన జట్టు కప్పు గెలవడం పట్ల ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ అనే పదం ట్రెండింగ్‌గా మారింది. బెంగళూరులోని వీధుల్లో యువత విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion