Ben Stokes: ఒకే ఓవర్లో 24 పరుగులు - యాషెస్‌లో బెన్ స్టోక్స్ సెన్సేషనల్ రికార్డు!
యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఒకే ఓవర్లో 24 పరుగులు చేసి బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించాడు.
Most Runs Off An Over By England In Tests: లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కామెరాన్ గ్రీన్ వేసిన ఒక ఓవర్‌లో 24 పరుగులు సాధించాడు. ఈ ఓవర్‌లో బెన్ స్టోక్స్ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. నిజానికి ఇప్పుడు బెన్ స్టోక్స్ టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ తరఫున ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్ట్‌లో హ్యారీ బ్రూక్ మొదటి స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జాహిద్ మహమూద్ వేసిన ఓవర్‌లో హ్యారీ బ్రూక్ 27 పరుగులు చేశాడు. రావల్పిండి వేదికగా ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది.
బెన్ స్టోక్స్‌తో పాటు ఈ లిస్టులో ఇంకెవరు ఉన్నారు?
ఇయాన్ బోథమ్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. డెరెక్ స్టెర్లింగ్ వేసిన ఒక ఓవర్లో ఇయాన్ బోథమ్ 24 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తలపడింది. 1986లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది.
అనంతరం 2022-23లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌద్ షకీల్ ఓవర్‌లో హ్యారీ బ్రూక్ 24 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టు క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఇది మూడో అత్యధిక పరుగులు. ఇప్పుడు ఈ ప్రత్యేక జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చేరాడు. లార్డ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్ ఓవర్‌లో బెన్ స్టోక్స్ 24 పరుగులు సాధించాడు.
బెన్ స్టోక్స్ మెరుపు ఇన్నింగ్స్
ఆస్ట్రేలియాతో జరిగిన లార్డ్స్ టెస్టులో బెన్ స్టోక్స్ 214 బంతుల్లో 155 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన వేగవంతమైన ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు బాదాడు. బెన్ స్టోక్స్ 155 పరుగులు చేసిన తర్వాత ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌కు బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. అంతకుముందు బెన్ స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్ మధ్య ఏడో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. మరోవైపు ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఇంగ్లండ్ 43 పరుగులతో పరాజయం పాలైంది. దీంతో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో ఉంది.
A champion innings.
— England Cricket (@englandcricket) July 2, 2023
Played in a way and a spirit to be proud of, as always 👏@BenStokes38 | #Ashes pic.twitter.com/15xAkqx57W
A gutting end to another sensational Test match...
— England Cricket (@englandcricket) July 2, 2023
Australia lead 2️⃣-0️⃣ in the series.#EnglandCricket | #Ashes pic.twitter.com/doJmO5VWmG
18 boundaries 💥
— England Cricket (@englandcricket) July 2, 2023
His highest score v 🇦🇺
Keep at it, Stokesy! 💪@IGCom | #Ashes pic.twitter.com/UzLaEYvmxz
🚨1️⃣5️⃣0️⃣
— England Cricket (@englandcricket) July 2, 2023
Ben Stokes. Legend. #EnglandCricket | #Ashes pic.twitter.com/Jv1FsXYwoa
Just tuning in? 📺
— England Cricket (@englandcricket) July 2, 2023
Where on earth have you been? 🤯
Get caught up on all of the action right here! 👇#EnglandCricket | #Ashes