అన్వేషించండి

GG Vs UPW Result Update: బేత్ మూనీ వీర బాదుడు.. త్రుటిలో సెంచ‌రీ మిస్.. యూపీపై గుజ‌రాత్ భారీ విజ‌యం.. 81 ర‌న్స్ తో యూపీ చిత్తు

Wpl Update: తాజా విజ‌యంతో భారీ ర‌న్ రేట్ సాధించి, ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. అలాగే టేబుల్ రెండో స్థానానికి ఎగ‌బాకింది. బేత్ మూనీకి ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. 

Beth Mooney Stunning 50: డ‌బ్ల్యూపీఎల్ 2025 సీజ‌న్ లో గుజ‌రాత్ జెయింట్స్ వ‌రుస‌గా రెండో విజయాన్ని సాధించింది. సోమ‌వారం జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో యూపీ వారియ‌ర్జ్ పై భారీ విజ‌యాన్ని సాధించింది. ల‌క్నోలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ భారీ స్కోరు సాధించింది. ఓపెన‌ర్ బేత్ మూనీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (59 బంతుల్లో 96 నాటౌట్, 17 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకుంది. బౌల‌ర్లో సోఫీ ఎకిల్ స్టోన్ రెండు వికెట్ల‌తో స‌త్తా చాటింది. అనంత‌రం ఛేద‌న‌లో ఏ దశ‌లోనూ విజ‌యం వైపు యూపీ ప‌య‌నించ‌లేదు. కేవ‌లం 17.1 ఓవ‌ర్ల‌లో 105 ప‌రుగులకు ఆలౌటైంది. చెనెల్ హెన్రీ (28) టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. క‌శ్వీ గౌత‌మ్, త‌నూజా క‌న్వ‌ర్ మూడేసి వికెట్లు తీసి స‌త్తా చాటారు. తాజా విజ‌యంతో భారీ ర‌న్ రేట్ సాధించి, ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను గుజరాత్ స‌జీవంగా ఉంచుకుంది. అలాగే టేబుల్ రెండో స్థానానికి ఎగ‌బాకింది. బేత్ మూనీకి ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ సెమీస్ మ్యాచ్ లు ఉండ‌టంతో మంగ‌ళ‌, బుధవారాల్లో టోర్నీకి సెల‌వు. గురువారం జ‌రిగే లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ తో  గుజ‌రాత్ అమీతుమీ తేల్చుకోనుంది. 

ధ‌నాధన్ ఇన్నింగ్స్..
ఈ టోర్నీలో స్థాయికి తగ్గ‌ట్లు అంత‌గా ఆడ‌క‌పోయినా, ఈ మ్యాచ్ లో మాత్రం మూనీ జూలు విదిల్చింది. కిల్లింగ్ ఇంటెంట్ తో వ‌చ్చిన ఆమె.. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను చీల్చి చెండాడింది. ఆరంభంలోనే మ‌రో ఓపెన‌ర్ డ‌యాలాన్ హేమ‌ల‌త (2) వికెట్ కోల్పోయినా, ఏమాత్రం వెనుకంజ వేయ‌లేదు. హ‌ర్లీన్ డియోల్ (32 బంతుల్లో 45, 6 ఫోర్లు)తో రెండో వికెట్ కు 101 ప‌రుగుల సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పింది. త‌ను ఔట‌న  త‌ర్వాత మిగ‌తా బ్యాట‌ర్లు ఎక్కువ స్ట్రైక్ మూనీకే ఇచ్చారు. సూప‌ర్ ట‌చ్ లో క‌నిపించిన మూనీ, బౌండ‌రీల‌తో విరుచుకు ప‌డింది. కేవ‌లం 37 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన మూనీ.. ఆఖ‌ర్లో వేగంగా ఆడి మ‌రో 22 బంతుల్లో 46 ప‌రుగులు జోడించింది. దియోంద్ర డాటిన్ (17) మిడిలార్డ‌ర్లో చ‌క్క‌ని స‌హాకారం అందించింది. మిగ‌తా బౌల‌ర్ల‌లో హెన్రీ, కెప్టెన్ దీప్తి శ‌ర్మ‌, క్రాంతి గౌడ్ కు త‌లో వికెట్ ద‌క్కింది. 

ప్లాప్ షో.. 
భారీ టార్గెట్ ను ఛేదించే క్ర‌మంలో యూపీకి శుభారంభం ద‌క్కలేదు. మేటి బ్యాట‌ర్లంతా సింగిల్ డిజిట్ కే ప‌రిమితం కావ‌డంతో 48-6తో పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. మ‌ధ్య‌లో గ్రేస్ హారిస్ (25) కాస్తా పోరాడినా అది ఫ‌లితం లేకుండా పోయింది. ఈ ద‌శ‌లో ఉమా ఛెత్రి (17) తో క‌లిసి హెన్రీ.. 35 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పింది.  చివ‌ర్లో  సోఫీ ఎకిల్ స్టోన్ (14) కాస్త పోరాడటంతో జ‌ట్టు స్కోరు వంద ప‌రుగుల మైలురాయిని దాటింది. మిగ‌తా బౌల‌ర్ల‌లో డాటిన్ కు రెండు, మేఘన సింగ్, యాష్లే గార్డెన‌ర్ ల‌కు త‌లో వికెట్ ద‌క్కింది. ప్ర‌త్య‌ర్థిని క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ తో ఉక్కిరి బిక్కిరి చేసి గుజ‌రాత్ బౌల‌ర్లు స‌త్తా చాటారు. 

Read Also: KKR New Captain: కేకేఆర్ కొత్త కెప్టెన్ ప్ర‌క‌ట‌న‌.. అనుభ‌వానికే పెద్ద పీట‌.. డిప్యూటీగా ఖ‌రీదైన ప్లేయ‌ర్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget