Glenn Maxwell Became Father:తండ్రైన మ్యాక్సీ - అబ్బాయికి జన్మనిచ్చిన వినీ రామన్ - ఫోటో వైరల్
ఆస్ట్రేలియా స్పిన్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తండ్రి అయ్యాడు. శుక్రవారం ఉదయం మ్యాక్స్‌వెల్ భార్య వినీ రామన్ మగ శిశువుకు జన్మనిచ్చింది.
Glenn Maxwell Became Father: ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడు, భారత సంతతి అమ్మాయిని పెళ్లి చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తండ్రి అయ్యాడు. వన్డే వరల్డ్ కప్‌కు ముందు అతడి సంతోషాన్ని డబుల్ చేస్తూ మ్యాక్సీ (మ్యాక్స్‌వెల్ నిక్ నేమ్) అబ్బాయికి జన్మనిచ్చింది. ఈ సందర్భంగా మ్యాక్సీ ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.
మ్యాక్స్‌వెల్.. భారత సంతతికి చెందిన వినీ రామన్ చాలాకాలంగా డేటింగ్ చేసి గతేడాది పెళ్లి చేసుకున్నారు. 2022 ఐపీఎల్‌కు ముందు ఈ జంట ఇరువురి మతాల సాంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు. 2022 మార్చి 2022న ఈ ఇద్దరి పెళ్లి జరిగింది. కాగా బాబు కంటే ముందే ఇదివరకే ఓ బిడ్డ మిస్ క్యారీ అయిందన్న విషయాన్ని వినీ ఆలస్యంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగానే వినీ తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని సోషల్ మీడియా ఖాతాలలో వెల్లడించింది.
View this post on Instagram
తాజాగా మ్యాక్సీ - వినీలు తమ అబ్బాయికి ‘లొగాన్ మావెరిక్ మ్యాక్స్‌వెల్’ అని నామకరణం చేశారు. కాగా ఈ పోస్టుకు బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో పాటు యుజ్వేంద్ర చాహల్ వైఫ్ ధనశ్రీ వర్ంమలతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Glenn Maxwell and his wife Vini Raman have blessed with a baby boy - Many congratulations to both of them.
— CricketMAN2 (@ImTanujSingh) September 15, 2023
The Name is "Logan Maverick Maxwell". pic.twitter.com/KFWTdV3oP5
గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత గాయాలతో సావాసం చేస్తున్న మ్యాక్స్‌వెల్ ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించాడు. కానీ జాతీయ జట్టు తరఫున మాత్రం అతడు రాణించింది అంతంతమాత్రమే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టులో ఎంపికైనా గాయం కారణంగా మ్యాక్సీ తిరిగి ఆసీస్‌కు పయనమయ్యాడు. అతడు వన్డే వరల్డ్ కప్ కు ముందు భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడేది అనుమానంగానే ఉంది. గాయం తిరగబెడితే వన్డే ప్రపంచకప్ వరకైనా అతడు కోలుకుంటాడా..? లేదా..? అనేది ఆసీస్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది.
ఇదిలాఉండగా ఆసీస్ సెలక్టర్లు టోర్నీ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అనుభవజ్ఞులతో కూడిన స్ట్రాంగ్ టీమ్‌ను ఎంపిక చేశారు. వారిలో ఎక్కువమంది ఆల్ రౌండర్లే ఉండటం గమనార్హం. ఈ ప్రపంచకప్‌లో ఆసీస్.. ఏకంగా ముగ్గురు పేస్ ఆల్ రౌండర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఒక స్పిన్ ఆల్ రౌండర్ , నలుగురు పేసర్లు, ఐదుగురు స్టార్ బ్యాటర్లతో బరిలోకి దిగుతోంది. కానీ టెస్టులలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న మార్నస్ లబూషేన్ మాత్రం ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
Presenting your 15-player men’s provisional squad for the 2023 World Cup!
— Cricket Australia (@CricketAus) September 6, 2023
The final 15-player squad will be confirmed later this month 🇦🇺 #CWC23 pic.twitter.com/wO0gBbadKi
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial