By: ABP Desam | Updated at : 15 Mar 2023 03:25 PM (IST)
Edited By: Ramakrishna Paladi
టీమ్ ఇండియా ( Image Source : PTI )
Aakash Chopra On WTC Finals:
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను (WTC Final) ఇంగ్లాండ్‌లోనే ఎందుకు నిర్వహిస్తున్నారని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ప్రశ్నించాడు. రెండేళ్లు జరిగే ఛాంపియన్‌షిప్‌లో విజేతను ఒక మ్యాచ్ ద్వారా తేల్చడం అసంబద్ధంగా ఉందన్నాడు. కనీసం మూడు టెస్టుల సిరీసు నిర్వహించాలని సూచించాడు. ఈ మేరకు అతడు వరుస ట్వీట్లు చేశాడు.
నాలుగేళ్ల క్రితం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రవేశపెట్టింది. మొదటి సైకిల్లో న్యూజిలాండ్, టీమ్‌ఇండియా ఫైనల్ ఆడాయి. అరంగేట్రం ఫైనల్‌కు లార్డ్స్‌ను వేదికగా నిర్ణయించారు. ఆ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌కు మర్చారు. ఇందులో కివీస్ విజేతగా ఆవిర్భవించింది. రెండో సైకిల్లోనూ ఫైనల్‌కు లండన్‌లోని ఓవల్ ఆతిథ్యమిస్తోంది. చాలా మందికి ఇది నచ్చడం లేదు. అక్కడే ఎందుకు నిర్వహించాలని, దాని వెనక లాజిక్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైగా ఫైనల్ పోటీలను బెస్ట్ ఆఫ్ త్రి ఫార్మాట్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
Why WTC Finals happen only in England? Neutral venue but it mirrors non-Asian conditions. Why does it have only one game? Why not have a Test series to determine the World Test Champion? Why not have one test each at home and one at a neutral venue? Ambitious…yes, of course 1/2
— Aakash Chopra (@cricketaakash) March 14, 2023
'ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనళ్లు ఇంగ్లాండ్‌లోనే ఎందుకు జరుగుతాయి? తటస్థ వేదికని మీరు చెప్పొచ్చు. కానీ ఆసియా ఏతర దేశాల పరిస్థితులను ఇక్కడి వేదికలు ప్రతిబింబిస్తాయి. పైగా ఒక్కటే మ్యాచ్ ఎందుకు నిర్వహించాలి? ప్రపంచ ఛాంపియన్ ఎవరో తేల్చేందుకు టెస్టు సిరీస్ ఎందుకు పెట్టొద్దు? ఫైనల్ ఆడే దేశాల్లో ఒక్కో మ్యాచ్, తటస్థ వేదికలో ఒక మ్యాచ్ ఎందుకు పెట్టకూడదు' అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.
'విజేతను తేల్చేందుకు ఎక్కడా రెండేళ్ల పాటు టోర్నీలు ఉండవు. అందుకే నా వరకైతే ఒక్క మ్యాచునే ఫైనల్ అనొద్దు. టెస్టు క్రికెట్ ప్రత్యేకమైంది. ఐదు రోజులు జరుగుతుంది. ఛాంపియన్‌షిప్ రెండేళ్లు ఉంటుంది. అందుకే ఫైనల్‌ను కచ్చితంగా మూడు మ్యాచుల సిరీస్‌గా నిర్వహించాలి' అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.
ఈసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా (IND vs AUS) చేరుకున్నాయి. జూన్ 7న లండన్‌లోని ఓవల్ మైదానంలో ఫైనల్ ఆడుతున్నాయి. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు గెలవడంతో ఆసీస్ ఫైనల్‌కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ చేతిలో లంకేయులు ఓటమి చవిచూడటంతో, రెండో స్థానంలోని టీమ్‌ఇండియా తుది పోరుకు దూసుకెళ్లింది. కాగా 2-1తో రోహిత్‌సేన బోర్డర్ గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
No tournament lasts two years to find its winner. So, please don’t throw ‘final should be one knockout game’ in my direction. Test cricket is a very unique sport…lasts five days. Championship lasts two years. Finals can surely be a 3-match series. 2/2 🫶
— Aakash Chopra (@cricketaakash) March 14, 2023
Jonny Bairstow: ఐపీఎల్‌కు దూరం అయిన జానీ బెయిర్‌స్టో - పంజాబ్ ఎవరిని తీసుకుంది?
WPL 2023: ఐపీఎల్లో 15 ఏళ్ల క్రితం ధోనీ కొట్టలేని రికార్డుపై కన్నేసిన హర్మన్‌ప్రీత్!
WPL 2023 Final: ఫస్ట్ ట్రోఫీ ఎవరికి? ఫైనల్లో దిల్లీని ఢీకొట్టేందుకు ముంబయి రెడీ!
అఫ్గాన్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్-మూడంకెల స్కోరు చేయడానికి ముప్పుతిప్పలు
డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్-ఎవరీ ఇసీ వాంగ్-రెండో ప్రపంచ యుద్ధంతో ఏంటి సంబంధం?
1980లో ఇందిరా గాంధీకి సంపూర్ణ మెజారిటీ- ప్రధాని మోదీ, షా గుర్తుంచుకోండి!: భట్టి విక్రమార్క
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!
Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!