అన్వేషించండి

Gautam Gambhir: గంభీర్‌ను భస్మాసురుడితో పోల్చిన పత్రిక - పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎంపీ

IPL 2023: టీమిండియా మాజీ క్రికెటర్ ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు మెంటార్ గా ఉన్న గంభీర్.. పంజాబ్ కేసరి పత్రికపై పరువు నష్టం దావా వేశాడు.

Gautam Gambhir: భారత  క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ ఎంపీగా వ్యవహరిస్తున్న బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ పై  పంజాబ్ కేసరి పత్రిక చేసిన  కామెంట్స్  వివాదాస్పదమయ్యాయి.   హిందీ డైలీ అయిన  పంజాబ్ కేసరి..  గంభీర్ ను ఉద్దేశిస్తూ.. ‘భస్మాసుర’అని   పేర్కొనడం లక్నో  మెంటార్ కు కోపం తెప్పించింది.   దీంతో ఆయన  ఆ పత్రికపై   పరువు నష్టం దావా వేశాడు. 

ఇటీవల ఐపీఎల్ లో  బిజీగా గడుపుతూ నియోజకవర్గ  ప్రజలను గంభీర్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ..  పంజాబ్ కేసరిలో  ‘ఎంపీ గౌతం గంభీర్  కనిపించడం లేదు.  ఢిల్లీ  ఎంపీ  లక్నో సూపర్ జెయింట్స్ కు భస్మాసురిడిగా మారాడు. దయచేసి ఆయనను కలిసేప్పుడు దూరం పాటించండి’ అని   పేర్కొన్నది. 

దీనిపై  గంభీర్  పరువుకు భంగం కలిగిందని ఆరోపిస్తూ  అతడి తరఫు న్యాయవాది అనంత్ దెహద్రయ్ ఢిల్లీ హైకోర్టులో  పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇది గంభీర్   ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమేనని  పేర్కొన్నారు.   ఈ మేరకు  పంజాబ్ కేసరిపై   రూ. 2 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు.  పంజాబ్ కేసరి ఎడిటర్  ఆదిత్య చోప్రా, కరస్పాండెంట్  అమిత్ కుమార్, ఇమ్రాన్ ఖాన్  లు పాత్రికేయ స్వేచ్ఛను  దుర్వినియోగం చేశారని ఆయన  దావాలో ఆరోపించారు.

 

కాగా  ఐపీఎల్‌లో   రోహిత్ శర్మ, ధోనిల తర్వాత రెండు టైటిల్స్ నెగ్గిన సారథిగా  ఘనత సాధించిన గంభీర్..  క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి  రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ లీగ్ లో కొనసాగుతూనే ఉన్నాడు.   గత సీజన్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ కు  మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు.  పేరుకు మెంటార్ అయినా హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్  కంటే గంభీర్ పెత్తనమే ఎక్కువ. డగౌట్ లో కూడా   ఆండీ ఫ్లవర్ కంటే గంభీరే ఎక్కువ కనిపిస్తాడు. 

ఇదిలాఉండగా  ఐపీఎల్ లో గంభీర్ మార్గదర్శకత్వంలోని  లక్నో సూపర్ జెయింట్స్..  మంగళవారం  ముంబై ఇండియన్స్ తో  జరిగిన  కీలక పోరులో  ఐదు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.  ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో..  నిర్ణీత 20 ఓవర్లలో  3 వికెట్లు కోల్పోయి  177 పరుగులు చేసింది.  అనంతరం  ముంబై.. 20 ఓవర్లలో  ఐదు వికెట్లు కోల్పోయి  172 పరుగులకే పరిమితమైంది.  ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది.    రోహిత్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్..  నాలుగో స్థానానికి పడిపోయి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget