Fazalhaq Farooqi: ఆఫ్ఘన్ తరఫున ఫజల్‌హక్ రికార్డు - శ్రీలంక మ్యాచ్‌లో అదిరిపోయే బౌలింగ్!
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్‌హక్ ఫరూకీ తన బౌలింగ్‌తో ప్రపంచకప్‌లో జట్టు తరఫున రెండో అత్యుత్తమ గణాంకాలు సాధించాడు.
Fazalhaq Farooqi Record: ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ముఖాముఖి తలపడ్డాయి. పుణే వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఫజల్‌హక్ ఫరూఖీ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఈ ఆటగాడు 10 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి నలుగురు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ బాట పట్టించాడు.
ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ చేసిన బౌలర్ల జాబితాలో ఫజల్‌హక్ ఫరూఖీ రెండో స్థానంలో నిలిచాడు. వాస్తవానికి ప్రపంచకప్ చరిత్రలో ఏ ఆఫ్ఘన్ బౌలర్‌కైనా ఇది రెండో అత్యుత్తమ ఫిగర్. ఈ జాబితాలో మహ్మద్ నబీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 2019 ప్రపంచ కప్‌లో శ్రీలంకపై 30 పరుగులకే నాలుగు ఆటగాళ్లను మహ్మద్ నబీ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మధ్య కార్డిఫ్‌లో జరిగింది.
ఇది కాకుండా ప్రపంచ కప్ 2015లో స్కాట్లాండ్‌పై షాపూర్ జద్రాన్ 38 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. షాపూర్ జద్రాన్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. డునెడిన్‌లో ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది.
మరోవైపు భారత జట్టు వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహా సంగ్రామంలో తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్, అనంతరం పాకిస్తాన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఇప్పుడు శ్రీలంకను కూడా చిత్తుగా ఓడించి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
తమ వరుస విజయాలు గాలివాటం కాదని నిరూపిస్తూ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఏదో అగ్ర జట్టు లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్లు సునాయసంగా గెలిచేసింది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో ప్రపంచకప్‌లో లంకేయుల సెమీస్ అవకాశాలకు దాదాపు తెరపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 45.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు మరింత చేరువ అయింది. రానున్న మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు మ్యాచ్‌లు విజయం సాధిస్తే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుకునే అవకాశం ఉంది. అదే సమయంలో నెట్ రన్ రేట్‌ను కూడా మెరుగు పరుచుకోవాలి.
Skipper Unlocks the 2️⃣0️⃣0️⃣0️⃣-run milestone in ODIs! 🙌🤩#AfghanAtalan's skipper became the 6th Afghan batter to complete 2000 runs in ODIs. He brought up the milestone in his 70th inning at 33.92, with 18 half-centuries to his name. #CWC23 | #AFGvSL | #WarzaMaidanGata pic.twitter.com/LC2hkXFcCU
— Afghanistan Cricket Board (@ACBofficials) October 30, 2023
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial