అన్వేషించండి
Advertisement
Harmanpreet Kaur: కెప్టెన్ల మనసులో మాట - హర్మన్ ఏం చెప్పిందంటే?
Women's T20 WC 2024: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గ్రాండ్ కెప్టెన్స్ డే ఈవెంట్‌తో పొట్టి ప్రపంచకప్ ఆరంభమైంది. రొటీన్ కి భిన్నంగా దుబాయ్ సాంప్రదాయాల్లో కెప్టెన్లు ఫొటోలకు ఫోజులిచ్చారు.
Women's T20 WC 2024: ICC మహిళల T20 ప్రపంచ కప్( Womens T20 World Cup) 2024 కెప్టెన్స్ డేతో ఘనంగా..... ప్రారంభమైంది. ICC మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవానికి గుర్తుగా పది మంది కెప్టెన్లు సమావేశమయ్యారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గ్రాండ్ కెప్టెన్స్ డే ఈవెంట్‌తో పొట్టి ప్రపంచకప్ ఆరంభమైంది. ఈ ఏడాది సాంప్రదాయ కెప్టెన్ల ఫోటో షూట్ విలక్షణంగా జరిగింది. దుబాయ్ సాంప్రదాయాల్లో కెప్టెన్లు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈసారి కప్పు కొట్టేందుకు పక్కా వ్యూహంతో బరిలోకి దిగామని తేల్చి చెప్పారు. భీకర పోరాటాలకు సిద్ధంగా ఉండాలని క్రికెట్ ప్రపంచానికి పిలుపు నిచ్చారు. కెప్టెన్స్ డే సందర్భంగా కెప్టెన్లు ఏమన్నారో ఓసారి చూసేద్దామా..?
The captains unwind before the battle begins at the Women's #T20WorldCup
— ICC (@ICC) October 2, 2024
🤩🔥#WhateverItTakes pic.twitter.com/HLqi01QIpY
హర్మన్‌ప్రీత్ కౌర్.. టీమిండియా కెప్టెన్
" గత మూడు ICC మహిళల T20 ప్రపంచ కప్‌లలో మేం కనీసం సెమీ-ఫైనల్‌కు చేరుకున్నం. ఈసారి కప్పును దక్కించుకునేందుకు శ్రమిస్తాం. ఏ అవకాశాన్ని అంత తేలిగ్గా వదులుకోం. చిన్న పొరపాట్లు చేయవచ్చు కానీ నేర్చుకోవడం ముఖ్యం. నేర్చుకోవడం ఎప్పటికీ ఆగదని నేను భావిస్తున్నా. ప్రతి రోజు నేను నేర్చుకుంటున్నాను. ప్రతి ఆట నుంచి కొత్త పాఠం నేర్చుకుంటాను. మా టీమ్ ఎలా ఆడుతుందో చూడాలి. వాళ్లు రాణిస్తారని నాకు తెలుసు. మా టీమ్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది.”
ఫాతిమా సనా--పాకిస్థాన్ కెప్టెన్
" మా జట్టును ఉత్తమంగా నిలిపేందుకు కెప్టెన్‌గా నేను ప్రయత్నిస్తాను. నిజానికి, మా మేనేజ్‌మెంట్ మొత్తం నాకు మద్దతు ఇస్తోంది. మీరు మైదానంలో ధైర్యమైన నిర్ణయం తీసుకోండి అని వారు నాకు చెప్పారు. , కాబట్టి దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తా "
అలిస్సా హీలీ.. ఆస్ట్రేలియా కెప్టెన్
" ఈసారి ప్రపంచకప్‌ను గెలిచే అర్హత ఇక్కడ ఉన్న పది జట్లకు ఉంది. ఈ ప్రపంచ కప్‌ను గెలుచుకోవడానికి అందరికి సమాన అవకాశాలు ఉన్నాయి. మేం టైటిల్ కాపాడుకునేందుకు వచ్చాం. బీ గ్రూప్ చాలా పటిష్టంగా ఉంది. ట్రోఫీని అందుకోవాలంటే మేం చాలా జట్లను ఓడించాల్సి ఉంది.
హేలీ మాథ్యూస్-వెస్టిండీస్ కెప్టెన్
"మేం ఈ మెగా టోర్నీ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతీ జట్టు ఆడే ప్రతీ సిరీస్.. ప్రతి శిక్షణా సెషన్ ప్రపంచ కప్ కోసమే. కాబట్టి ఇక్కడికి వచ్చేందుకు కచ్చితంగా సుదీర్ఘంగా శ్రమించాం. వెస్టిండీస్ జట్టుగా చాలా కాలంగా ప్రపంచ కప్ కోసం ఎదురుచూస్తున్నాం.
నిగర్ సుల్తానా.. బంగ్లాదేశ్ కెప్టెన్
"అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులందరినీ ఉత్సాహపరిచేందుకు మేము ఇక్కడికి వచ్చాం. ఇది మా అదృష్టం. మాకు ప్రేక్షకుల మద్ధతు లభిస్తుందని ఆశిస్తున్నా. ఎందుకంటే షార్జాలో చాలా మంది బంగ్లాదేశీయులు ఉన్నారు. ఈసారి అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం.
The ultimate showdown through the Dubai Frame 👀
— ICC (@ICC) October 2, 2024
Which one of these captains will have their hands on the Women’s #T20WorldCup trophy? 🤔#WhateverItTakes pic.twitter.com/OkRUpoywHz
హీథర్ నైట్.. ఇంగ్లాండ్ కెప్టెన్
"కెప్టెన్సీ ఎప్పుడూ ఒక సవాలుగా ఉంటుంది. కానీ మేం ఇక్కడ ఉన్నది అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకే. మేం ఈ ప్రపంచకప్ కోసం అత్యుత్తమంగా సిద్ధమయ్యాం. మా జట్టు కూడా చాలా నేర్చుకుంది.
కాథరిన్ బ్రైస్..స్కాట్లాండ్ కెప్టెన్
"అవును, మేము నిజంగా ఈ పోటీలో ఉత్తమ ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాం. క్వాలిఫైయర్‌లలో మేం అద్భుతమైన క్రికెట్ ఆడాం. మేం ఈ టోర్నీలో కూడా అదే చేయాలని భావిస్తున్నాం.
సోఫీ డివైన్--న్యూజిలాండ్ కెప్టెన్
"మహిళల క్రికెట్‌లో ఈ టోర్నమెంట్ చాలా ప్రత్యేకమైనది. ఇది గొప్ప అభివృద్ధి అని నేను చెప్పగలను. మహిళల క్రికెట్ మరింత ప్రొఫెషనల్‌గా మారింది. మా యువ ఫాస్ట్ బౌలర్లు మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నారు. జట్టంతా ఈ టోర్నీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తోంది.
లారా వోల్వార్డ్ట్.. దక్షిణాఫ్రికా కెప్టెన్
"గతంలో కూడా మేం ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాం. సహజంగానే మేం చాలా కష్టతరమైన పూల్‌లో ఉన్నాం. కానీ సెమీ-ఫైనల్స్ చేరడం మొదట మా లక్ష్యం. అది చేయగలమని ఆశిస్తున్నా.
చమరి అటపట్టు - శ్రీలంక కెప్టెన్)
"మేము ఈసారి కూడా అండర్‌డాగ్స్ ట్యాగ్‌తోనే బరిలోకి దిగుతున్నాం. కాబట్టి, మాపై ఎటువంటి ఒత్తిడి లేదు. నేను కానీ మా జట్టు కానీ ఒత్తిడి లేకుండా ఆడాలని అనుకుంటున్నాం. మాది చాలా చిన్న జట్టు. కానీ అత్యుత్తమ ప్రదర్శనను అందిస్తాం.
దుబాయ్, షార్జాలోని రెండు ఆతిథ్య నగరాల్లో 18 రోజుల పాటు జరిగే ప్రపంచ కప్‌లో 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. అభిమానులు టిక్కెట్‌లను ఆన్‌లైన్‌లో లేదా నేరుగా స్టేడియంలలో కొనుగోలు చేయవచ్చు,
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement