అన్వేషించండి
Advertisement
T20 World Cup Final : తక్కువ అంచనా వెయ్యొద్దు బాస్, ఈ జట్టు చరిత్రనే మార్చింది
India Vs South Africa: టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న తుది పోరు కు అస్త్రశస్త్రాలతో దక్షిణాఫ్రికా జట్టు సిద్ధం అయ్యింది. చోకర్స్ అన్న పేరు పోగొట్టుకోవటానికి తీవ్రంగా కృషి చేస్తోంది.
South Africa Vs India: టీ 20 ప్రపంచకప్ ఫైనల్(T20 World Cup)కు దక్షిణాఫ్రికా(SA) అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. 1992లో మొదలైన దురదృష్ట జట్టు అనే చరిత్రను మార్చి కొత్త శకానికి నాంది పలుకుతూ మార్క్రమ్ సేన ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక తమ దేశానికి తొలిసారి విశ్వ కప్‌ను అందించేందుకు కేవలం ఒకే అడుగు దూరంలో ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా(Makram) ఓడిపోకుండా ఫైనల్ చేరిన సఫారీలు.... ఈ మ్యాచ్‌లోనూ గెలిచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తారన్న విషయంలో ఎలాంటి సంశయం లేదు. భారత జట్టు ఎంత పటిష్టంగా ఉందో ప్రొటీస్ కూడా అంతే బలంగా ఉంది.
అన్ని విభాగాల్లో పటిష్టం
ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు ప్రతిభావంతులైన క్రికెటర్లతో సమతూకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్‌లో ప్రొటీస్ బలంగా కనిపిస్తోంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన రబాడ 12 వికెట్లు నేలకూల్చి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అదీకాక భారత్‌పై రబాడకు మంచి రికార్డే ఉంది. అప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రబాడ స్లో బాల్స్‌తో కాబూలీల పని పట్టాడు. ఈ టోర్నమెంట్‌లో రబాడ కేవలం 5.88 ఎకానమితో పరుగులు ఇచ్చి చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. రోహిత్‌పై రబాడ కాస్త ఆధిపత్యం కూడా ప్రదర్శించాడు. టీ 20ల్లో రోహిత్-రబాడ 15 మ్యాచ్‌ల్లో తలపడగా... నాలుగుసార్లు హిట్ మ్యాన్‌ను రబాడ అవుట్ చేశాడు. మరో ప్రొటీస్ బౌలర్ నోకియా కూడా 8 మ్యాచులు అడి 13 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌కు అసలైన ముప్పు షంసీతోనే ఉంది. ఈ స్పిన్నర్ వచ్చినప్పటి నుంచి ప్రొటీస్ బౌలింగ్ చాలా బలంగా మారిపోయింది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లే ఆడిన షంసీ.. 11 వికెట్లు తీశాడు. అసలే విండీస్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తున్న వేళ షంసీని భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అయితే భారత బ్యాటర్లు స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగలగడంతో షంసీ ఏ మేర ప్రభావితం చేస్తాడో చూడాలి. కేశవ్ మహరాజ్, యాన్సెన్ కూడా బౌలింగ్ బానే చేస్తున్నారు. ఈ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించి భారత్ భారీ స్కోరు చేయాల్సి ఉంది.
డికాక్ ఉన్నాడక్కడ..
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ విధ్వంసకరంగా ఉంది. ప్రొటీస్ ఓపెనర్ డికాక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచులు ఆడిన డికాక్ ఇప్పటికే 204 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో టాప్ ఫైవ్‌లో ఉన్న డికాక్‌ను ఎంత త్వరగా అవుట్ చేస్తే భారత జట్టుకు అంత మంచింది. డికాక్‌తో పాటు డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్‌లు కూడా చాలా ప్రమాదకరం. క్లాసెన్ ఓ పది ఓవర్లు క్రీజులో నిలబడ్డాడా మైదానంలో బౌండరీల వర్షం కురవడం ఖాయం. రీజా హెండ్రింక్స్, స్టబ్స్, కేశవ్ మహరాజ్ కూడా బ్యాట్‌తో పర్వాలేదనిపిస్తారు. కాబట్టి వీరి నుంచి భారత బౌలర్లకు సవాల్ ఎదురుకానుం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement