అన్వేషించండి

Jay Shah: దేశవాళీలో ఆడకపోతే అంతే, క్రికెటర్లకు జై షా తీవ్ర హెచ్చరికలు

BCCI :

BCCI secretary Jay Shah  wrote to top cricketers:  టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ కార్యదర్శి జై షా(BCCI secretary Jay Shah)... తీవ్ర హెచ్చరికలు చేశాడు. గాయమైతే తప్ప.. రంజీ ట్రోఫీ లేదా ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్‌లలో ఆడకపోతే  తీవ్ర పర్యవసనాలు ఉంటాయని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లను, భారత్‌-ఏ స్థాయి ఆటగాళ్లను జై షా హెచ్చరించాడు. ఈ మేరకు క్రికెటర్లకు అతడు లేఖ రాశాడు. జాతీయ జట్టులోకి ఎంపికకు దేశవాళీ క్రికెట్‌ ముఖ్యమైన కొలబద్ద అని షా స్పష్టం చేశాడు. కొందరు ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యమిస్తున్నారని.. ఇదా తాము ఊహించలేదని జై షా అన్నాడు.  భారత క్రికెట్‌కు ఎప్పుడూ దేశవాళీ క్రికెట్టే పునాదని గుర్తు చేశాడు.  తామెప్పుడూ దేశవాళీ క్రికెట్‌ను తక్కువగా చూడలేదని కూడా జై షా తెలిపాడు. భారత్‌కు ఆడాలనుకునే ప్రతి ఆటగాడు ముందు దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకోవాలని సూచించాడు. ఆటగాళ్లు దేశవాళీలో ఆడకపోతే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని షా హెచ్చరించాడు. జాతీయ జట్టులో లేకపోయినా ఇషాన్‌ కిషన్‌ రంజీ మ్యాచ్‌ల్లో ఆడకపోవడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జై షా చేసిన తీవ్ర హెచ్చరికలు వైరల్‌గా మారాయి. 

టీ 20 వరల్డ్‌ కప్‌ కెప్టెన్‌గా రోహితే
అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జరిగే పొట్టి ప్రపంచకప్‌(T20 World Cup)లో టీమిండియా(Team India)ను ఎవరు  నడిపిస్తారనే ఊహాగానాలకు తెరపడింది. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియాను అద్భుతంగా నడిపించిన సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma)నే.... టీ 20 ప్రపంచకప్‌లోనూ సారధ్య బాధ్యతలు చేపడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మనే టీమ్‌ఇండియాకు నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తేల్చి చెప్పారు. వరుసగా పది మ్యాచ్‌ల్లో నెగ్గిన తర్వాత.. మనం 2023 వన్డే ప్రపంచకప్‌ గెలవలేకపోయినా, మనసులు గెలిచామని గుర్తు చేసిన జై షా.... 2024 టీ20 ప్రపంచకప్‌లోనూ  రోహిత్‌ సారథ్యంలో త్రివర్ణ పతాకం ఎగరేస్తామని ప్రకటించారు.  రోహిత్ శర్మనే భారత జట్టును ఈ మెగా టోర్నీలో ముందుకు నడిపిస్తాడని  షా  పేర్కొన్నారు.  ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని జై షా క్లారిటీ ఇచ్చారు. జూన్ 4 నుంచి టి20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్ కు వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.

ఎప్పటి నుంచంటే..?
క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ 2024 (T 20 World Cup 2024)షెడ్యూల్‌ వచ్చేసింది. జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా(Canada) తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌(Bharat), పాకిస్థాన్‌(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
Maha Kumbh 2025:  మహా కుంభమేళా ఆఖరి రోజు  ప్రయాగరాజ్ లో సందడి చూశారా!
మహా కుంభమేళా ఆఖరి రోజు ప్రయాగరాజ్ లో సందడి చూశారా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TVK Vijay First Anniversary Speech in Telugu | ఒకడు ఫాసిజం..ఇంకోడు పాయసం..మాటల దాడి చేసిన విజయ్ | ABP DesamMS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP DesamSri Mukha Lingam  Temple History | శివుడు లింగం రూపంలో కాకుండా ముఖరూపంలో కనిపించే ఆలయం | ABP DesamTirumala Kshethra Palakudu Rudrudu Temple | కోనేటి రాయుడి క్షేత్రానికి కాపలా ఈయనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
Maha Kumbh 2025:  మహా కుంభమేళా ఆఖరి రోజు  ప్రయాగరాజ్ లో సందడి చూశారా!
మహా కుంభమేళా ఆఖరి రోజు ప్రయాగరాజ్ లో సందడి చూశారా!
Pawan Kalyan News: పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ
పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ
Apsara OTT release: 'అప్సర'తో ఆహా కొత్త ప్రయోగం... ఈ టీజర్ చూశారా ? వర్టికల్ వెబ్ సిరీస్ అంటే ఏంటో తెలుసా?
'అప్సర'తో ఆహా కొత్త ప్రయోగం... ఈ టీజర్ చూశారా ? వర్టికల్ వెబ్ సిరీస్ అంటే ఏంటో తెలుసా?
MLC Elections 2025:ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభం-సాయంత్రం 4 వరకు పోలింగ్
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభం-సాయంత్రం 4 వరకు పోలింగ్
Coolie Song - Pooja Hegde: సూపర్‌ స్టార్‌తో బుట్ట బొమ్మ... రజనీ 'కూలి'లో పూజా హెగ్డే ఫస్ట్ లుక్ వచ్చేసింది
సూపర్‌ స్టార్‌తో బుట్ట బొమ్మ... రజనీ 'కూలి'లో పూజా హెగ్డే ఫస్ట్ లుక్ వచ్చేసింది
Embed widget