అన్వేషించండి
Advertisement
Dinesh Karthik: ఇంగ్లండ్ పెద్ద ప్లాన్, బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా దినేశ్ కార్తీక్
Dinesh Karthik: భారత్‌లో పర్యటించనున్న ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుకు... టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేయనున్నాడు.
భారత్‌లో పర్యటించనున్న ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుకు(England Lions)... టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik ) బ్యాటింగ్ కన్సల్టెంట్( batting consultant)గా పని చేయనున్నాడు. ఈ పర్యటనలో భాగంగా భారత ‘ఎ’ జట్టుతో ఇంగ్లండ్ అహ్మదాబాద్‌లో 3 నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ టూర్ తొలి 9 రోజుల పాటు కార్తీక్ ఇంగ్లండ్ టీమ్‌కు అందుబాటులో ఉంటాడు. హెడ్ కోచ్ నీల్ కిలీన్ నేతృత్వంలో దినేశ్ కార్తీక్ పని చేస్తాడు.
టీమిండియా ఏ జట్టు ప్రకటన
ఇంగ్లండ్(England)తో టీమిండియా(Team India) టెస్టు సిరీస్‌కు ముందు.. వామప్ మ్యాచ్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(The Board of Cricket Control for India) BCCI భారత్ ఏ జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడేందుకు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ భారత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 12- 20 మధ్య ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఇంగ్లండ్ లయన్స్-భారత్-‘ఏ’ జట్టుతో ఈ మేరకు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 12 నుంచి 13 వ తేదీ వరకు నరేంద్ర మోఢీ స్టేడియంలో రెండు రోజుల వామప్ మ్యాచ్ జరగనుండగా... జనవరి 17 నుంచి 20వ తేదీ వరకు అదే స్టేడియంలో నాలుగు రోజుల మ్యాచ్ జరగనుంది.
భారత్-‘ఏ’ జట్టు
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోష్ రంజన్ పాల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, పుల్కిత్ నారంగ్, నవదీప్ సైనీ, తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్.
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు పుజారా వస్తాడా
ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ జట్టు ప్రకటనకు ముందు.. తానూ రేసులోనే ఉన్నానంటూ బీసీసీఐ సెలక్టర్లకు పుజారా గట్టి సందేశం ఇచ్చాడు. దేశవాళీలో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజరా సత్తా చాటాడు. ఈ నయా వాల్ భారీ శతకంతో సెలక్టర్లకు హెచ్చరికలు పంపాడు. కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పుజారా... జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో రంజీ ట్రోఫీని ఘనంగా ప్రారంభించాడు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా..తొలి మ్యాచ్‌లోనే భారీ శతకంతో చెలరేగాడు.
షమీ సిద్ధం..
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్(World Cup)లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న పేసర్ మహ్మద్ షమీ.. ఇంగ్లండ్(England)తో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమేనని ప్రకటించాడు. స్వదేశంలో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నా అని షమీ ప్రకటించాడు. సెలక్షన్ కమిటీ కోరితే ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగబోయే టీ20 వరల్డ్ కప్‌లోనూ ఆడాలని ఉందని షమీ వెల్లడించాడు. తాను టీ 20లు, వన్డేలు కూడా ఆడతానని... మేనేజ్‌మెంట్ కోరితే పొట్టి ప్రపంచ కప్‌లో ఆడుతా’ అని షమీ తెలిపాడు. ప్రస్తుతం షమీ బెంగళూరులోని క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. గాయం కారణంగా షమీ తొలి రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశముందనే వార్తలు వినిపించాయి. అయితే షమీ తనంతట తానుగా వచ్చేస్తున్నానంటూ తీపి కబురు చెప్పాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జనవరి 25న భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరుగనుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
టెక్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement