David Warner: నా టోపీ దొరికిందోచ్, ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పిన వార్నర్
David Warner: మొత్తానికి ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పోగొట్టుకున్న గ్రీన్ టోపీ దొరికింది. సిడ్నీలో ఆసీస్ ఆటగాళ్లు బస చేసిన హోటల్ లోనే ఆ క్యాప్ లభించిం ది.
మొత్తానికి ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) పోగొట్టుకున్న బ్యాగీ గ్రీన్ క్యాప్ (Baggy Green Cap) దొరికింది. సిడ్నీలో ఆసీస్ ఆటగాళ్లు బసలోని హోట్‌లో ఆ క్యాప్ దొరికింది. దీంతో వార్నర్ చాలా ఆనందపడిపోయాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ విషయంలో తనకు సహాయపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా కార్గో కంపెనీ, హోటల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు అని డేవిడ్ భాయ్ ఇన్‌స్టా వీడియోలో తెలియజేశాడు.
మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి వెళ్తున్న క్రమంలో వార్నర్ తన బాగ్ పొగుట్టుకున్నాడు. తన లగేజ్ నుంచి బ్యాక్‌ప్యాక్ మిస్ అయిందని, అందులోని బ్యాగీ గ్రీన్ క్యాప్ (Baggy Green cap) తనకెంతో విలువైందని, తిరిగి ఇస్తే సంతోషిస్తానని ఓ వీడియోలో చెప్పాడు. తన లాస్ట్ మ్యాచ్ లో అది ధరించి బ్యాటింగ్ కు వెళ్లాలనుకుంటున్నానని వార్నర్ అన్నారు. తన బ్యాక్‌పాక్ కావాలని ఎవరైనా తీసిఉంటే వారికి నా దగ్గర ఉన్న ఇంకో బ్యాక్‌పాక్ ఇస్తానని, కానీ, ఆ క్యాప్ మాత్రం వీలైనంత త్వరగా ఇచ్చేయాలని వార్నర్ ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో విజ్ఞప్తి చేశారు.
ముందంతా టెస్టు క్రికెట్ నుంచి మాత్రమే తప్పుకోనున్నట్టు ప్రకటించిన డేవిడ్ వార్నర్ (David Warner) అకస్మాత్తుగా వన్డేల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. జనవరి 3 (ఈరోజు ) నుంచి సిడ్నీ(Sydney) వేదికగా పాకిస్తాన్(Pakistan)తో జరుగబోయే పింక్ టెస్టుకు ముందు వార్నర్ మాట్లాడుతూ తన కెరియర్లో భయపెట్టిన, అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్నది వెల్లడించాడు. ఇన్ని సంవత్సరాల కెరియర్లో ఎంతోమంది దిగ్గజ బౌలర్లను ఎదుర్కున్నఈ ఆసీస్ స్టార్ ఓపెనర్.. సౌతాఫ్రికా(South Africa) మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Stein ) తనను బాగా భయపెట్టాడని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా 2016-17లో దక్షిణాఫ్రికా ఆసీస్(Ausis) పర్యటనకు వచ్చినప్పుడు స్టెయిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం తనకు కత్తిమీద సాములా అనిపించిందని గుర్తు చేసుకున్నాడు. ప్రత్యేకించి ఆ టెస్టులో 45 నిమిషాల సెషన్ అయితే తమకు చుక్కలు చూపించిందని, . ఆ సందర్భంలో మార్ష్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని చెప్పాడు.